25, మార్చి 2014, మంగళవారం

సమస్యాపూరణం - 1362 (సజ్జనులు సుభాషితముల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
సజ్జనులు సుభాషితముల సరకుగొనరు.

17 కామెంట్‌లు:

  1. కన్ను మిన్నును గానని కలుష మతులు
    దంభ దర్పాతిశయముతో దామసమ్ము
    తో జెలగువారు క్రోధాది దుర్గుణ విల
    సజ్జనులు సుభాషితముల సరకు గొనరు

    రిప్లయితొలగించండి
  2. శ్రద్ధతో జేరి నిస్స్వార్థబుద్ధు లగుచు
    హితకరోక్తులె పలికెద రెల్లవేళ
    సజ్జనులు, సుభాషితముల సరకుగొనరు
    చెడుదు రన్నింట సత్యమా చెనటులవని.

    రిప్లయితొలగించండి

  3. సజ్జనులు- సుభాషితముల సరకుగొనరు
    ప్రజలని తెలిసి విడువక పలుకుచుంద్రు
    లోకమందున వినువారు లుప్తమైన
    గాని జగతిహితవుఁ గోరు ఘనులు వారు.

    రిప్లయితొలగించండి
  4. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    పరుల కుపకార మొనరించు బంధు లెవరు ?
    మంచి మార్గము జూపించు మాట లెవ్వి?
    యేమి సేతురు మూర్ఖులు హితవు బల్క ?
    సజ్జనులు. సుభాషితములు. సరకు గొనరు

    రిప్లయితొలగించండి
  5. సంఘ సుద్ది తలచెదరు సంతతంబు
    సజ్జనులు, సుభాషితముల సరకుగొనరు
    దుర్జనులు, మనసెప్పుడు తోగుచుంద
    మలినపుపనుల, వారలు మాఱుటెపుడొ?
    సుద్ది: వృత్తాంతము /మాట


    రిప్లయితొలగించండి
  6. సత్యసంధులు నిర్గుణుల్ శాస్త్రవిదులు
    విది విధానము పాటించు బుధులు, నిధులు
    సజ్జనులు ; సుభాషితముల సరకుగొనరు
    వందిమాగదులను గోరు నిందితు లిల

    రిప్లయితొలగించండి
  7. సజ్జనులు సుభాషితముల సరకు గొనరు
    అనుట సరికాదు మఱి మీకు నార్య !యిపుడు
    సరకు గొనువారు మొదటన సజ్జ నులెను
    సత్క వుల భాషి తమగుట సదరు సూక్తి


    రిప్లయితొలగించండి
  8. పండిత నేమాని వారూ,
    దుర్గుణవిలసత్ జనుల గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ విరుపు వైవిధ్యంగా ఉండి పూరణ అలరించింది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ విరుపు వైవిధ్యంగా ఉంది. పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘సంఘసుద్ది’ అని సమాసం చేయరాదు కదా.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  9. సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    రెండవ పాదాన్ని అచ్చుతో మొదలుపెట్టారు. నా సవరణ.....
    ‘సజ్జనులు సుభాషితముల సరకు గొనర
    టంచు పలుకుట సరియౌనె యార్య! యిపుడు...’

    రిప్లయితొలగించండి
  10. అల కుపుత్రుని తండ్రయౌచతడు చెప్పి
    నట్టి మాటల జవదాటకాజ్ఞలిచ్చి
    న ధృతరాష్ట్రుడడవులయం దసువు బాసె
    సజ్జనులు సుభాషితముల సరకుగొనరు

    రిప్లయితొలగించండి
  11. సజ్జనులు సుభాషితముల సరకుగొన, రు
    చికరమగు మంచి పలుకుల చెలిమి గూడి
    సుజనశీలత నప్పగ సుమధుర ప్రియ
    భాషణలమరు భాగదేయములు గలుగు

    రిప్లయితొలగించండి
  12. డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
    సజ్జనుడే... కాని పుత్రప్రేమ భీష్మాదుల సుభాషితాలను విననివ్వలేదు. చక్కని పూరణ. అభినందనలు.
    *
    మాజేటి సుమలత గారూ,
    ఈరోజు అందరూ రకరకాలుగా సమస్యను విరిచి పూరణలు చెప్తున్నారు.
    మీ విరుపు కూడా వైవిధ్యంగా ఉంది. పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. అల కుపుత్రుని తండ్రియౌచతడు చెప్పి
    నట్టి మాటల జవదాటకాజ్ఞలిచ్చి
    న ధృతరాష్ట్రుడడవులయం దసువు బాసె
    సజ్జనులు సుభాషితముల సరకుగొనరు


    ముద్రణ దోషంసవరించాను.

    రిప్లయితొలగించండి
  14. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    మరియొక పూరణ: సత్వ సంపన్నులౌ సత్యసాధకులును
    నిత్య హరిచరణ సేవ మునిగిన భక్త
    వరులు దుర్భాషలకు గించ పడగ బోని
    సజ్జనులు.సుభాషితములు సరకు గొనరు

    రిప్లయితొలగించండి
  15. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు.తమరి సలహాకు కృతజ్ఙతలు.మొదటి పాదము ఇలామార్చాను.
    "సత్పథమ్మున నడతురు సంతతంబు/ సజ్జనులు"

    రిప్లయితొలగించండి
  16. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు
    నీ శిష్య పరమాణువు వినమ్రవందనములతో.
    ===========*==============
    భానుని కిరణమ్ములు మన భాషితములు
    గనుక బలుక మందురు,స్వాతి చినుకుల వలె
    సజ్జనులు, సుభాషితముల సరకు గొనరు
    దుష్ట జనులు ఖలుల గూడి కష్ట మనుచు!

    రిప్లయితొలగించండి
  17. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి వారూ,
    మీ సవరణ బాగుంది. సంతోషం. అభినందనలు.
    *
    కందుల వరప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి