18, మార్చి 2014, మంగళవారం

సమస్యాపూరణం - 1355 (కాకియుఁ గోకిలము గలసి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కాకియుఁ గోకిలము గలసి కాఁపుర ముండెన్.

16 కామెంట్‌లు:

 1. కాకులు తెలియక పెంచును
  కోకిల పిల్లలను పొదిగి గోముగ తనరన్
  లోకులు పలుగాకులు గద
  కాకియు గోకిలము గలసి కాపుర ముండెన్

  రిప్లయితొలగించండి
 2. శ్రీకరుడను మునివర్యుడు
  ప్రాకటముగ తపముచేయు ప్రాంతమునందున్
  చీకాకు నొందకుండగ
  కాకియు గోకిలయు గలసి కాపురముండెన్.

  రిప్లయితొలగించండి
 3. ఈ కుల మత భాషలతో
  మా కేమని పడుచు జంట మక్కువ తోడన్
  లోకులు వ్యతిరేకించిన
  కాకియు గోకిలయు గలసి కాపురముండెన్.

  రిప్లయితొలగించండి
 4. శ్రీకృష్ణ వర్ణ గాయకుఁ
  శ్రీకాకుళపు నల పిల్ల, చేపట్టంగన్
  లోకులు చూచి తలంచిరి
  కాకియు కోకిలయు కలసి కాపుర ముండెన్

  రిప్లయితొలగించండి
 5. కోకిల గ్రుడ్లను బొదుగుచు
  కాకులు మఱి బెద్ద జేయు కాకిగ దలచిన్
  ఆ కణ్వుని యాశ్రమమున
  కాకియు కోకిలము కలసి కాపుర ముండె న్

  రిప్లయితొలగించండి
 6. మా కుఱ్ఱలు బలికిరొకచొ
  కాకియుఁ గోకిలము గలసి కాఁపుర ముండెన్.
  లేకున్న కాకి పొదుగగ
  కోకిల లెటు వచ్చె చెప్పుకొండనిరహహా !


  కాకులు కోకిలలె కవులు
  మాకీ వ్యాకరణములును మార్పులు సంధుల్
  జోకులవలెనున్నను మరి
  కాకియుఁ గోకిలము గలసి కాఁపుర ముండెన్.

  రిప్లయితొలగించండి
 7. కీకారణ్యమునందున
  సాకల్యము నివసనమ్ము చక్కగ జేయున్
  మూకలగు జంతుతతులను
  కాకియుఁ గోకిలము గలసి కాఁపుర ముండెన్.

  రిప్లయితొలగించండి
 8. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘తలచిన్’ అన్న ప్రయోగమే తప్పు.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి


 9. కాకిస్వరపు రాంబాబుకు
  కోకిల వలె పాడగలుగు కోమలి రమతో
  ప్రాకటముగ పెండ్లిజరిగె
  కాకియుఁ గోకిలము గలసి కాఁపురముండెన్

  రిప్లయితొలగించండి
 10. పుష్యం గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. లోకమున వింత గాదిది
  కాకర వారింటివెనుక గన్పడునిదియే
  కేకియు గువ్వలు, చిలుకలు
  కాకియు కోకిలము గలసి కాపురముండెన్

  రిప్లయితొలగించండి
 12. కాకమువలెనుండుహరిని
  కోకిలవలెపాడురాధ కోరి వరించెన్
  లోకులిదిజూచి దలచిరి
  కాకియు గోకిలము గలసి కాపురముండెన్

  రిప్లయితొలగించండి
 13. శైలజ గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. లోకసభ యెన్నికలలో
  పోకాలము దాపురించ, మోడీ మొత్తన్,
  చీకాకులు తప్పవనుచు
  కాకియుఁ గోకిలము గలసి కాఁపుర ముండెన్

  రిప్లయితొలగించండి


 15. హాకండు యింద్ర జాలికు
  డౌ !కాగళికన్ జిలేబి రమ్యంబుగనన్,
  మ్రోగింపగ మురిపెముగన్
  కాకియుఁ గోకిలము గలసి కాఁపుర ముండెన్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 16. తేకువతో పోరాడుచు
  భీకరమగు యుద్ధమునను బెంబేలనగన్
  లోకసభను నాకలితో
  కాకియుఁ గోకిలము గలసి కాఁపుర ముండెన్

  రిప్లయితొలగించండి