15, మార్చి 2014, శనివారం

సమస్యాపూరణం - 1352 (కుంతీపుత్రుండు షణ్ముఖుండన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కుంతీపుత్రుండు షణ్ముఖుం డన నెగడెన్.

11 కామెంట్‌లు:

 1. శాంతనవుండనె నర్జును
  నంతటి వీరుండు కలడె యవనీస్థలిలో
  నెంతయు సమర్థుడగు నీ
  కుంతీపుత్రుండు షణ్ముఖుండన నెగడెన్

  రిప్లయితొలగించు
 2. పండిత నేమాని వారూ,
  అర్జునుడు షణ్ముఖసామర్థ్యము గలవా డన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించు
 3. సుంతయు జంకక రణమున
  నెంతటి యతిరథుల నైన నెదిరించుచు న
  శ్రాంతము బాణముల విడుచు
  కుంతీపుత్రుండు షణ్ముఖుండన నెగడెన్

  రిప్లయితొలగించు
 4. పంతముతో నర్జును డ ట
  సుంతయు మది గరుణ లేక సుయోధను పయి
  న్నంతలుగ విజృం భించగ
  కుంతీ పుత్రుండు ష ణ్ము ఖుం డన నెగడెన్

  రిప్లయితొలగించు
 5. సంజయుడు ధృతరాష్ట్రుడితో :

  ”కుంతముల నన్ని దిక్కుల
  బంతులు గట్టగ విడచుచు బవరమునన్ దా
  నెంతేని జెలగు చుండెను
  కుంతీపుత్రుండు షణ్ముఖుండన నెగడెన్"

  రిప్లయితొలగించు
 6. చింతను మాని రణమునన్
  బంతు లటుల శత్రుతలలు పడగొట్టంగన్
  సంతస మొందగ నమరుల్
  కుంతీ పుత్రుండు షన్ముఖుండన నెగడెన్

  రిప్లయితొలగించు
 7. కుంతీ పుత్రుండు షణ్ముఖుండన నెగడెన్

  రిప్లయితొలగించు
 8. సుంతయు వెనుబాటెఱుగక
  వింతగ నీశునెదిరించు వేడుక కథ నే
  నెంతయు శ్రద్ధగ వినునెడ
  కుంతీపుత్రుండు షణ్ముఖుం డన నెగడెన్

  రిప్లయితొలగించు
 9. పండిత నేమానిగారికి పూజ్య గురుదేవులు శoకరయ్య
  గారికి వందనములు

  శాంతుండగు ధర్మరాజు
  కుంతీ పుత్రుండు .షణ్ముఖుo డన నెగడెన్
  సాంతము నారు ముఖమ్ముల
  సంతసమున చన్ను గ్రోలు శరవణ భవుడే

  రిప్లయితొలగించు
 10. పంతముతో రణమున కా
  లాంతకు నెదిరించి పోరె నద్భుత శక్తిన్
  ఎంతగ బొగడిన దక్కువె
  కుంతీపుత్రుండు షణ్ముఖుండన నెగడెన్

  రిప్లయితొలగించు
 11. నాగరాజు రవీందర్ గారూ,
  మీ రెండు పూరణలు బాగునవి. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  రెండవపాదంలో ‘సుయోధను’ అన్నచోట గణభంగం.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
  మొదటి పాదంలో ‘ధర్మరాజు’ అన్నచోట గణదోషం. అక్కడ ‘ధర్మసుతుడు’ అంటే సరి!
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించు