పండిత నేమాని వారూ, ఆకుకూరల ప్రయోజనాన్ని తెలిపిన మీ పద్యం బాగుంది. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘చీకూ’ అని వ్యావహారికాన్ని వాడారు. ‘చీకును’ అంటే సరి! * హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ, ‘మేటి యన్నింట చూడంగ తోటకూర’ మకుటంతో తోటకూర శతకాన్నే వ్రాసేయండి. ఓ పనైపోతుంది! తోటకూరను కావ్యవస్తువుగా చేసి చక్కని ఖండిక రచించిన మీకు అభినందనలు. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, తోటకూర పప్పు ఎలా వండాలో చక్కగా వివరించారు. బాగుంది. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, నాకు వంటల సంగతి తెలియదు కానీ, తిమ్మాజీ రావు గారి విడిగా పులుసుతో కలిపి తినమన్నారు కదా... పులుసున్నాక తోటకూర పప్పులో చింతపండు ఎందుకు? * సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
గురువుగారు, ధన్యవాదాలు. ఓహ్! పులుసుతో కలిపి అన్నారా, నేను దీనినే పులుసన్నారనుకున్నా. తిమ్మాజీరావు గారు బాగా వివరించినందుకు ధన్యవాదాలు. మేము స్మార్తులం. బంధువుల్లో మధ్వలు ఉన్నా ఈ వంటలు తెలియదు. తూర్పుప్రాంతంలో కొన్నేళ్ళున్నా మా ఇంట్లో ప్రయోగాలు పెద్దగా పనికిరావు. సాధారణంగా మేము అన్ని ఆకుకూరలను కందిబేడలతో కలిపే చేస్తాము. చింతపండు రసము, పచ్చిమిర్చి తప్పనిసరి. చివర్న ఇంగువ తిరగవాత(పోపు).మీరు చెప్పినట్టు కూడా చూడాలండి చింతపండు కారం తగ్గించాలని వైద్యులు చెప్తుంటారు కదా! ధన్యవాదాలు.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ఆటవెలదిని ఆరు పాదాల్లో వ్రాశారు. అది సంప్రదాయం కాదు. అన్ని పాదాలకు ఒకే లక్షణం కల పద్యాలకే ఆ అవకాశం ఉంది. ఆటవెలదిలో ఒకటి, మూడు పాదాలకు, రెండు, నాలుగు పాదాలకు వేరువేరు లక్షణాలున్నాయి కదా! ‘రోగమొచ్చు..." ఒచ్చు గ్రామ్యం. అక్కడ ‘రోగ మబ్బు" అనండి. * శైలజ గారూ, మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు. * మిస్సన్న గారూ, ‘తోటకూరనాడే చెప్పకపోయావా?" కథను చక్కని పద్యఖండికగా వ్రాసి మాకు ఆనందాన్ని కలిగించారు. అభినందనలు. * పానుగంటి చంద్రయ్య గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. నాకిష్టమైన పొన్నగంటికూరను ప్రస్తావించారు. దన్యవాదాలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * నాగరాజు రవీందర్ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * లక్కరాజు వారూ, ధన్యవాదాలు.
ఆకు లలములలోన దివ్యౌషధములు
రిప్లయితొలగించండిచాల కలవంచు దెలిసిన మేలు కలుగు
వానిని నిరాదరించుచు ప్రజలు బహువి
ధాసుపత్రుల కేగుదు రహరహమ్ము
ఆసుపత్రి అనెడి పదము సంస్కృతము కాదేమో అనే సందేహముతో నా పద్యమును ఈ విధముగా మార్చుచున్నాను:
రిప్లయితొలగించండిఆకుకూరల లోన దివ్యౌషధములు
చాల కలవంచు దెలిసిన మేలు కలుగు
వానిని నిరాదరించుచు ప్రజలు బళిర!
ఆసుపత్రుల కరుగుదు రహరహమ్ము
ఆకులు కూరలు మనలకు
రిప్లయితొలగించండిచేకూర్చును స్వస్థత; యిక చీకూ చింతల్
నీకవి యేలా? మందులు
మాకులు వలదిక ; శుభమ్ము మనకది కాదే?
హాస్పిటల్ ఆంధ్రీకరణమే ఆసుపత్రి యండి.మాస్టర్ మాస్టారు వలె.
అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఆసుపత్రి విషయములో తగిన సూచన చేసినందులకు మా సంతోషము.
స్వస్తి.
శక్తిదాయక మియ్యది సకలగతుల
రిప్లయితొలగించండినుపకరించుచు సర్వదా యుర్వియందు
గూర్చు నారోగ్యభాగ్యంబు కూర్మిమీర
మేటి యన్నింట చూడంగ తోటకూర. 1.
చేలలోనుండు, తోటలో చేరియుండు,
ఇండ్లదరులందు దొడ్లలో నిమిడియుండు,
ఎందు బెంచిన సంతస మంది యుండు
మేటి యన్నింట చూడంగ తోటకూర. 2.
