28, మార్చి 2014, శుక్రవారం

సమస్యాపూరణం - 1365 (నాలు గైదులు పదునాఱు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
నాలు గైదులు పదునాఱు నలిననయన.

27 కామెంట్‌లు:

  1. వ్రేళ్ళపై లెక్క పెట్టెడు విధము తండ్రి
    కూతునకు నేర్పుచుండెను, కూడు నెడల
    మూడు నాల్గులు నేడగు, నేడు తోడ
    నాలుగైదులు పదునారు నలిన నయన!

    రిప్లయితొలగించండి

  2. ప్రాకటముగ దశాంశపు పద్ధతందు
    నాలుగైదులు ఇరువది నమ్మకముగ
    గణక యంత్రపు అష్టాంశ గణితమందు
    నాలుగైదులు పదునాఱు నలిన నయన!


    పూరణకు వివరణ: మనము సాధారణముగా వాడేగణితము గణితము దశాంశ పద్ధతి (decimal system). ఉదాహరణకు: 63(base 10) = 6x10 + 3x1. గణకయంత్రములలో binary systemను ఉపయోగిస్తారు. ఇందులో ఒక పద్ధతిని అష్టాంశ పద్ధతి(Octal System) అంటారు. అష్టాంశ పద్ధతిలో 63(base 8) = 6x8 + 3x1 = 51 (base 10). అందువలన 20(base 8) = 2x8 + 0x1 = 16(base 10)!! అందువలన 20 అనివ్రాస్తే అష్టాంశ పద్ధతిలో అది 16 అవుతుందని నా పూరణ.

    రిప్లయితొలగించండి
  3. పుష్యం గారి పద్యం అదిరింది.
    ఆలోచింపజేసే పద్యం.
    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి

  4. నేటి సమస్యా పూరణం - 1365 !
    ఒకటి మూడు కలిసిన నాలుగు, ఐదు
    ఒకటి ఆరు పదునారు ఉన్నవి ఇదియే మరి
    నాలుగైదులు పదునారు నలిన నయన !!

    జిలేబి

    రిప్లయితొలగించండి

  5. మారెళ్ళ వామనార్యా!
    వారేవా, పద్యమదిరె, బాగుందనుచున్
    కూరిమితోమీరిచ్చిన
    ప్రేరణకున్ నెనరులు మరి వేవందనముల్

    రిప్లయితొలగించండి
  6. పండిత నేమాని వారూ,
    7 + 4 + 5 = 16 అంటూ మీరు చేసిన పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పుష్యం గారూ,
    మీ బైనరీ సిస్టం లెక్క చాలా బాగుంది. అభినందనలు.
    మొదట నాకర్థం కాలేదు. మా అబ్బాయికి చూపిస్తే కరెక్టే అన్నాడు.
    వామన్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపిన మీ పద్యం చాలా బాగుంది.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    జిలేబీ గారూ,
    _/\_

    రిప్లయితొలగించండి
  7. శంకరయ్య గారు,

    ఇంజినీర్ని, అందులోనూ Hardware ఇంజినీరుని గాబట్టి, గత 20ఏళ్ళుగా binary systemను వాడి వాడి, 20 మరియు 16 చూసిన వెంటనే నా చిన్న బుఱ్ఱకు ఇదే తట్టింది. అందరికీ అర్ధమవక పోవచ్చన్న శంక ఉన్నా పూరణ కుదిరింది గదా అని వ్రాసాను. పద్యములు నచ్చినందుకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు
    నీ శిష్య పరమాణువు వినమ్రవందనములతో.
    శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో..
    =================*=================
    కష్ట జీవుల కెల్లను కలిమి యనిన,
    నాలు గైదులు పదునాఱు నలిననయన!
    ఖలుల కెల్లను లెక్కింప కలియుగమున,
    నాలు గైదులు పది వేలు నలిననయన!

    రిప్లయితొలగించండి
  9. లెక్క లందున చిక్కులు పెక్కు కలవు
    పంచ వలయురెండైదులు ప్రాకటముగ
    నైదు తో,వచ్చు ఫలమున కైదు కూడ
    నాలు గైదులు పదునారు నలిన నయన!

    నా భావము..55/5=11+5=16

    రిప్లయితొలగించండి
  10. పుష్యంగారికి నమస్సులు ..మీ పూరణ చాలా బాగుంది..

    రిప్లయితొలగించండి
  11. శ్రీ నేమాని గురుదేవుల,శ్రీ పుష్యం గారి పూరణ మంచి గానున్నది.
    నిజమే ఇంజనీరింగ్ లో (Binary (2),octal (8),decimal(10),hexa decimal(16) number system)ఎక్కువగా వాడు చున్నాము.

    రిప్లయితొలగించండి
  12. కందుల వరప్రసాద్ గారూ,
    కష్టజీవుల కష్టానికి అల్పఫలం, ఖలులకు అధికఫలం నిజజీవితంలో మనం చూస్తున్నదే. మంచి పూరణ. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    నాలు గైదులతో పదహారు సాధించిన మీ లెక్క బాగుంది. చక్కని పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. నడుప బోకు వాహనమును మెడనువంచి
    చెవిన చర వాణి బెట్టుచు చెఱుపు గలుగు
    దంతములు ముప్పదారులో తరుగు, మిగులు,
    నాలుగైదులు,పదునాఱు నలిన నయన !!!

    రిప్లయితొలగించండి
  14. మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ హాస్యస్ఫోరకంగా ఉండి అలరించింది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. ఇరువది యగును శంకరా!యిరవు గాను
    నాలు గైదులు, పదునాఱు నలిన నయన!
    నాలు గంకెకు రెట్టింపు మేళవించి
    వచ్చు సంఖ్యకు రెట్టింపు బరగు నెడల

    రిప్లయితొలగించండి
  16. సుబ్బారావు గారూ,
    విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    (4 x 2) x 2 = 16 ఇదేకదా మీ ఈక్వేషన్.

    రిప్లయితొలగించండి
  17. శైలజ గారూ,
    మీలెక్కకు క్రింది ఈక్వేషన్ చూపితే బాగుంటుంది.
    (55/5) + 5 = 16.

    రిప్లయితొలగించండి
  18. హెడ్డింగు లొ సమస్య ఇలా కనుపిస్తోంది:

    నాగు గైదులు పదునాఱు నలిననయన

    టైపా టనుకొంటా.

    రిప్లయితొలగించండి
  19. ధన్యవాదములు గురువుగారు...నిజమే...

    రిప్లయితొలగించండి
  20. ఎనుబదంకెను విడమర్చె నిట్లు గురువు
    ఎనిమిదికి ప్రక్క సున్నతో ఎనుబదగును
    సరిగ కూడుము వచ్చెడి నిరువదులట
    నాలుగైదులు పదునారు నలిన నయన!

    రిప్లయితొలగించండి
  21. శ్రీ వరప్రసాద్ గారు! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    2వ పాదము చివరలో నలిన నయన అని ఉంది కాబట్టి, 4వ పాదము చివరలో కొంచెము మార్చితే బాగుంటుంది. అక్కడ నలిన నయనకి బదులుగా నీలకంఠ అందామా?
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  22. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో..
    పద్యము గురుదేవుల సవరణతో
    ===========*===========
    కష్ట జీవుల కెల్లను కలిమి యనిన,
    నాలు గైదులు పదునాఱు నలిననయన!
    ఖలుల కెల్లను లెక్కింప కలియుగమున,
    నాలు గైదులు పది వేలు నీలకంఠ!

    రిప్లయితొలగించండి
  23. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈనాటి సమస్య అంకెలకి సంబంధించినది అయినా పూరణల వైవిధ్యము బాగుగ నున్నది. అందరికీ అభినందనలు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  24. అయిదు పది గల్ప మిషనులు హస్తమందు
    నుంచు కాలము మెదడును ముంచనీట
    నోట దెలుపంగ ననెదరు దీటుగాను
    నాలు గైదులు పదునాఱు నలిననయన.

    రిప్లయితొలగించండి
  25. పైన క్రిందుగ పదునారు పదియునారు
    కలసి ముప్పదిరెండుగ కలవు నీకు
    పైన నాలుగదనము పైపండ్లు నాకు
    నాలు గైదులు, పదునాఱు నలిననయన.

    రిప్లయితొలగించండి
  26. మిస్సన్న గారూ,
    ధన్యవాదాలు. టైపాటును సవరించాను.
    మీ పూరణ పద్యం బాగుంది. కానీ లెక్క అర్థం కాలేదు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    కాలిక్యులేటర్ అలవాటైనవాళ్ళు నోటిలెక్కలు చెప్పలేరన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ దంతాల లెక్క బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. కలిగి నారలు మాకును తెలివి గల్గు
    పిల్ల లిద్దరు , నొకయాడపిల్ల,మరియు
    తనయుడొక్కడు వయసులు వినుడు చెపుదు
    నాలు గైదులు, పదునాఱు నలిననయన.

    రిప్లయితొలగించండి