16, మార్చి 2014, ఆదివారం

పద్య రచన – 537 (హోళీ)

కవిమిత్రులారా,
ళీ ర్వది శుాంక్షలు!
 పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

  1. ఆడరారె రంగు రంగులాట నేడు హాయిగా
    నాడరారె గోకులంపు టందగాని తోడుగా
    తోడు నీడయైన వెన్న దొంగ తోడ నంచు న
    వ్వాడ వాడలందు నెల్ల వారు చేరి రొప్పుగా

    పాడుచుండె కమ్మనైన పాట బాలకృష్ణుడే
    పాడుచుండె వేణుధరుడు పరవశింప జేయుచున్
    ఏడి యేడి నందసూను డెందునున్న వాడురా
    జాడ తెలియకున్న దేమి చాల వింత వింతగా

    రండు రండు తోటలోన రంగులాట లాడగా
    రండు రండు కృష్ణు జేరి రాసలీల తేలగా
    పండువౌను నేడు మనకు వాని కొంటె చేతలే
    పండు వెన్నెలన్ జెలంగవచ్చు నంచు బల్కుచున్

    చేరిరంత కన్నెలెల్ల స్నిగ్ధ మానసములతో
    వారిజాక్షు తోడ నాట పాటలందు దేలగా
    చారు సూర్యజా తటిన్ ప్రశస్త పుష్ప వాటిలో
    సారసాక్షు డొప్పగా ప్రసన్న మానసంబుతో

    అంత లీల జూపె కృష్ణు డంగనాళితో బళా
    వింత లెన్నొ జేసి దాల్చి పెక్కు రూపముల్ వెసన్
    కాంత కాంత నడుమ నొప్పె కంజనేత్రు డిమ్ముగా
    నింతు లెల్లరకును పొంగ హృదయముల్ ముదమ్ముతో

    రిప్లయితొలగించండి
  2. అమ్మా! లక్ష్మీదేవి గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    4వ పాదములో గణములు సరిగా లేవు. సవరించండి.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  3. హోళిక రక్కసి యనగను
    కేళిగ శిశువులను దినుచు కీడొన రించన్
    హోళికను హతము జేయగ
    హోళిక పేరున నిలచెను హోళీ యనుచున్

    రిప్లయితొలగించండి
  4. రంగు రంగు జలము లెన్నొ రంగ రించి జల్లు చున్
    పొంగు సంత సంబు నందు పొలతు లంత నృత్య ముల్
    చెంగు చెంగు మనుచు మురిసి చెలియ గూడి పున్న మిన్
    రంగ రంగ వైభ వమ్ము రాజ మార్గ మంత టన్

    రిప్లయితొలగించండి

  5. సవరించిన పద్యము

    మెండైన వర్ణములహో! మెఱుగైన నవ్వుల్!
    నిండారు సంతసములన్నియు నెక్కొనంగన్
    దండంబు లందుము యశోదసుతుండ! మాపై
    కొండంత నీ దయ సదా కురిపించుమయ్యా!

    ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి

  6. అందరికీ వసంతోత్సవ శుభాకాంక్షలు.

    ఎరుపురంగులు వడ నెదదెంతొ రంజిల్లు
    పసుపురంగు బడగ పరవశించు
    నాకుపచ్చ బులుమ హరితమై హాయందు
    బుక్కాల జల్లగా పులకరించు
    చిమ్మనగొట్టమ్ము చేతిలో ధరియించి
    రంగులన్ని నీట రంగరించి
    నీరునింపుచు లోన నిలుచుని చిమ్ముచున్
    హోళియాటలనడ హొయలుగాను

    సంతసించు మది వసంతోత్సవమ్మున
    రండు రంగులంది రయముగాను
    సహజమఈన రంగు సరిపడు నొంటికి
    వేరు రంగుకొడలు తీరు మారు.

    రిప్లయితొలగించండి


  7. అందరికీ వసంతోత్సవ శుభాకాంక్షలు.

    ఎరుపురంగులు వడ నెడదెంతొ రంజిల్లు
    పసుపురంగు బడగ పరవశించు
    నాకుపచ్చ బులుమ హరితమై హాయందు
    బుక్కాల జల్లగా పులకరించు
    చిమ్మనగొట్టమ్ము చేతిలో ధరియించి
    రంగులన్ని నీట రంగరించి
    నీరునింపుచు లోన నిలుచుని చిమ్ముచున్
    హోళియాటలనడ హొయలుగాను

    సంతసించు మది వసంతోత్సవమ్మున
    రంగులంది రండు రయముగాను
    సహజమఈన రంగు సరిపడు నొంటికి
    వేరు రంగుకొడలు తీరు మారు.

    రిప్లయితొలగించండి
  8. హొళీ పండుగ రోజున
    పాళియ గాం డ్రం ద రచట భామల తోడన్
    వేళా కోళ ము లాడుచు
    హేళ ముగా రంగు పూ సి హీ హీ యనిరీ .

    రిప్లయితొలగించండి
  9. రంగులు చిందే పండుగ
    ముంగిట నిలిచెను వసంత పూతలతోడన్
    చెంగున దూకెడి జింకల
    భంగిని యుత్సాహమివ్వ వచ్చెను హోళీ!

