కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
శల్యుఁ డనఁగ నెవ్వఁడు పార్థసారథి కద.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
శల్యుఁ డనఁగ నెవ్వఁడు పార్థసారథి కద.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
శల్యు డనగను రణమున శక్తి యుతుడు
రిప్లయితొలగించండిపాండు సుతులను పడగొట్టె బాణ తతిని
శల్యుడ నగ నెవ్వడు పార్ధ సారధి కద
ధర్మ జునిచేత మరణించి ధరను కూలె
రిప్లయితొలగించండిరావణు డనగ నెవ్వడు రాముడు కద
వాలి అనగ నెవ్వడు సుగ్రీవుడు కద
కర్ణు డనగ నెవ్వడు అర్జునుండు కద
శల్యుఁ డనఁగ నెవ్వఁడు పార్థసారథి కద !
జిలేబి
కర్ణు నాజిని గూల్చగ నిర్ణయించి
రిప్లయితొలగించండితేరు నా రీతి నడిపిన తీరు జూచి
యడిగె నోయోధుడర్జునునాజిలోన
శల్యుఁ డనఁగ నెవ్వఁడు పార్థ !, సారథి కద.?
శల్యు నిగనిక్రీడినడిగె సన్నిహితుడు
రిప్లయితొలగించండిశల్యు డనగ నెవ్వడు పార్ధ? సారధి కద
కర్ణుని రధమునకుతాను కదనమందు
మేటి విలుకాడు మాకౌను మేనమామ
ననుచు పలికెను పార్ధుడు ఘనము గాను
శల్యుడనగనెవ్వడు పార్థ! సారథి గద
రిప్లయితొలగించండికర్ణునకు యుద్ధమందున, కలువ వైరి
పుత్రునపజయంబునకును ముఖ్యుడతడు
శల్య సారథ్య మనుమాట జగతి నిలచె(సార్థకమ్ము)
శల్యుఁ డనఁగ నెవ్వఁడు పార్థసారథి కద
రిప్లయితొలగించండినమున నెదిరింప కడు నైపుణ్యముగను
కదము త్రొక్కుచు కర్ణుని ఖ్యాతి పొడగ
ని కథ కెక్కిన నిరుపమ సారథి కద
శల్యుడ నగ నెవ్వడు పార్ధ!సారధికద
రిప్లయితొలగించండిసహజ కవచ కుండల ధారి సామి కతడు ,
పాండవుల మేలు కొఱకునై పాటు పడిన
మేటి యోధుడు ,పార్ధుని మేన మామ .
నకుల సహదేవుల సంభాషణ
రిప్లయితొలగించండిపరుడు కాదయ్య మామ, మా పక్షమతడు
శల్యుఁ డనఁగ; నెవ్వఁడు పార్థసారథి కద
లించు రథములనెదిరింప లేడనుచును
కర్ణునికి పిరికితనము కలుగఁ బలికె.
నకుల సహదేవులు ఒక సైనికునితో పలుకుట.
రిప్లయితొలగించండిరాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
*
జిలేబీ గారూ,
_/\_
*
భాగవతుల కృష్ణారావు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
మాజేటి సుమలత గారూ,
మీ ప్రయత్నం ప్రశంసింపదగినది.
రెండవ పాదంలో గణదోషం. రెండవ నాల్గవ పాదాల్లో యతి తప్పింది.
నిరుత్సాహపడకుండా పద్యరచన కొనసాగించండి. స్వస్తి!
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
శల్యుఁ డనఁగ నెవ్వఁడు పార్థసారథి కద
రిప్లయితొలగించండినమున నెదురిడ కడు నిపుణతనమునను
కదము త్రొక్కుచు కర్ణుని ఘనత గాంచి
రథము నడుపగ ఖ్యాతి నెరసె గదా! హ !
గురువు గారు, ప్రోత్సాహానికి ధన్యవాదములు. రాత్రి పది తర్వాతే నాకు టైము దొరుకుతుంది. రోజు వ్రాయాలని ఆశ. ఆఫీసు, పిల్లలు, వంటా, వార్పు...స్వవిషయాలు ఎకరువు పెట్టాను. క్షమించండి.