పిన్నవారికి, స్త్రీలకు పెద్దలకును
స్వాస్థ్యవర్ధన మొనరించు, సన్మతినిడు
పథ్యమైనట్టి శాకమీ వసుధలోన
మేటి యన్నింట చూడంగ తోటకూర. 3.
హితము గూర్చును, దేహాన వెతల నణచు,
లాభదాయకమై పెంచు ప్రాభవంబు,
ధరణి జనముల కండయై ధరను వెల్గు
మేటి యన్నింట చూడంగ తోటకూర. 4.
కూరయై యుండు, పప్పుతో కూడియుండు,
పులుసుకూరగ రూపంబు పొందుచుండు,
ఉర్వి నెట్లున్న రుచ్యమై యొప్పుచుండు
మేటి యన్నింట చూడంగ తోటకూర. 5.
ప్రాణములు దీసి, ఖండించి పాత్రలోన
నుడక బెట్టుచు బాధించుచున్న నైన
నాగ్రహించక జనులకు హర్ష మొసగు
మేటి యన్నింట చూడంగ తోటకూర. 6.
పరుల కుపకార మొనరించుకొరకు జగతి
జన్మ నొసగెను దేవుండు సత్యమనుచు
త్యాగభావాన నర్పించు తనను తాను
మేటి యన్నింట చూడంగ తోటకూర. 7.
సాత్త్వికాహార మియ్యది జనుల కిలను
బుద్ధివికసన మొనరించు భోజ్యమగుచు
స్వార్థ మొక్కింతయును లేక సత్య మవుర!
మేటి యన్నింట చూడంగ తోటకూర. 8.
ఒకింత సవరణతో....
రిప్లయితొలగించండిఆకులు కూరలు మనలకు
చేకూర్చును స్వస్థతనిక చీకూ చింతల్
నీకవి యేలా? మందులు
మాకుల వాడుక నొకింత మానగఁ జేయున్.
పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
లేత తోటకూర రెమ్మలు నీటిలో
కడిగి శుభ్రపరచి కత్తిరించి
పెసరపప్పు తోడ మిసి మిసిగ నుడికించి
యుప్పుకాస్తవేయ పప్పుకూర
ఎండు మిరప కాయ లింగువ నూనెలో
వేపి కూరపైన పెట్టి యిడగ
కంచెడన్నమందు కలిపి గురిగి జేసి
తీయపులుసు తోడ తిన నమృతమె
వంట బాగున్నదండి. చింతపండు అక్కరలేదాండి? కారం ఆ ఒక్కమిరపకాయే చాలునా?
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఆకు కూరలు దినినచో నాయు వృ ధ్ధి
మఱియు కంటికి నిమిగుల మంచి దండ్రు
ఆకు కూరల లోనన గోగి యాకు
నొలిచి చేయుదు రతివలు లలితముగను
పచ్చడి, రుచిగ నుండును భామ ! దినగ
చిరంజీవిలక్ష్మీదేవికి తోటకూర పప్పుకూరలో చింతపండు
రిప్లయితొలగించండిఅక్కరలేదు. పులుపు ఆవకూరలో కావాలి.యింగువ
నూనెలో వేగిన మిరపకాయలతో కారము తగినంత తినవచ్చు.సాధారణంగా మాధ్వుల యింటవండుతారు మీరు కూదాప్రయత్నించ వచ్చు
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిఆకుకూరల ప్రయోజనాన్ని తెలిపిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘చీకూ’ అని వ్యావహారికాన్ని వాడారు. ‘చీకును’ అంటే సరి!
*
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
‘మేటి యన్నింట చూడంగ తోటకూర’ మకుటంతో తోటకూర శతకాన్నే వ్రాసేయండి. ఓ పనైపోతుంది! తోటకూరను కావ్యవస్తువుగా చేసి చక్కని ఖండిక రచించిన మీకు అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తోటకూర పప్పు ఎలా వండాలో చక్కగా వివరించారు. బాగుంది. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
నాకు వంటల సంగతి తెలియదు కానీ, తిమ్మాజీ రావు గారి విడిగా పులుసుతో కలిపి తినమన్నారు కదా... పులుసున్నాక తోటకూర పప్పులో చింతపండు ఎందుకు?
*
సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
ఆర్యా!
రిప్లయితొలగించండిధన్యవాదములు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువుగారు,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
ఓహ్! పులుసుతో కలిపి అన్నారా, నేను దీనినే పులుసన్నారనుకున్నా.
తిమ్మాజీరావు గారు బాగా వివరించినందుకు ధన్యవాదాలు. మేము స్మార్తులం. బంధువుల్లో మధ్వలు ఉన్నా ఈ వంటలు తెలియదు.
తూర్పుప్రాంతంలో కొన్నేళ్ళున్నా మా ఇంట్లో ప్రయోగాలు పెద్దగా పనికిరావు.
సాధారణంగా మేము అన్ని ఆకుకూరలను కందిబేడలతో కలిపే చేస్తాము. చింతపండు రసము, పచ్చిమిర్చి తప్పనిసరి. చివర్న ఇంగువ తిరగవాత(పోపు).మీరు చెప్పినట్టు కూడా చూడాలండి చింతపండు కారం తగ్గించాలని వైద్యులు చెప్తుంటారు కదా!
ధన్యవాదాలు.
వేపు కూరలన్ని వేయించు గుండెను
రిప్లయితొలగించండిరోష్టు కూరతిన్న రోగమొచ్చు
నాకు కూరలిచ్చు నాయురారోగ్యముల్
కరము చౌకధరకు దొరకు నవియు
ధాతులవణములును దండిగా దొరకును
ఆకుకూరలుతినుడనవరతము
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆకు కూరల నన్నింట ప్రాకటముగ
రిప్లయితొలగించండితోట కూరయె వసుధలో మేటి దనగ
పప్పువండగ కూరతో పరమ రుచియు
కరకర పకోడి జేసెడి కూర ఘనము
ఆటలాడి బాలు డమ్మ కొక దినము
రిప్లయితొలగించండితోటకూరమొక్క దొరకె నంచు
తెచ్చి యిచ్చె నామె మెచ్చుకొనెను దాని
కూర చేతు నంచు కూర్మి వాని.
తెచ్చె మరునాడు మరికొన్ని మెచ్చ తల్లి,
యెచట వీమొక్క లని వాని నెన్న డైన
నరయ లేదామె, బాలుడు తరచుగాను
తెచ్చు చుండెను క్రమముగా దినుసు లెన్నొ.
నిజమునకు వాడు పొరుగిళ్ళ నేర్పుగాను
దొంగిలించుచు గ్రహియించె, దుడుకుదనము
పెచ్చు మీరెను తల్లికి వెరవ డాయె,
దొంగగా మారె సంఘాన ద్రోహి యాయె.
కరడు గట్టిన దొంగయై దొరకిపోయె
రక్షక భటాళి కొకనాడు శిక్ష పడెను
జైలు కేగెడి వేళను జాలి తోడ
తల్లి యేడ్చెను భోరున తనయుని గని.
ఏమిరా బిడ్డ యిట్టి బుద్దేల పుట్టె
మనకు లోటేమి దొంగగా మారనేల
పరుల సొమ్మన్న నెరుగవే పాము గాదె
పరువు మాసినదన వాడు బదులు పలికె.
తోటకూర నాడేల యీమాట పిలిచి
అడుగవైతివి కటువుగా నమ్మ నన్ను
నాడు బాగున్నదని మాట లాడవైతి
వపుడె తగదన్న దొంగగా నగుదునె యనె.
చిన్న వారని ప్రేమతో చిన్న తప్పు
చూడ నట్లూర కుండిన సుతుల యెడల
పెద్ద వారయ్యు వీడక కొద్ది బుద్ధి
సంఘమున కొక భారమై చనుట నిజము.
తోటన పెరిగిన కూరను
రిప్లయితొలగించండివాటముగా కోసి కడిగి వండగ పులుసున్
నోటిన నీరే యూరగ
తోటాకుల కూటు తినగ ధూర్ఝటి వచ్చున్
ఆకు కూరలందు నారోగ్య పోషణ
రిప్లయితొలగించండిఖనిజ లవణ ములును కండపుష్టి
నవిశనావకూర కరివేప కూరలున్
పోషకాలనిచ్చు పొన్నగంటి
తోటకూరను రకరకములుగా వండిన మిత్రులందరికీ అభినందనలు..
రిప్లయితొలగించండిపెరుగు తోటకూర పెరుగును పెరడున
కొయ్య తోట కూర కూడ నటులె
ఒంటి కెంతొ మేలు కంటికి మంచిది
పప్పు, పులుసుకూర గొప్పగుండు.
తోటన పెరిగిన కూరను
రిప్లయితొలగించండివాటముగా కోసి కడిగి వండగ పులుసున్
-----------------------
sailaja గారూ తోటకూర మీద మీ పద్యం బాగుంది
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
ఆటవెలదిని ఆరు పాదాల్లో వ్రాశారు. అది సంప్రదాయం కాదు. అన్ని పాదాలకు ఒకే లక్షణం కల పద్యాలకే ఆ అవకాశం ఉంది. ఆటవెలదిలో ఒకటి, మూడు పాదాలకు, రెండు, నాలుగు పాదాలకు వేరువేరు లక్షణాలున్నాయి కదా!
‘రోగమొచ్చు..." ఒచ్చు గ్రామ్యం. అక్కడ ‘రోగ మబ్బు" అనండి.
*
శైలజ గారూ,
మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
‘తోటకూరనాడే చెప్పకపోయావా?" కథను చక్కని పద్యఖండికగా వ్రాసి మాకు ఆనందాన్ని కలిగించారు. అభినందనలు.
*
పానుగంటి చంద్రయ్య గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
నాకిష్టమైన పొన్నగంటికూరను ప్రస్తావించారు. దన్యవాదాలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
లక్కరాజు వారూ,
ధన్యవాదాలు.
పూజ్యగురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. తమరిచ్చిన సలహాకు కృతజ్ఞతలు. నాపద్యములోని మొదటి రెండు పాదములు తీసివేస్తే సరి పోతుందనుకుంటాను.
రిప్లయితొలగించండి