నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేసిన మిత్రులకు ధన్యవాదాలు. * ఈరోజంతా పండుగ హడావుడి. మధ్యమధ్య అవకాశం దొరికినప్పుడు ‘ఉగాది కవితల’ పోస్ట్ అప్‍డేట్ చేస్తూ వచ్చాను. పండుగపూట పద్యాలలో దోషాలను వెదికే పని పెట్టుకోలేదు. మంచి పూరణలను వ్రాసిన కవిమిత్రులు..... రాజేశ్వరి అక్కయ్యకు, హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి, శైలజ గారికి, మంద పీతాంబర్ గారికి, మారెళ్ళ వామన్ కుమార్ గారికి, అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి, బొడ్డు శంకరయ్య గారికి, నాగరాజు రవీందర్ గారికి, పోచిరాజు సుబ్బారావు గారికి, భాగవతుల కృష్ణారావు గారికి, సంపత్ కుమార్ శాస్త్రి గారికి, గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, సహదేవుడు గారికి, మిస్సన్న గారికి, గండూరి లక్ష్మినారాయణ గారికి, కెంబాయి తిమ్మాజీరావు గారికి, అభినందనలు, ధన్యవాదాలు.
శ్రీ శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని గురువుగారికి ప్రణమిల్లుతూ..ఉగాది శుభాకాంక్షలు ...
రిప్లయితొలగించండిమిత్రులందరికీ పేరు పేరునా ఉగాది శుభాకాంక్షలు...
మిత్రులారా!
రిప్లయితొలగించండిజయ వర్షమ్మున మీకు కల్గుత సమస్తైశ్వర్యముల్ సౌఖ్యముల్
చిగురు మేసిన కోయిల వగరు కూత
రిప్లయితొలగించండియుగ యుగమ్ముల మారని జగతి యందు
దేవ దానవ వైరము దీప్తి నొంద
మత్సరము గూర్చు జయనామ వత్స రమ్ము
సోదరు లందరికీ జయనామ సంవత్సర యుగాది శుభా కాంక్షలు
_____________________________________
వగరు తెలియని కోయిల చిగురు మేసి
జయము లీయగ వచ్చెను భయము వలదు
అరిషడ్ వర్గములు మానవ సాజ మనగ
మత్సరము గూర్చు జయనామ వత్స రమ్ము
పూజ్య గురుదేవులు పండిత లేమాని గారికి, కంది శంకరయ్య గారికి నమస్సులు. ఉగాది శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండికవిమిత్రులందరికి ఉగాది శుభాకాంక్షలు.
అందరికీ జయనామ సంవత్సర "ఉగాది" శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండి"ఇలకు సౌఖ్యంబు లందించి, తొలగజేసి
మత్సరము, గూర్చు జయనామ వత్సరమ్ము
సకల సౌభాగ్యసంపత్తి, సర్వజనుల
కతుల హర్షంబు చేకూర్చు నన్నిగతుల."
శాంతి సౌఖ్యమ్ము లొనగూర్చి సాయు జేసి
రిప్లయితొలగించండిమత్యరమ్ము, గూర్చు జయనామ వత్సరమ్ము
భోగ భాగ్యమ్ము లందించి భూరి గాను
సంతసమ్మును గల్గించు సర్వులకును
చింతలను కూల్చు, చీకట్ల చీల్చు ,పూడ్చు
రిప్లయితొలగించండిమత్సరము, గూర్చు జయ నామ వత్సరమ్ము
సుఖము శాంతిని జనులకు శుభముగలుగ!!!
వంద నమ్ములు శంకర బృందమునకు !!!
రాజ్యాధిపతి యగుచు రజని కాంతుడు ఘనము
రిప్లయితొలగించండిమంత్రాంగమును గూడ బలిమి జేయు ;
సేనాధిపతి రవి, సీమ రక్షణ తోడ,
అర్ఘ్య మేఘముల నధికపరచు ;
సస్యేశుడు బుధుడు సాదముల్ బెంచుచు
నీరసములగూడ నేర్పు జూచు ;
ధాన్యాధిపతి కుజుడు ధాన్యమధికమునిచ్చు
రాజగు శుక్రుడే రసములకును ;
నవనాయకులునిప్డు నష్టమెక్కుడునిత్రు
అల్లకల్లోలములధికమగును ;
వరద,తుఫానులు వరుసగ బాధించు
చెడువాసనలు పెక్కు చెడుపు జేయు ;
వచ్చుచున్నది క్లేశపు వాసి గాను
మత్సరము గూర్చు జయ నామ వత్సరమ్ము
కూడి తగు జాగరూకత తోడికొనుచు,
కలసియుందము ! రండి ! సుకర్ములార !
కలత లున్నట్టి యాంధ్రుల కాపురమ్ము
రిప్లయితొలగించండివేరు జేసెను ధ్రుఢముగా విజయ, యెట్టి
మత్సరము గూర్చు జయనామ వత్సరమ్ము?
జయము గలిగించు నిజముగా జయయుగాది
మంచితనమను భావన మనుజులందు
రిప్లయితొలగించండిపెంచి పోషించ నెంచియు త్రుంచి వేయు
మత్సరముఁ; గూర్చు'జయ'నామ వత్సరమ్ము
సకల సౌఖ్యము లెల్లరు సంతసించ!
