క్రింది పద్యంలోని చమత్కార మేమిటి?
కం.
ఏమీనన తా బేలన
నా ముంగిటి కేల రాడు నరహరి పిన్నా
రాముల ముమ్మా రంపిన
ప్రేమను మరి బుద్ధి చెప్పి పిలువవె కలికీ!
(ఏమీ అనను. తాను బేలవాఁడు. నా ముందరకు ఎందుకు రాడు? ఆ నరహరి పిన్నవాఁడు. రాములును ముమ్మారులు పంపించాను. నీవైనా బుద్ధి చెప్పి పిలువవే. కలికీ!)
కం.
ఏమీనన తా బేలన
నా ముంగిటి కేల రాడు నరహరి పిన్నా
రాముల ముమ్మా రంపిన
ప్రేమను మరి బుద్ధి చెప్పి పిలువవె కలికీ!
(ఏమీ అనను. తాను బేలవాఁడు. నా ముందరకు ఎందుకు రాడు? ఆ నరహరి పిన్నవాఁడు. రాములును ముమ్మారులు పంపించాను. నీవైనా బుద్ధి చెప్పి పిలువవే. కలికీ!)
దశావతారాలు స్పృశించబడి నట్లున్నాయండీ కందంలో
రిప్లయితొలగించండిఫ్రణామములు గురువుగారు...
రిప్లయితొలగించండిపద్యములో మీన,తాబేలు,పిన్న,నరహరి ఇలా వచ్చాయి కనుక దశావతారములని నా భావన..
రామకృష్ణ గారూ,
రిప్లయితొలగించండిశైలజ గారూ,
నిజమే. ఆ పద్యంలో దశావతారాలు పేర్కొనబడ్డాయి.
మీన (మత్స్య), తాబేలు (కూర్మ), కిటి (వరాహ), నరహరి (నృసింహ), పిన్న (వామన), రాములు (పరశురాముఁడు, శ్రీరాముఁడు, బలరాముడు), బుద్ధి (బుద్ధ), కలికి (కల్కి).
కృష్ణావతారం?
రిప్లయితొలగించండిపుష్యం గారూ,
రిప్లయితొలగించండిదశావతారాల లెక్కలో కొంత అభిప్రాయబేదం ఉంది. బుద్ధావతారాన్ని కొందరు పరిగణించరు. బలరామ, కృష్ణ, కల్కి... ఒక లెక్క... కృష్ణ, బుద్ధ, కల్కి.. మరో లెక్క...
ఈ విషయంలో పండిత నేమాని వారు మనకు మార్గదర్శనం చేయాలి.
భగవంతుని లీల లువరు
రిప్లయితొలగించండిసగ పదియునుదెలిపి రార్య ! చక్కగ నచట న్
మొగములు మఱి విక సించెను
పగతుర కది కంటకమ్ము పావన చరితా !
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
మిత్రులకు శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిదశావతారముల గురించి భిన్న భిన్న అభిప్రాయములు కలవు.
మత్స్య, కూర్మ, వరాహశ్చ,
నారసింహశ్చ, వామన
రామో, రామశ్చ, రామశ్చ,
బుద్ధః కలికి మేవచ
అని ఒక ఆర్యోక్తి కలదు. ముగ్గురు రాములు అంటే పరశు రాముడు, రఘురాముడు, బలరాముడు అంటారు.
కృష్ణస్తు భగవాన్ స్వయం -- కాబట్టి కృష్ణుడు అవతారము కాదు - స్వయముగా భగవానుడే - 16 భగవంతుని అంశలు కలవాడు కాబట్టి అవతారము కాదు అని అంటారు. ఈ విషయములో శ్రీరామునికి కూడా 12 అంశలే అంటారు. అందుచేత శ్రీరామచంద్రుడు అవతార పురుషుడే.
బుద్ధావతారము గురించి కూడా కొన్ని అభిప్రాయ భేదములు కలవు. పురాణ బుద్ధుడు అంటే శ్రీహరి మాయాగురువుగా బుద్ధుడై త్రిపురాసురుల భార్యలకు గురువై వారిని మోసగించును.
స్వస్తి.