18, మార్చి 2014, మంగళవారం

పద్య రచన – 539

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

20 కామెంట్‌లు:

  1. బ్రహ్మతేజంబుతో భాసిల్లుచుండిన
    ....వాడు భూసుర బాల బ్రహ్మచారి
    సంస్కారవంతుండు సంప్రదాయము మెయి
    ....నిష్ఠాగరిష్ఠుడై నెగడు వాడు
    వ్యాసపీఠమ్ముపై నాగమశాస్త్ర పు
    ....స్తకము నొప్పుగ నుంచి చదువుచుండి
    యజ్ఞసూత్రము నొక్క హస్తమ్ముతో దాల్చి
    ....లెక్కించుచుండె వేరొక్క చేత
    అతడు భువి కేగుతెంచిన యబ్జభవుడొ
    విప్రవేషము గొనిన త్రివిక్రముండొ
    జ్ఞాన తేజోనిధానుండు శంకరుండొ
    వాని దర్శన మమిత శుభప్రదమ్ము

    రిప్లయితొలగించండి
  2. పంచమ వేదము వినగను
    సంచిత పాపములు తొలగు సారూప్యము గన్
    అంచితమగు గ్రంధ రాజము
    నెంచుట గాదెవరి తరము నెవ్విధి నైనన్

    రిప్లయితొలగించండి
  3. పంచ గట్టిన బాలుడు పరమ శివుడు
    వినుడు వినిపింతు మీకిక వేద మనగ
    వ్యాస విరచిత మైనట్టి భాస మిదియె
    పూజ నీయము వినినంత పుణ్య మొసగు

    రిప్లయితొలగించండి

  4. చదివిన వేదము తిండి పెట్టునో అను
    సంశయమున జంద్యము సరిజేయ నేల ?
    సంబంధము లేదు,విడు సంశయమును
    అవుపోశన పట్టుము వేద పట్టుగొమ్మన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. బ్రహ్మ తేజస్సు తో నుండె బాల వటుడు
    చూడు పొత్తము పైనన చూడ్కు లునిచి
    చదువు చుండెను గావ్యము శ్రద్ధ తోడ
    ముద్దు లొలుకుచు నుండెను బొద్దు గాను

    రిప్లయితొలగించండి
  6. ఒకచేతి వ్రేళ్ళతో నొప్పుగా వాక్యాలు
    ..........లెక్కించు వాడౌచు నొక్కచేత
    జందెమంటుచునుండి శ్రద్ధతో పన్నాలు ..........వల్లించు చున్నట్టి బాలు జూడ
    వేదవిద్యాభ్యాస మాదరంబుగ జేయు
    ..........సచ్ఛాత్రు డనుటలో సందియంబు
    లేదు కొంచెంబైన వేదరాశిని యీత
    ..........డాపోశనం బంది యనుపమమగు
    ఖ్యాతి నందుట నిక్క మాపైని వేదార్థ
    ..........భాష్యంబు పఠియించి బాగుగాను
    లక్షణంబులు నేర్చి దక్షుడై వెలుగొందు
    ..........విజ్ఞానఖని యౌచు వివిధగతుల
    ధర్మానురక్తుడై ధరణిపై వేదోక్త
    ..........కర్మంబు లన్నియు ఘనతరముగ
    జరుగునట్లుగ జూచు సామర్ధ్యముం బొంది
    ..........విశ్వాని కాప్తుడై వినుతులొందు
    ఇతని గన్నతల్లి సుతుని వైభవదీప్తి
    గాంచి ధన్యనైతి నంచు మిగుల
    సంతసించుచుండు సర్వకాలములందు
    సత్సుఖంబు లొదవి జగతిలోన. 1.

    వేదము సర్వవిధంబుల
    శ్రీదంబై జగతిలోన స్థిరసౌఖ్యంబుల్
    మోదంబు గలుగ జేయుచు
    నాదరముగ గాచు జనుల నత్యుత్తమమై. 2.

    నిగమాధ్యయనం బెంతయు
    తగినట్టిది విప్రతతికి ధరణి సురత్వం
    బగణిత యశముం గూర్చుచు
    భగవానుని యండ నొసగు భాగ్యదమగుచున్ 3.

    రిప్లయితొలగించండి
  7. పసి ప్రాయమునన్ వసి వాడక న
    భ్యసనమ్మును జేసెడు బాలకుకే
    రు సమంబన శంకరులొక్కరి తీ
    రు సరూపత గాంచితి రూఢి సుమా!

    రిప్లయితొలగించండి
  8. పసి ప్రాయమునన్ వసి వాడక న
    భ్యసనమ్మును జేసెడు బాలకు తీ
    రు సమంబదె శంకరులొక్కరి తీ
    రు సరూపత గాంచితి రూఢి సుమా!

    రిప్లయితొలగించండి
  9. పండిత నేమాని వారూ,
    ‘వాని దర్శన మమిత శుభప్రదమ్ము’ అంటూ మోదప్రదమైన పద్యాన్ని చెప్పారు. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పద్యం మూడవపాదంలో గణదోషం. ‘అంచితమగు సద్గ్రంధము’ అందామా?
    *
    జిలేబీ గారూ,
    __/\__
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    మనోహరమైన ఖండిక నందించారు. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ తోటకవృత్తం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. నొసటన విభూధి దిద్దిన
    పసిప్రాయపుబాలవటువు భాసిలు చుండెన్
    పసగున్ మంత్రము బలుకగ
    విసుగొందక నేర్చుచుండె వేదము శుభమున్

    రిప్లయితొలగించండి
  11. భాసిలు మోమువాడు దశ వర్షములున్ గలవాడు నేర్పుతో
    బూసి విభూతి పుం డ్రములు ముచ్చటగాను లలాటభాగమున్
    వేసి పవిత్రమున్ మెయిని వేద సుకావ్యము నభ్యసించు యా
    భూసుర బాలుగాంచినను మోదము పొంగును మీ యెడన్దలో .

    రిప్లయితొలగించండి
  12. బాల భానునిఁ బోలెడు బాలకుండు
    చదువు చుండెను వేదముల్ శ్రద్ధ గాను
    విద్య లన్నియు నేర్చితాఁ వినయముగను
    తెలుగు భాషకు మిక్కిలి వెలుగు దెచ్చు

    రిప్లయితొలగించండి
  13. శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘పస + అగున్’ అన్నప్పుడు సంధి లేదు. అక్కడ ‘పొసగున్’ అంటే బాగుంటుందేమో?
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ ఉత్పలమాల బాగుంది. అభినందనలు.
    ‘అభ్యసించు నా/ భూసుర..." అనండి.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. నుదుటవిభూతి రేఖలు మనోజ్ఞవిభాసితమై చెలంగ తాఁ
    చదువుచు నుండె వేదములఁ సారము సారసభావరీతిలో
    పదపడి బ్రహ్మదేవుఁడిటు బాలునిరూపము బొందివచ్చి స
    మ్మదమునొసంగినాఁడు కద మాన్యుఁడు బ్రాహ్మణ బాలకుండహో.

    రిప్లయితొలగించండి
  15. సంపత్ కుమార శాస్త్రి గారు చక్కని ధారతో మంచి పద్యమునందించినారు.
    వరప్రసాద్ గారు మునుపు ఒక చక్కని లాలిపాటను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    చక్కని పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.
    అరసున్నాల విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవాలి. ‘తాఁ జదువుచు’ అని ఉండాలి. ‘వేదముల సారము’ లో అవసరం లేదు. మిగిలిన చోట్ల సరిగానే ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  17. వేద సారములను వేగిరముగనేర్చి
    భావి తరము పంచ భాత్య తెరిగి
    బుడత సిద్ధ పడెను భూషణధారియై
    సుచరితుడయి శుభము గలుగు

    రిప్లయితొలగించండి
  18. గురువుగారికి వందనములు.

    మీరన్నట్లుగా అరసున్నాల విషయములో మరికొంత సాధన చేస్తానండీ.

    శ్రీమతిమందాకిని గారికి,

    ధన్యవాదశతములండీ.

    రిప్లయితొలగించండి
  19. వినుమా వేదాధ్యాయీ
    పనసలనే వల్లెవేసి పఠియించుచునే
    ఘన జట పాఠము నేర్చుచు
    ఘనుడుగ మారుమ నిగమపు గానమునందున్.

    రిప్లయితొలగించండి