గురు దేవులు శ్రీ కంది శంకరయ్య గారికి మరియు పండిత నేమాని గారికి, బ్లాగు కవి మిత్రులకు, బ్లాగు వీక్షకులకు జయనామ సంవత్సరాది శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండికమ్మని గొంతుతో మధుర గానము జేయుచు చెట్టుకొమ్మపై
రిప్లయితొలగించండినిమ్ముగ గూరుచుండి కడు హృద్యముగా 'జయ' నామవత్సమున్
సమ్మతితో వినమ్రముగ స్వాగత గీతము లాలపించుచున్
రమ్మని కోరె కోయిలలు రక్షణ జేయగ లోకులెల్లరన్ !
పోచిరాజు సుబ్బారావు గారి పూరణ.....
రిప్లయితొలగించండిమత్సరముఁ గూర్చు జయనామవత్సర మ్మ
టన్న నార్యలిఖిత మది యర్థరహిత
ముగను దోచెను, చదువుము మూర్తి! నీవు
జయముఁ జేకూర్చు మన కది సతతముగను.
దేశ భక్తులమని బల్కి దేశభుక్తు
రిప్లయితొలగించండిలయిన నేతల నడుమ ననంతమైన
మత్సరముఁ గూర్చు జయనామవత్సరమ్ము,
శాంతి సౌఖ్యము లిడుగాత జనుల కైన !
రాజకీయపార్టీలకు, రాజకీయనాయకులకు ఎన్నికలవేళ మత్సరమే కదా!!
రిప్లయితొలగించండిఎన్నివకలవేళ వీరు మేల్కొన్నవారు
కుటిలమంత్రాంగులై ప్రభుత కోరువారు
తమకుదక్కకనొరులకు దక్కనీరు
మత్సరము గూర్చు జయనామ వత్సరమ్ము.
కవులకు, పండితులకు సర్వజనశ్రేయోభిలాషులకు ఒకరినిమించి ఒకరికి తామేగొప్పగా చేయాలనే తపన కలగాలని కోరుతూ.....
సర్వసత్కార్యములయందు చదువులందు
దానమందున భక్తినిధానమందు
పెంపువహియింపగోరి సాధింపవలయు
మత్సరము గూర్చు జయనామ వత్సరమ్ము.
విజయ జూడగ నాంధ్రనే విడగ జేసె
రిప్లయితొలగించండినైన నేమిలె మనమన్న యతడు తమ్మి
జయను మనసులు కలుపుచు మసలకున్న
మత్సరముఁ గూర్చు జయనామవత్సరమ్ము
ఎన్నికలలో గెలువ నెన్ని యెత్తు గడలు?
రిప్లయితొలగించండినెన్ని కలలలో జనముండి యెదురు జూడ
నూహకందని పరిణామ మోర్వ లేక
మత్సరముఁ గూర్చు జయనామ వత్సరమ్ము
నీతి మాలిన రాజకీయాతురులకు,
రిప్లయితొలగించండినల్ల డబ్బుకు, మన జేబు చిల్లులకును,
తీవ్ర వాదంపు ముప్పుకు తీట దీర
మత్సరముఁ గూర్చు జయనామవత్సరమ్ము
మార్చుకుత్సిత మానవ మనములోని
రిప్లయితొలగించండిమత్సరము; గూర్చు జయనామ వత్స రమ్ము
సిరుల వెలుగులు సంతోష పరిమళములు
నూత నోత్తేజమ త్యంత ఖ్యాతి జయము.
జయనామ సంవత్సర శుభా కాం క్షలు
రిప్లయితొలగించండిఇందు మొదటగా గురువులు కంది శంక
రయ్య ,నేమాని ,గోలివారాది కవిగ
ణంబుల కిడుచు ననిశము నతుల శతము
నందు కొనుడని బ్రార్ధింతు నాదరమున
జయము కలిగించి గావుత ! జయ మనబడు
వత్సర మెపుడు శంకరా భరణ గణపు
సోదరీ మణులు మఱియు సోదరులను
నెల్ల వేళల దప్పక చల్ల గాను
పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
:విజయ దెచ్చెను’ ఆంద్ర ‘ కు విభజనమ్ము
:మత్సరము గూర్చు ‘జయ ‘నామ వత్సరమ్ము
“మమ్ము గెలిపించి పగ్గముల్ మాకిడంగ “
“నందన”ను దెత్తు మనిరి మన నాయకాళి
నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేసిన మిత్రులకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి*
ఈరోజంతా పండుగ హడావుడి. మధ్యమధ్య అవకాశం దొరికినప్పుడు ‘ఉగాది కవితల’ పోస్ట్ అప్‍డేట్ చేస్తూ వచ్చాను. పండుగపూట పద్యాలలో దోషాలను వెదికే పని పెట్టుకోలేదు.
మంచి పూరణలను వ్రాసిన కవిమిత్రులు.....
రాజేశ్వరి అక్కయ్యకు,
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
శైలజ గారికి,
మంద పీతాంబర్ గారికి,
మారెళ్ళ వామన్ కుమార్ గారికి,
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
బొడ్డు శంకరయ్య గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
పోచిరాజు సుబ్బారావు గారికి,
భాగవతుల కృష్ణారావు గారికి,
సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
సహదేవుడు గారికి,
మిస్సన్న గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
కెంబాయి తిమ్మాజీరావు గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.