17, మార్చి 2014, సోమవారం

సమస్యాపూరణం - 1354 (విష్ణుపూజ నరులు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
విష్ణుపూజ నరులు విడువఁ దగును.

19 కామెంట్‌లు:

 1. నిత్య కర్మ లన్ని నిష్టగా జేయుచు
  సత్య ధర్న నిరతి సరస గతిని
  ధరను కలిని గెలువ ధరణీ సుతులైన
  విష్ణు పూజ నరులు విడువ దగును

  రిప్లయితొలగించండి
 2. క్షమించాలి
  " ధర్మ నిరతికి " బదులుగా " ధర్న అని టైపాటు

  రిప్లయితొలగించండి
 3. (1)
  పలికె నిటుల నొక్క వైష్ణవాచార్యుండు
  “లింగపూజ విడవలెను నరులకు”
  నా వచనము వినిన శైవగురుం డనె
  “విష్ణుపూజ నరులు విడువఁ దగును.”
  (మేము వైష్ణవులమైనా నాకు ‘శంకరయ్య’ అని పేరు పెట్టిన నా తల్లిదండ్రులకు నమస్సులు)
  (2)
  క్రైస్తవమతబోధ ఘనముగాఁ జేయుచు
  చెప్పుచుందు రిటులఁ జేరవచ్చి
  “నీతివాక్య మిదియె సైతాను రూపమౌ
  విష్ణు పూజ నరులు విడువఁ దగును.”

  రిప్లయితొలగించండి
 4. భక్తి లేని పూజ పరమేశ్వరుని కేల?
  శ్రద్ధ లేని సేవ చక్రి కేల?
  మనసులోన భక్తి మాయమైన యెడల
  విష్ణు పూజ నరులు విడువ దగును.

  రిప్లయితొలగించండి
 5. సాటివారియందు సహకారభావంబు
  భూతదయయు ధర్మభీతి భువిని
  మాతృదేశభక్తి మనమున లేకున్న
  విష్ణుపూజ నరులు విడువదగును.

  రిప్లయితొలగించండి
 6. చిత్త శుద్ధి తోడ చేయవలయు నాది
  విష్ణు పూజ,నరులు విడువ దగును
  కోపతాపములను, కోమల మతి తోడ
  కోరునట్టి ఫలము కూడు కొరకు

  రిప్లయితొలగించండి
 7. చేయవలయు సుమ్ము సితవస్త్ర ధారియై
  విష్ణు పూజ నరులు, విడువదగును
  పరుల తప్పు లెన్ను పధ్ధతి ని మిగుల
  సంతసింతు రుర్వి జనులు నుమఱి


  రిప్లయితొలగించండి
 8. విష్ణుపూజ నరులు విడువదగును యన్న
  దుష్ట వ్యాఖ్యలెపుడు దోషమిచ్చు.
  శివుని భక్తి తోడ సేవింపరాదనుచు
  బల్కువాన్కి మిగులు పాప ఫలము.
  బ్రహ్మ పైన భక్తి భావంబు లేకున్న
  సృష్టి దప్పి పోవు శృతులు లయలు.
  అమ్మవారి భక్తి నాక్షేపణలు జేయు
  వాని జీవనంబు వ్యర్థమగును.

  కనుక సత్యమ్ము గ్రహించి మనుట కొఱకు,
  సులభ మార్గమ్ములందించు సూచనలను,
  మనకు సూచించు వాడైన పరమ శ్రేష్ఠు
  నజుని పూజింప రండోయి సుజనులార !

  (అజుడు = పరమాత్ముడు)

  రిప్లయితొలగించండి
 9. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు
  ఈ శిష్య పరమాణువు వినమ్రవందనములతో.
  ==============*==============
  ఖలులు కీర్తింప బడుచున్న కలియుగమున
  చింతలు దొలుగ వలె నన్న జేయ వలెను
  వేగ విష్ణు పూజ, నరులు విడువ దగును
  నీతి జాతి లేక దిరుగు నేత లన్ను!

  రిప్లయితొలగించండి
 10. శివుని పూజ లెపుడు చేయంగ బోకుడు
  విష్ణుపూజ నరులు విడువఁ దగును
  యనుచు బలుకు వార లసురులె నరులలో!
  దేవుడొక్క డనుచు దెలుప వలెనె ?

  రిప్లయితొలగించండి
 11. గురువులు శ్రీ కంది శంకరయ్య గారికి నమస్కారములు.
  నా పూర్తి పేరు ప్రయాగ శ్రీరామచంద్రమూర్తి. ఉద్యోగ రీత్యా గత పాతికేళ్ళుగా బెంగళూరులో నివాసం. మీ ఆశీర్వాదంతో తప్పులు దిద్దుకుంటూ తెలుగులో రచించే సాహసము కష్టమనిపిస్తున్నా ఇష్టంగా చేస్తున్నాను. (ఒక్కొక్క పద్యానికి గంట, రెండు గంటలు పడుతోంది)

  సమస్యా పూరణం:-
  అదియు శైవపూజ యైననేమి విధాత
  విష్ణు పూజ, నరులు విడువ దగును
  ఇట్టి వాదనంబు, నిండుభక్తి గలిగి
  కొలుచునంత తీరు కోర్కెలన్ని.

  రిప్లయితొలగించండి
 12. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణలోని భావం అవగతం కాలేదు. క్షమించండి.
  ‘నిష్ఠ’ను ‘నిష్ట’ అన్నారు. మూడవ పాదంలో ‘ధరణీసుతులైన’ అన్నచోట గణభంగం.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘పరమేశ్వరున కేల’ అనండి.
  *
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  మారెళ్ళ వామన్ కుమార్ గారూ,
  మీ సీసపద్య పూరణ బాగుంది. అభినందనలు.
  ‘విడువదగు నటన్న’ అనండి.
  ‘సేవింపరాదనుచు’ అంటే గణదోషం. ‘సేవింపరాదని’ అంటే సరి.
  *
  కందుల వరప్రసాద్ గారూ,
  ఆటవెలది పాదాన్ని తేటగీతిలో ఇమిడ్చి చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘నేతలన్ను’ అనడం సరికాదు. అక్కడ ‘నేతల నిక’ అందామా?
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘తగును + అనుచు’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘విడువఁ దగు న/టంచు’ అనండి.
  *
  ప్రయాగ శ్రీరామచంద్రమూర్తి గారూ,
  మీ ‘సాహసము’ ఆహ్వానించదగినదీ, ప్రోత్సహించదగినది. మన బ్లాగు పద్యరచనా విద్యకు ఒక బడి వంటిది. మీకు అన్ని విధాల సహకారం ఇవ్వడానికి నేను, మిత్రులు సిద్ధంగా ఉన్నాము. కొనసాగించండి. స్వస్తి!
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మూడవ పాదంలో (ఇ-ని లకు) యతి తప్పింది. ‘ఇట్టి వాదనంబు నెంతొ భక్తి గలిగి’ అనండి. ఇక్కడ ఇకారానికి వాదనంబున్ + ఎంతొ లోని ఎత్వానికి యతి కూర్చబడింది.

  రిప్లయితొలగించండి
 13. నమస్కారములు
  పొరబాట్లు చెప్పినందులకు ధన్య వాదములు వ్రాయ గలిగితే మరొకటి

  రిప్లయితొలగించండి
 14. శ్రీ శంకరయ్య గురువరులకునమస్కారములు
  సూచనకు ధన్యవాదములు

  పరమ శేషి పూజ పరిపూర్ణ భక్తితో
  చిత్త శుద్ధితోడ శివుని ప్రణుతి
  చేయలేని యపుడు శ్రీ శంకరుని సేవ
  విష్ణు పూజ నరులు విడువ దగును.  రిప్లయితొలగించండి
 15. గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. గురుదేవులకు నమస్కారములు
  పొరబాట్లు చెప్పినందులకు ధన్య వాదములు.
  may be my net problem, telugu type kaavaDam lEdu.Sir.

  రిప్లయితొలగించండి
 17. ధ్యాన యోగ మంది ధన్యత నొందుచు
  నాత్మ తత్వ మెరిగి యవని పైన
  సర్వ జీవులందు సర్వేశ్వరుని జూడ
  విష్ణు పూజ నరులు విడువ దగును.

  రిప్లయితొలగించండి
 18. సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి