2, మార్చి 2014, ఆదివారం

సమస్యాపూరణం - 1339 (తలకాయలపులుసు త్రాగి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
తలకాయలపులుసు త్రాగి తనిసిరి బాపల్.
(ప్రసిద్ధమైన ఈ సమస్య ఎన్నో అవధానాలలో అడుగబడింది.)

23 కామెంట్‌లు:

  1. చిలుకూరి వారి యింటను
    పలురక ములవంట లంట బారెడు రుచులన్
    విలువైన విందు యనుచును చిం
    తలకాయల పులుసు త్రాగి తసిసిరి బాపల్

    రిప్లయితొలగించండి
  2. అలనగ్రహారమందున
    నలభీములపాకశాస్త్ర నైపుణిమెరయన్
    చెలగెడు విందున కన చిం
    తలకాయల పులుసు త్రాగి తసిసిరి బాపల్

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. అలివేణి పెళ్ళి విందున
    పులిహోర వడలు యరిసెలు పూర్ణపు బూరెల్
    భళిభళి యన్నియునని చిం
    తలకాయల పులుసు త్రాగి తసిసిరి బాపల్

    రిప్లయితొలగించండి
  5. ములగయు గుమ్మడి దోసయు
    పలురకముల కాయలనిడి వండగ పులుసున్
    పిలకను ముడివేసి నిమిరి
    తల, కాయల పులుసు త్రాగి తసిసిరి బాపల్

    రిప్లయితొలగించండి
  6. తనిసిరి..తసిసిరిగా పడినదనుకొంటాను..

    ములగయు గుమ్మడి దోసయు
    పలురకముల కాయలనిడి వండగ పులుసున్
    పిలకను ముడివేసి నిమిరి
    తల, కాయల పులుసు త్రాగి తనిసిరి బాపల్

    రిప్లయితొలగించండి
  7. కలిగిన సంసారి బిలువ
    పలురకముల రుచులుతినగ పరుగిడి రకటా!
    పులిసిన చిక్కనిదగు చిం
    తలకాయలపులుసు త్రాగి తసిసిరి బాపల్

    రిప్లయితొలగించండి
  8. అజ్ఞాతకవి పూరణ... (maganti.org నుండి)

    పలుకూరిదేవళంబున
    సలలితముగ మొన్నఁ జేయుసంతర్పణకుం
    దొలుతను మీరంపిన చిం,
    తలకాయలపులుసు తాగి తనిసిరి బాపల్.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘విందు + అనుచును’ అన్నప్పుడు సంధి జరిగి యడాగమం రాదు. అక్కడ ‘విందటంచును’ అంటే సరి!
    *
    "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘వడలు నరిసెలు’ అనండి.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘చింతకాయలు’ అనడమే సరి! కాని వ్యాఖ్యల ప్రారంభంలో ఇచ్చిన ప్రముఖకవి పూరణ చూశారు కదా... ‘యద్య దాచరతి శ్రేష్ఠః తత్త దేవేతరో జనః...... ఆర్యవ్యవహారంబు దుష్టంబు గ్రాహ్యంబు’ అన్నారు కదా!
    తల నిమురుకున్న మీ పూరణ వైవిధ్యంగా ప్రశంసనీయంగా ఉంది. అభినందనలు.
    రాత్రి నిద్రకళ్ళతో మాగంటి వారి సైటునుండి ఆ సమస్యను కాపీ, పేస్ట్ చేసినప్పుడు గమనించలేదు. సినిలు ఒకలాగే కనపడ్డాయి. ఇప్పుడు సవరించాను. ధన్యవాదాలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    చిలగడదుంపల పులుసా! నా బాల్యాన్ని గుర్తు చేశారు. మా అమ్మ చేసేది. ధన్యవాదాలు.
    మీ పూరణ వైవిద్యంగా ఉండి అలరించింది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. నాగరాజు రవీందర్ గారూ,
    ఒరిస్సాలోనేకాదు, వంగదేశంలోనూ బ్రాహ్మణులు చేపలను తింటారు. మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. సొలసిరి జనములు పులసల
    తలకాయల పులుసు త్రాగి, తనిసిరి బాపల్
    పులిహోర గలిపి బూరులు
    మెలమెల్లగ దినిన పిదప మించిన రక్తిన్

    రిప్లయితొలగించండి
  11. సుబ్బారావు గారూ,
    విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. కలవారి యింటి విందుకు
    పలుశాకములన్ రుచియగు వంటలు చేయన్
    చలిబాధయెక్కువైముం
    తల, కాయలపులుసు త్రాగి తనిసిరి బాపల్

    రిప్లయితొలగించండి
  13. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. ఇలువేలుపు దయ నేటికి
    పలువుర కాతిధ్యమిడెడు భాగ్యము మనకున్
    గలిగెఁ, బెరుగుఁ దెమ్ము శకుం
    తల! కాయలపులుసు త్రాగి తనిసిరి బాపల్.

    రిప్లయితొలగించండి
  15. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    తిలలా బలింగు పులిచిం
    తల కాయల పులుసు త్రాగి తనిసిరి బాపల్
    తెలవారగ నామ్లెటు పీ
    తల కాయల పులుసు త్రాగి తనిసిరినేతల్

    రిప్లయితొలగించండి
  16. శ్రీ శంకరయ్య గురుదేవులకు , శ్రీ నేమానిగురుదేవులకు పాదాభి వందనములతో .....
    ================*=================
    వెలివెలియను నూరు నందు వేయి మత్యములెల్ల గూడి
    కలల స్వర్గమ్మును జేర కలకల కదలచునుండ
    వలలకు జిక్కగ వడిగ వండిరి గుమగుమలాడు
    తలకాయల పులుసు,త్రాగి తనిసిరి బాపలు తులసి
    జలమును మిక్కిలిగాను సరసములాడుచు నేడు!

    రిప్లయితొలగించండి
  17. కలవారి పెళ్లి వేడుక!
    పలు కాయల పులుసు వండి వడ్డించగ నా
    నల పాకపు నోరూరిం
    తల, కాయల పులుసు త్రాగి తనిసిరి బాపల్!

    రిప్లయితొలగించండి
  18. రామకృష్ణ గారూ,
    పులుసు తర్వాత పెరుగు తెమ్మని శకుంతలతో చెప్పిన మీ పూరణ నిస్సందేహంగా ఈనాటి పూరణలో ఉత్తమంగా ఉందని భావిస్తున్నాను. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    రెండు విధాలైన పులుసులతో మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    కందుల వరప్రసాద్ గారూ,
    విరుపుతో ఛందోవైవిధ్యంతోను మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    నోరూరింతల పులుసుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. కలకత్తా పురమందున
    వలలోపల చిక్కినట్టి పలురకముల చే
    పల తోకలు, నడుములు మరి
    తలకాయల పులుసు త్రాగి తనిసిరి బాపల్

    రిప్లయితొలగించండి
  20. కలతల కూరల తోడుగ
    పలుతెరగుల నింటి పోరు పచ్చడి తోడన్
    నిలువెత్తు ఋణమ్ముల చిం
    తల కాయలపులుసు త్రాగి తనిసిరి బాపల్

    రిప్లయితొలగించండి


  21. అలసిరి సొలసిరి విషయము
    ల లబ్జుగ గనుచు జిలేబి ! లవలేశంబై
    న లకుచము జేర్చి యిసిఱిం
    తల కాయల పులుసు త్రాగి తనిసిరి బాపల్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి