22, మార్చి 2014, శనివారం

సమస్యాపూరణం - 1359 (కామితార్ధముల్ సిద్ధించు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కామితార్థముల్ సిద్ధించు లేమి వలన
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

15 కామెంట్‌లు:

  1. బద్ధకమ్ముయు, ద్వేషమ్ము పరులపైని
    నిందవేసెడి గుణములు నిజము నుడువు
    టందు భయముయు లేకున్న హాయి, చూడ
    కామితార్థముల్ సిద్ధించు లేమి వలన

    రిప్లయితొలగించండి
  2. భుక్తి కఱవైన మనుటకు శక్తిలేక
    రక్తినావల విధిపైన వ్యక్తపరుప
    భక్తి గొలువగ జీవికి ముక్తిగలుగు
    కామితార్థముల్ సిద్ధించు లేమి వలన

    రిప్లయితొలగించండి
  3. మంచి మార్గమున్ పయనించు మానవులకు
    కామితార్థముల్ సిద్ధించు, లేమివలన
    కలుగు నిడుములంచు మదిన తలచ వలదు
    శర్వుపైన భారమునుంచి సాగవలయు

    రిప్లయితొలగించండి
  4. శాస్త్రసమ్మత మగునట్టి చర్య వలన
    కామి తార్ధముల్ సిద్ధించు , లేమి వలన
    బ్రదుకు నన్నాళ్ళు భూమికి భార మగుచు
    గడుప వలయును రోజులు కాకి వోలె

    రిప్లయితొలగించండి
  5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘బద్ధకమ్మును... భయమ్మును’ అనండి.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. లేని దానిని పొందగ రేగు మనసు
    పొంద కోరిన నర్థమ్ము నంద వలయు
    కష్టపడినంత ధనమును గలుగ వచ్చు
    కామితార్థముల్ సిద్ధించు లేమి వలన

    రిప్లయితొలగించండి
  7. సత్య పధమున సాగెడు సర్వులకును
    కామితార్ధముల్ సిద్ధించు, లేమి వలన
    కలతలవలలో జిక్కును కాపురములు
    చిత్త మందున హరినామ చింత యున్న
    వెతలు దీరును మనుజుల బ్రతుకు మారు

    రిప్లయితొలగించండి
  8. సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. ఉండెనే మున్ను యిన్నిన్ని నుర్విలోన
    కృషిని నమ్మిన విజ్ఞాన ఋషులు కలిసి
    సుఖమయమ్ముగ జేసిరి నిఖిల జగతి
    కామితార్థముల్ సిద్ధించు లేమి వలన !!!

    రిప్లయితొలగించండి
  10. పిల్లవాండ్రకుఁ దిండిలేకల్ల యొకడు
    కృష్ణ దర్శనమునుఁ జేసె కీర్తి పొందె;
    జగతి యందు నొక్కొక్కని జాతకమున
    కామితార్థముల్ సిద్ధించు లేమి వలన

    రిప్లయితొలగించండి
  11. మంద పీతాంబర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘యుర్విలోన’ అనండి.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. మారు తల్లియె బాధించె మమత లేక
    తపము జేయంగ బుధుడంట ధన్యు డవగ
    వెలిసి ముదమంది నింగిని వెలుగు చుండె
    కామి తార్ధముల్ సిధ్హించు లేమి వలన

    రిప్లయితొలగించండి
  13. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. పండిత నేమానిగారికి పూజ్య గురుదేవులు శoకరయ్య
    గారికి వందనములు
    కృషియు దీక్షయు కలుగు పురుషుల కెపుడు
    కామితార్ధముల్ సిద్ధించు .లేమి వలన
    చేతి కందిన ఫలితము లాతి యగును
    కార్య సాధన మార్గమ్ము కష్టతరము

    రిప్లయితొలగించండి
  15. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి