9, మార్చి 2014, ఆదివారం

సమస్యాపూరణం - 1346 (తమ్మున్ జంపినవాని)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
తమ్మున్ జంపినవాని దేవుఁ డనినన్ దప్పేమి యొప్పే యగున్.

15 కామెంట్‌లు:

  1. క్రమ్మున్ మాయ నిరంతరమ్ముగ మనఃకంజాతమున్, జ్ఞాన మా
    ర్గమ్మున్ బూనిన యంత మాయ తొలగున్ రాజిల్లు స్వాంతమ్ము, శీ
    ఘ్రమ్మస్తోక వివేక ఖడ్గముల క్రూరారాతి షట్కమ్ము మొ
    త్తమ్మున్ జంపిన వాని దేవుడనినన్ దప్పేమి, యొప్పే యగున్

    రిప్లయితొలగించండి
  2. తిమ్మిన్ బమ్మిని జేయ జూడు కతనన్ దీనాతి దీనుల్ తన
    న్నమ్మన్ బల్కుచు, చెంతనున్న హితులన్నట్టేటనున్ ముంచుచున్
    సొమ్ముల్ జేసెడు రాక్షసత్వమునకున్ శోధించు చిత్తమ్ము భూ
    తమ్మున్ జంపినవాని దేవుఁ డనినన్ దప్పేమి యొప్పే యగున్.

    రిప్లయితొలగించండి
  3. మిత్రులారా! శుభాశీస్సులు. ఈనాడు చాల తక్కువ పద్యములు వచ్చినవి. అందరికి అభినందనలు.

    శ్రీ నాగరాజు రవీందర్ గారు:
    మీ పద్యము బాగుగ నున్నది. భూమి అను నర్థములో "మేదిని" అనవలెను గదా. మీరు మేది అని వాడేరు.

    శ్రీ భాగవతుల కృష్ణా రావు గారు: నమస్కారములు.
    మీ పద్యము బాగుగ నున్నది. శోధించు చిత్తాఖ్య భూతమ్ము అని సమాసము చేస్తే బాగుంటుంది.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి


  4. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    క్రమ్మెన్ జీకటి కారు మబ్బులు వెసన్, గాఢాoధకారమ్ము ఘూ
    కమ్ముల్ కూసెను భీకరమ్ముగ నిశన్
    కాకోలముల్ బుస్సనెన్
    హుమ్మంచున్ రుధిరమ్ము గ్రోల తనపై
    నుంకించుచున్నట్టి భూ
    తమ్మున్ జంపిన వాని దేవుడనినన్
    దప్పేమి యొప్పేయగున్

    రిప్లయితొలగించండి
  5. శ్రీ నాగరాజు రవీందర్ గారు: శుభాశీస్సులు.
    మీ పద్యమునకు సవరణ చాల బాగుగ నున్నది. అభినందనలు.

    శ్రీ తిమ్మాజీరావు గారు: శుభాశీస్సులు.
    మీ పద్యములో - ఉంకించుచున్న భూతమ్మున్ - అని ప్రస్తావించేరు - చాల బాగుగ నున్నది.
    అభినందనలు.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి

  6. దమ్ముల్ గల్గిన హేయమానవుడు బాధల్ వెట్టు వాడై యసా
    ధ్యమ్మైనట్టి విధంబు మానవతులన్ దండించు చుండన్, విచి
    త్రమ్మౌ భంగిన వాని యాగడములన్ దప్పింప నా దుష్ట చి
    త్తమ్మున్ జంపిన వాని దేవుడనినన్ దప్పేమి, యొప్పే యగున్!

    రిప్లయితొలగించండి
  7. శ్రీ బొడ్డు శంకరయ్య గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. దుష్ట చిత్తమ్మున్ అని పూరించేరు. అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి

  8. సొమ్ముల్ బెట్టుచు వైద్యమందినను, శాస్త్రోక్తమ్ముగా పూజలన్
    సమ్మానించుచు జేసియుండినపుడున్ సాధ్యమ్ము గాకుండినన్
    వమ్మున్ జేయక నొక్క వైద్యుడతి విశ్వాసమ్ముతో పక్ష వా
    తమ్మున్ జంపిన వాని దేవుడనినన్ దప్పేమి, యొప్పే యగున్!

    రిప్లయితొలగించండి
  9. సమ్మానమ్మును లేక భూవనితనున్ సంద్రమ్మునన్ ముంచగా
    నిమ్మై శౌర్యముకున్ వరాహముగ దా హేలాగతిన్ సంపగా
    వమ్మున్ జేసితివంచు శత్రువుగ దా పాపాత్ముడైనట్టి యా
    తమ్మున్ జంపినవాని దేవుఁ డనినన్ దప్పేమి యొప్పే యగున్

    రిప్లయితొలగించండి
  10. అమ్మన్ చూడక తాను బిడ్డలును దారంచున్ సదాతల్చు భూ
    తమ్మున్ జంపిన వానిదేవుడనినన్ దప్పేమి యొప్పేయగున్
    కమ్మున్ కన్నులనీరు తల్లి కెపుడున్ కాంచన్ సుతూన్మార్గమున్
    సొమ్ముల్ గూర్చి తలంచ దెప్డు తనియున్, సూనుల్ సుఖంబుండినన్

    రిప్లయితొలగించండి
  11. మా కాలం తెలుగు పండితుడు:

    దమ్మున్ పీల్చుచు ముక్కు నందునను భల్ దాంతమ్ము శాంతమ్ముతో
    దిమ్మన్ తిర్గగ మస్తకమ్ము వడిగా తీండ్రించి క్లాసందునన్
    కమ్మంగా నిదురించి లేచి యుతుకున్ గారాబు మాస్టారి బె
    త్తమ్మున్ జంపినవాని దేవుఁ డనినన్ దప్పేమి యొప్పే యగున్

    రిప్లయితొలగించండి