సమాసములో ఛ తో మొదలిడిన పదము ఉత్తర పదము అయినచో దానిని తప్పక ద్విత్త్వముగనే వాడవలెను. అందుచేత మణిదీపఛ్ఛవి అని సంధియగును. ఈ విషయమును గ్రహించి ఇకపై అటులనే వాడదగును. ప్రస్తుతము నీ పద్యమును సరిజేయవలెను.
అయ్యా! శ్రీ గండూరి లక్ష్మినారాయణ గారూ! అభినందనలు. మీ పద్య పాదము " పండితులు వేద జ్ఞానులు....."లో వేదలోని "ద" గురువు అగును. అందుచేత గణభంగము అగును. వేదవేత్తలు అని మార్చితే సరిపోతుంది. స్వస్తి.
జ్ఞాన సజ్జ్యోతి యజ్ఞాన గాఢ తిమిర
రిప్లయితొలగించండిహరము నిజమది. బాహ్య తిమిరము కలుగ
దీప పంక్తి పో ద్రోలు. మదిని గలిగిన
తిమిరమును పాఱఁదోలదు దీపపంక్తి.
తిమిరమును బారద్రోలుచు దీప పంక్తి
రిప్లయితొలగించండికాంతులను నింపుచుండును గాని జనుల
స్వాంతమునగల యజ్ఞానజనిత గాఢ
తిమిరమును పారద్రోలదు దీప పంక్తి
జ్ఞాన సంకేతము వెలుగజ్ఞానము సరి
రిప్లయితొలగించండిపోలునంధకా రమునకు పొంచి జూడ
నమ్మవారి పూనికలేక నంతరాయ
తిమిర మును పాఱఁదోలదు దీపపంక్తి!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికారుచీకటి యజ్ఞత కానవాలు
రిప్లయితొలగించండిదీప మగును జ్ఞానమునకు ; తిమిర లతల
ద్రుంచ జ్ఞాన లవిత్రము తోడ నెటుల
తిమిరమును పాఱదోలదు దీపపంక్తి ?
చి. తమ్ముడు డా. నరసింహ మూర్తికి శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిసమాసములో ఛ తో మొదలిడిన పదము ఉత్తర పదము అయినచో దానిని తప్పక ద్విత్త్వముగనే వాడవలెను. అందుచేత మణిదీపఛ్ఛవి అని సంధియగును. ఈ విషయమును గ్రహించి ఇకపై అటులనే వాడదగును. ప్రస్తుతము నీ పద్యమును సరిజేయవలెను.
అన్నగారికి ధన్యవాదములు. చక్కని విషయమును చెప్పారు. పద్యమును సవరించాను.
రిప్లయితొలగించండిమద సమీరము జ్ఞానమ్ము మాపు చుండ
నంధకారము మదినెల్ల నలము కొనును
సత్వ శీతల మణిగణ ఛ్ఛవియు తక్క
తిమిరమును పాఱఁద్రోలదు దీప పంక్తి
మా అన్నగారు శ్రీ పండిత నేమాని వారు గురువుగారు శ్రీ శంకరయ్య వంటి జ్ఞానజ్యోతు లిచ్చట ఉంటే అజ్ఞాన తిమిరము ఎక్కువ సేపు నిలువ జాలదు.
రిప్లయితొలగించండిదీపములకెల్ల మ్రొక్కులందింతు నేఁడు.
రిప్లయితొలగించండిలోకమంతట వెలుగులలోన ముంచు
గాని తనదు పీఠము క్రింద గల కటికపు
తిమిరమును పాఱద్రోలదు దీపపంక్తి.
రిప్లయితొలగించండిఅంగారక వారము దీపావళీ వచ్చిన
అంతః కరణ తిమిరము మాయమగునా ?
మనో నాధుడు లేని ఈ మదీయ అంతః
తిమిరమును పాఱఁదోలదు దీపపంక్తి!
జిలేబి
తిమిరమును పాఱఁదోలదు దీపపంక్తి
రిప్లయితొలగించండియనుట తగునేమి? యరయంగ ననవరతము
బ్రహ్మరూపాన హృదులలో వాసముండి
తమము హరియించు చుండంగ ధరణిలోన
పండితులు వేదజ్ఞానులు పలుకు చుంద్రు
రిప్లయితొలగించండిమూర్ఖులను జ్ఞానులను జేయ బోకుమంచు
వాస్తవము మారడజ్ఞాని, వారిలోని
తిమిరమును బాఱద్రోలదు దీప పంక్తి.
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిగురువర్యులు శ్రీ శంకరయ్యగారికి, శ్రీ పండిత నేమానిగారికి,శ్రీ చింతా రామకృష్ణారావుగారికి నాసాష్టాంగ నమస్కారములు. పండితలకు, కవులకు, మిత్రులకు బ్లాగు వీక్షకులకు దీపావళి పర్వదినశుభాకాంక్షలు.
పూజ్య గురువులకు , ప్రియ మైన సోదరులకు ,సోదరి శ్రీమతి లక్ష్మీ దేవి గారికీ , దీపావళి శుభా కాంక్షలు "
రిప్లయితొలగించండిచలువ చంద్రుని వెన్నెల చక్క దనము
మింట చుక్కల కాంతుల మెఱుపు కన్న
మిన్న యైనది కాదన మెఱయు వెలుగు
తిమిర మును పాఱ దోలదు దీప పంక్తి !
తామసగుణంబుహెచ్చియుతనువునిండ
రిప్లయితొలగించండిబుద్ధినుపయోగబరచకబద్ధకించు
దుర్వ్యసనపఱుఁగూడినదురితఫలిత
తిమిరమునుపాఱఁదోలదుదీపపంక్తి!
అయ్యా! శ్రీ గండూరి లక్ష్మినారాయణ గారూ!
రిప్లయితొలగించండిఅభినందనలు.
మీ పద్య పాదము " పండితులు వేద జ్ఞానులు....."లో వేదలోని "ద" గురువు అగును. అందుచేత గణభంగము అగును. వేదవేత్తలు అని మార్చితే సరిపోతుంది.
స్వస్తి.
మిణుగురులు నెన్ని యేకమై మెరయుచున్న
రిప్లయితొలగించండి(తిమిరమును పాఱదోలదు, దీపపంక్తి )
వెలుగు లను పంచిపెట్టును, విశ్వమునను
తారలున్నను పనియేమి? తళుకులేక
రవియునొకడున్న చాలదే రహిని గాంచ!!
వేలవిధములకుత్సిత ,విధులజేసి
రిప్లయితొలగించండిపరులబాధించు దుష్టుల వ్యసనరీతి
మారదెప్పుడు ,మహిలోన ,వారిమదిని
(తిమిరమును పాఱదోలదు, దీపపంక్తి)