    రిప్లయితొలగించండి
  10. పండిత నేమాని వారూ,
    శ్రీకృష్ణుని వసంతోత్సవ కేళీకలాపాలను మనోహరంగా చిత్రిస్తూ లయబద్ధమైన చక్కని ఖండిక చెప్పారు. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ సీసపద్యం చక్కగా ఉంది. అభినందనలు.
    మూడవ పాదంలో గణం తప్పింది. ‘రంగులన్నియు నీట’ అంటే సరి.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘చిందే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘వసంత పూత’ అని సమాసం చేయరాదు. నా సవరణలతో మీ పద్యం....
    రంగులు చిందెడి పండుగ
    ముంగిట నిలిచెను వసంత పుష్పమ్ములతో
    చెంగున దూకెడి జింకల
    భంగిని నుత్సాహ మొసగ వచ్చెను హోళీ!

    రిప్లయితొలగించండి
  11. నేమాని పండితుల స్ఫూర్తితో:

    గోకులమ్ము లోన నాడు గోపబాలు రందరున్
    వేకువన్ యశోదపట్టి వెంటనంటి వీధులన్
    చీకు చింత మరచి యాడ చేరి రంగులాటలన్
    నాక వాసు లరగి నారు నంద వ్రజము జూడగన్.

    రంగురంగు పూల తోడ రమ్యమైన వనులలో
    హంగుగాను రంగులెల్ల నలదుకొనుచు నొండొరుల్
    నింగి నేల జేసినారు నెలవు వర్ణశోభలన్
    పొంగె యమున పట్టలేక, ప్రొద్దు వాలె నంతలో

    బాలకృష్ణు డాన్చ వేణు వల్ల నల్ల నోష్ఠమున్
    జాలు వారె పాట మంద్రజాల మహిమ జూపుచున్
    గాలి నింగి నీరు నేల కమ్మనైన పాటకున్
    సోలి పోయె కరగి పోయె చోద్య మాయె నంతటన్

    గోపబాలు రాట మరచి గోపబాలు వంకకే
    చూపులన్ని నిలపినారు చుట్టు జేరినారదే
    గోపకాంత లిహము మరచి కూర్మి కృష్ణు డొక్కడే
    తోప వారి వారి చెంత త్రుళ్ళి త్రుళ్ళి యాడిరే

    వేణు గాన లహరి లోన విశ్వవిభుడు సర్వులన్
    తాను తక్క నన్య మేమి ధరణి లేని రీతిగన్
    పూని యోల లాడ జేయ పులకరించి రెల్లరున్
    ప్రాణికోటి పరవశించె రమ్యవర్ణ శోభలన్

    'ఏమి జన్మ మిట్టి నాక మేల మాకు నేడహో
    భూమి పైన పుట్టి యున్న పొందుగూడి కృష్ణునిన్
    మేము గూడ యాడి పాడి మిడిసిపడుదు మయ్యయో
    ఏమి భాగ్య ముర్వి జనుల' కిట్లు సురలు వగచిరే

    మోహనాంగు రాస లీల ముగ్ధమై రహించగన్
    దేహ భ్రాంతి వీడి నాడు దివ్య గాన లహరిలో
    నాహ యంచు జీవు లెల్ల నైక్యమై తరించగన్
    సోహ మన్న భావ మేలె చూడ నుర్వి నంతటన్.

    రిప్లయితొలగించండి
  12. హోళీ పండుగ రంగుల
    కేళీ! బావా మరదలు కేరింతలతో
    వేళ మరచిహాయి గొలుపు
    హేళా రవముల పరవశ మిచ్చును గాదే!

    రిప్లయితొలగించండి
  13. దుష్ట శక్తి పైన శిష్టుల విజయమ్ము
    పండుగాయె దేశ ప్రజలకెల్ల
    రంగు లెన్నొ జల్లి రంజిల్లు చుండిరి
    వాడ వాడ లందు వేడుకగను

    రిప్లయితొలగించండి
  14. అయ్యా మిస్సన్న గారూ!శుభాశీస్సులు.
    భలా!

    రిప్లయితొలగించండి
  15. గురుదేవులకు నమస్కారములు, సవరణకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  16. మిస్సన్న గారూ,
    రమ్యమైన ఖండిక నందించారు. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
    ‘తెలుపు నెన్ని రంగులో’ అనండి.

    రిప్లయితొలగించండి
  17. మాస్టరు గారూ ! ధన్యవాదములు.
    మీరు చూపిన సవరణతో మరియొక టైపాటును సవరించి నా పూరణ...

    ఎరుపురంగులు వడ నెడదెంతొ రంజిల్లు
    పసుపురంగు బడగ పరవశించు
    నాకుపచ్చ బులుమ హరితమై హాయందు
    బుక్కాల జల్లగా పులకరించు
    చిమ్మనగొట్టమ్ము చేతిలో ధరియించి
    రంగులన్నియు నీట రంగరించి
    నీరునింపుచు లోన నిలుచుని చిమ్ముచున్
    హోళియాటలనాడ హొయలుగాను

    సంతసించు మది వసంతోత్సవమ్మున
    రంగులంది రండు రయముగాను
    సహజమైన రంగు సరిపడు నొంటికి
    వేరు రంగుకొడలు తీరు మారు.
    ( "రంగు పడును " వేరు రంగు వాడ ) ..రంగు పడుద్ది...అని...

    రిప్లయితొలగించండి
  18. నేమాని పండితార్యా! ధన్యవాద శతము.

    గురువుగారూ ధన్యవాదాలు.

    రవీందర్ గారూ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి