శ్రీ శంకరయ్య గురుదేవులకు ,శ్రీ నేమాని గురు దేవులకు పాదాభి వందనము ======*======== పెసలు రట్టు జేయ పెసరట్టు యగు,నేడు పేరు బెట్ట తెలుగు వారు తెలుగు వెలుగు తేజ రిల్లె,వేష భాషల తోడ దశదిశలకు,జెప్ప వశము గాదె
తెలుగు మాటాడ కున్నను వెలుగు నిచట తెలుగు సంస్కృతి యన్నను విలువ మెండు ఉల్లి పెసరట్టు దోసెలు యుల్ల మలర దేశ దేశాల రుచులను తినగ దొరలు అనుక రింతురు మనలను కినుక లేక !
దేశంకాని దేశంలో తెలుగు సైన్‌బోర్డ్ చూసి ఆనందించి, గర్వించి, ఇక్కడి వారి ఉపేక్షకు చింతించి, కర్తవ్య బోధన చేస్తూ వైవిధ్యంగా పద్యాలను రచించిన కవి మిత్రులు... పండిత నేమాని వారికి, గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, లక్ష్మీదేవి గారికి, సుబ్బారావు గారికి, సహదేవుడు గారికి, వరప్రసాద్ గారికి, ‘ఓం సాయి కన్‌స్ట్రక్షన్’ రాజేశ్వరి అక్కయ్య గారికి, అభినందనలు, ధన్యవాదములు. * సుబ్బారావు గారూ, పండిత నేమాని వారు చెప్పినట్టు ప్రాస దోషమే కాకుండా మీ పద్యంలో మరికొన్ని లోపాలున్నాయి. ‘చూచితి’ ని చూసితి అన్నారు. ‘ఇంకన్’ అనవలసిన చోట ఇంకా అన్నారు. ‘చిగురించెను’ను ‘చిగిరించెను’ అన్నారు. * సహదేవుడు గారూ, నేమాని వారి సవరణను గమనించారు కదా! * అక్కయ్యా, ‘నేడు + అమిత’ అన్నచోట సంధి నిత్యం కదా. అక్కడ ‘నేటి కమిత’ అందాం.
తెలుగు గడ్డ మీద తెలుగును వాడరు
రిప్లయితొలగించండిబడులనేని తెలుగు పలుక రాదు
బళి! ప్రవాసములనె తెలుగు సంస్కృతి చాల
మెరుగులొందుచుండె మేలు మేలు
తెలుగు భాష నిటుల వెలుగు "నట్టు"ల జేసి
రిప్లయితొలగించండిపరుల దేశ మందు పాటు బడెడి
తెలుగు వారి జూచి తెలివి దెచ్చుకొనుచు
తెనుగు వెలుగ నిమ్ము తెలుగు నేల.
దూరముననున్న వారికి
రిప్లయితొలగించండిమీఱిన ప్రేమను, తెలుగది మేలని తోచున్,
చేరువలోనున్న ప్రజకు
దూరపు భాషలు సులువుగ తోచును సుమ్మా!
పెసరట్టు సైను బోర్డును
రిప్లయితొలగించండిచూసితి మఱి యమెరికా లొ చూసితి యింకా
యాసలు నట చిగి రించెను
బాసను మన తెనుగు చూసి బళిరా యంటిన్ .
ఓ సుబ్బారావార్యా!
రిప్లయితొలగించండిప్రాసను విడిచితిరి మొదటి పాదములోనన్
కాసింత ధ్యానముంచ సె
బాసందురు కాదె కంద పద్యమును సుధీ!
పెసరట్టల్లముచట్నీ
రిప్లయితొలగించండికొసరికొసరిపెట్టువారుకొరవడునచటే
యసలైనతెలుగువారల
పెసరట్టంగడిమనోరిపెన్నిధికాదే?
శ్రీ శంకరయ్య గురుదేవులకు ,శ్రీ నేమాని గురు దేవులకు పాదాభి వందనము
రిప్లయితొలగించండి======*========
పెసలు రట్టు జేయ పెసరట్టు యగు,నేడు
పేరు బెట్ట తెలుగు వారు తెలుగు
వెలుగు తేజ రిల్లె,వేష భాషల తోడ
దశదిశలకు,జెప్ప వశము గాదె
అయ్యా! శ్రీ సహదేవుడు గారూ!
రిప్లయితొలగించండిశుభాశీస్సులు.
మీ పద్యములో "మనోరి" ప్రయోగమును మార్చితే బాగుంటుంది. మనకొక అందామా?
వలస వచ్చిన జనులంత తెలుగు వారు
రిప్లయితొలగించండికోటి లింగాలు వెలసిన పూట కూళ్ళు
కనగ దోసెలు పెసరట్టు తినగ నేడు
అమిత ప్రీతిగ రుచు లందు నమెరి కనులు !
తెలుగు మాటాడ కున్నను వెలుగు నిచట
రిప్లయితొలగించండితెలుగు సంస్కృతి యన్నను విలువ మెండు
ఉల్లి పెసరట్టు దోసెలు యుల్ల మలర
దేశ దేశాల రుచులను తినగ దొరలు
అనుక రింతురు మనలను కినుక లేక !
దేశంకాని దేశంలో తెలుగు సైన్‌బోర్డ్ చూసి ఆనందించి, గర్వించి, ఇక్కడి వారి ఉపేక్షకు చింతించి, కర్తవ్య బోధన చేస్తూ వైవిధ్యంగా పద్యాలను రచించిన కవి మిత్రులు...
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
లక్ష్మీదేవి గారికి,
సుబ్బారావు గారికి,
సహదేవుడు గారికి,
వరప్రసాద్ గారికి,
‘ఓం సాయి కన్‌స్ట్రక్షన్’ రాజేశ్వరి అక్కయ్య గారికి,
అభినందనలు, ధన్యవాదములు.
*
సుబ్బారావు గారూ,
పండిత నేమాని వారు చెప్పినట్టు ప్రాస దోషమే కాకుండా మీ పద్యంలో మరికొన్ని లోపాలున్నాయి.
‘చూచితి’ ని చూసితి అన్నారు. ‘ఇంకన్’ అనవలసిన చోట ఇంకా అన్నారు. ‘చిగురించెను’ను ‘చిగిరించెను’ అన్నారు.
*
సహదేవుడు గారూ,
నేమాని వారి సవరణను గమనించారు కదా!
*
అక్కయ్యా,
‘నేడు + అమిత’ అన్నచోట సంధి నిత్యం కదా. అక్కడ ‘నేటి కమిత’ అందాం.
మేటి బర్గరు పిట్జాను మించిపోయి
రిప్లయితొలగించండిపిట్సు బర్గులో పెసరట్టు పేరు బడసె
అతి రుచిగ నుండు భక్షింప నాంధ్రు లకిది
అమెరికన్లును వలెనని యడుగుదురట
మా ఇంట్లో ఇది మామూలే:
రిప్లయితొలగించండిసరదా సరదా పెసర
ట్టు రుచి భలేర పెసరట్టు, టోకున నుప్మా
కరిగిన నేతిన్ జేరిచి
అరడజనైనఁ దిని చూడరా తెలుగోడా!