కవిమిత్రులు మన్నించాలి. ఈరోజు ఉదయమే గ్రామాంతరం వెళ్ళి ఇంతకుముందే తిరిగి వచ్చాను. అందువల్ల మీ పూరణలపై వెంటవెంటనే స్పందించలేకపోయాను. * లక్ష్మీదేవి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * రాజేశ్వరి అక్కయ్యా, బాగుంది మీ పూరణ. అభినందనలు. ‘పావకి’ ? * జిలేబీ గారూ, నమస్కారం! * హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ, ‘మునుపటి జందెమును’ విడిపించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * శైలజ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘లేదనంచు’ అన్నచోట గణదోషం. అక్కడ ‘లేదనుచును’ అనండి. * నాగరాజు రవీందర్ గారూ, సమస్యను ప్రశ్నార్థకంగా మర్చి చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, పాతజందెమును గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * భాగవతుల కృష్ణారావు గారూ, తెగిన జందెమును శాస్త్రోక్తముగా వదిలించిన మీ పూరణ బాగుంది. అభినందనలు. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, దుష్టసాంగత్యం దుష్టవాక్కులనే వెలువరిస్తుంది. మీ పూరణ బాగుంది. అభినందనలు.
జందెము జీర్ణమ్మవగా
రిప్లయితొలగించండిచిందులలో , క్రొత్తగ కొని శ్రీ గాయత్రిన్
డెందము నిడి- మార్చగ
జందెము విడనాడువాఁడె సద్బ్రాహ్మణుఁడౌ.
జందెము జీర్ణమ్మవగా
రిప్లయితొలగించండిచిందులలో , క్రొత్తగ కొని శ్రీ గాయత్రిన్
డెందము నిడి- మార్చుటకై
జందెము విడనాడువాఁడె సద్బ్రాహ్మణుఁడౌ.
జందెము మార్చగ పున్నమి
రిప్లయితొలగించండిజందెము విడనాడు వాడె సద్బ్రాహ్మ ణుడౌ
సందడి జేయక వినుడిదె
పందెము మనకేల నిజము పావకి దెలుపన్
రిప్లయితొలగించండిగద్దెము విడనాడు వాడె సత్కవుడౌ
పందెము విడనాడు వాడె సవీరుడౌ
మద్దెము విడనాడు వాడె మనుజుడౌ
జందెము విడనాడువాఁడె సద్బ్రాహ్మణుఁడౌ !
జిలేబి
ముందుగ శ్రావణపూర్ణిమ
రిప్లయితొలగించండినందంబుగ దాల్చి యొకటి యటు తరువాతన్
సందేహించక మునుపటి
జందెము విడనాడువాడె సద్బ్రాహ్మణుడౌ.
జందెము జీర్ణము కాగా
రిప్లయితొలగించండిజందెము విడనాడువాడె సద్బ్రాహ్మణుడౌ
అందముగా లేదనుంచు
జందెము విడనాడువాని జడుడన వచ్చున్
విందువె ! శ్రావణ పౌర్ణమి
రిప్లయితొలగించండినందున, మరి తీరిపోగ నాశౌచములే
జందెము మార్చగ ప్రాతది
జందెము విడనాడువాడె సద్బ్రాహ్మణుడౌ
అందరి కంటెను మూర్ఖుడు
రిప్లయితొలగించండిజందెము విడనాడు వాడె , సద్బ్రాహ్మణుడౌ
జందెము దానెల్లప్పుడు
నందముగా దాల్చు నతడుననుపమ రక్తిన్
ముందెపుడో ధరియించిన
రిప్లయితొలగించండిజందెమ్మది జీర్ణమవగ శాస్త్రోక్తముగా
జందెము ధరియించి తెగిన
జందెము విడనాడువాఁడె సద్బ్రాహ్మణుఁడౌ.
డెందము నందున తలచుచు
రిప్లయితొలగించండిపొందులు,విందులు సతతము ముఖ్యంబనుచున్
మందున్ త్రాగియొకడనెన్
జందెము విడనాడువాడె, సద్బ్రాహ్మణుడౌ
పొందు: స్నేహము
కవిమిత్రులు మన్నించాలి. ఈరోజు ఉదయమే గ్రామాంతరం వెళ్ళి ఇంతకుముందే తిరిగి వచ్చాను. అందువల్ల మీ పూరణలపై వెంటవెంటనే స్పందించలేకపోయాను.
రిప్లయితొలగించండి*
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘పావకి’ ?
*
జిలేబీ గారూ,
నమస్కారం!
*
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
‘మునుపటి జందెమును’ విడిపించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘లేదనంచు’ అన్నచోట గణదోషం. అక్కడ ‘లేదనుచును’ అనండి.
*
నాగరాజు రవీందర్ గారూ,
సమస్యను ప్రశ్నార్థకంగా మర్చి చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
పాతజందెమును గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
భాగవతుల కృష్ణారావు గారూ,
తెగిన జందెమును శాస్త్రోక్తముగా వదిలించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
దుష్టసాంగత్యం దుష్టవాక్కులనే వెలువరిస్తుంది. మీ పూరణ బాగుంది. అభినందనలు.
జిలేబీ గారి భావానికి నా పద్యరూపం....
రిప్లయితొలగించండికందము వ్రాయక కవి యగు
పందెము విడి పాఱువాఁడె బల్లిదుఁడు గదా
మందును గొని మనుజుండగు
జందెము విడనాడువాఁడె సద్బ్రాహ్మణుఁడౌ.
నమస్కారములు
రిప్లయితొలగించండి" పావకి = అగ్నిజుడు , అగ్ని సంభవుడు , కుమారస్వామి ఇలా చాలా పేర్లు ఉన్నాయి కదా అని వ్రాసాను పొరబడితే ఏముంది ? మన్నించడమె
అందరి కన్నుల విందుగ
రిప్లయితొలగించండిబంధము లన్నియును తీర పరిపూర్ణతకై
పొందుగ సన్యాసమునన్
జందెము విడనాడువాఁడె సద్బ్రాహ్మణుఁడౌ
మందును కొలదిగ గొనుచున్
రిప్లయితొలగించండిసందుల కోవెలల దూరి సంధ్యను వార్చన్
కుందుచు నోడగ మోడికి
జందెము విడనాడువాఁడె సద్బ్రాహ్మణుఁడౌ