ముద్ద బంతులు చేమంతి పున్నా గముల కల్లు కొన్నవి తీగలు యల్ల నల్ల వెన్నె లందున గన్పట్టు వేడ్క జూడ మల్లె తీగకు పూచె చేమంతు లెన్నొ
మల్లె తీగెను బోలిన మనుమరాలుబట్టపై పూల గుత్తుల పగిది జూచితాత పద్యమ్ము నల్లెను ప్రీతి తోడమల్లె తీగెకు బూచె చేమంతు లెన్నొ
ప్రణామములు తాతగారి తో పద్యం వ్రాయించు కున్న మనుమరాలు ఎం.....త ....అదృష్ట వంతు రాలో ? చాలా చాలా బాగుంది
అమ్మా! రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు. మా మనుమరాలు కళల పద్మజుని యాలు సిరుల బేర్కొను నెడల శ్రీధరుని యాలు వరలు సౌభాగ్యమెన్న శంకరుని యాలుముద్ద బంగార మనదగు ముద్దరాలు
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..... శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో.==============*=================తిమ్మడింట మల్లె తీగకు పూచె చేమంతు లెన్నొజూడు మామ,పోయి జూచి వచ్చె దమ్ము,కాచి యుంచితి నీరువేగ రమ్ము నీవు వేడుక గన !కలువ కంటి యీ తిమ్మడు కాడు,బావ తిమ్మడు,గణక యంత్ర స్థితి గతి మార్చ చిత్ర మందు చిత్రముగాను చిత్ర మలర మల్లె తీగకు పూచె చేమంతు లెన్నొ!
మల్లియల్ పూచె నిండుగా మాదు తోటమల్లె తీఁగకు; పూచె చేమంతులెన్నొ;యింటి వాకిట చెండు పూలింపు గొల్పె;నాదు మనమది నిండె నానందమిండ్రు.
పరిమళమ్ములు వెదజల్లి పలుకరించిబొండు మల్లెలు విరబూసె నిండుగానుమల్లెతీగకు, పూచె చేమంతు లెన్నోఅందగించుచు కనులకు విందుజేసె
మానినీమణి యలివేణి మల్లెతీగ!కొప్పునన్ పుష్ప మాలికల్ కొల్వుతీరెనట్టి పూబోడి మరియింత నందగింపమల్లెతీగకు పూచె చేమంతులెన్నొ!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
లక్ష పద్యార్చనం - 'గ్రంథ ముఖి '( ఫేస్ బుక్ ) మాధ్యమం లో డా . రాళ్ళబండి కవితాప్రసాద్http://andhraamrutham.blogspot.in/2014/03/blog-post_1.html#.UxGBMOOSyi4
పూలు విరివిగ బూచెను బొలుపు గానుమల్లె తీగకు, పూచె చేమంతు లెన్నొపసుపు వర్ణము తోడన పసిడి వోలెమాపె రటిలోన గలయట్టి మడిని యందు
శ్రీ శంకరయ్యగారికి నమస్సులు వింత గొలుపుచు వచ్చె వసంత ఋతువుఉల్లముప్పొంగ పూలెన్నొవెల్లి విరిసెమల్లెతీగకు; పూచె చేమంతులెన్నొ, పడతి పులకించ భర్తయే ముడిచె జడను
రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ బాగున్నది. అభినందనలు.మొదటిపాదంలో ‘పున్నాగముల’ అన్నప్పుడు గణదోషం. ఆ పాదాన్ని ‘ముద్దబంతులు చేమంతి పొన్న జాజి’ అనండి.*పండిత నేమాని వారూ,‘మల్లెపూవువంటి మనుమరాలి ఒంటినిండ చేమంతులు...’ మనోహరమైన భావం. చక్కని పూరణ. అభినందనలు.మనుమరాలిని ముగ్గురమ్మల బోలు పుత్తడిబొమ్మగా వర్ణించిన పద్యం చాలా బాగుంది.*నాగరాజు రవీందర్ గారూ, మీ పద్యవనంలో రకరకాల పూలు వికసించాయి. బాగుంది. అభినందనలు.*కందుల వరప్రసాద్ గారూ, మీ రెండు పూరణలూ వైవిద్యంగా అలరిస్తున్నవి. అభినందనలు.‘వచ్చెదము’ ... వచ్చెదమ్ము... అయింది. దానికి ‘వచ్చెద మిక’ అందామా?*లక్ష్మీదేవి గారూ, మదినిండా ఆనందాన్ని నింపగల పూరణ చెప్పారు. చాలా బాగుంది. అభినందనలు.*శైలజ గారూ, విరుపుతో అందమైన పూరణ చెప్పారు. అభినందనలు.*"అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ, ముగ్ధమనోహరమైన భావంతో పూరణ చెప్పి ఆనందాన్ని కలిగించారు. అభినందనలు.*సుబ్బారావు గారూ, విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.‘మడిని యందు’ అన్నదానిని ‘మడినిఁ బెంచ’ అనండి.*భాగవతుల కృష్ణారావు గారూ, ఉల్లమును పులకింపజేసే పూరణ చెప్పారు. అభినందనలు.‘ఋతువు ఉల్లము’ అనకుండా ‘వసంతకాల/ ముల్లముప్పొంగ...’ అనండి.
సవరణలకు శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో.===========*==============తిమ్మడింట మల్లె తీగకు పూచె చేమంతు లెన్నొజూడు మామ,పోయి జూచి వచ్చె దమిక,కాచి యుంచితి నీరు వేగ రమ్ము నీవు వేడుక గన !
చేర వచ్చు రాముని గని యోర కంటమల్లె తీగ సీతామాలక్ష్మి మఱచె శ్వాసవిల్లు విఱచిన వెంటనె యుల్లమలరమల్లె తీగకు పూచె చేమంతులెన్నొ!
సహదేవుడు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు.‘సీతామాలక్ష్మి’ అన్నచోట గణదోషం. ‘సీతాదేవి’ అంటే సరి!
గురుదేవుల సవరణకు ధన్యవాదాలు. తమరి సూచిసూచిక సవరణతో: చేర వచ్చు రాముని గని యోర కంటమల్లె తీగ సీతాదేవి మఱచె శ్వాసవిల్లు విఱచిన వెంటనె యుల్లమలరమల్లె తీగకు పూచె చేమంతులెన్నొ!
మల్లె పువ్వును బోలెడు మచ్చ కంటిసిగను చామంతులు ముడిచి చెంగలించ అనియె పెనిమిటి భార్యతో నంబుజాక్షి!మల్లె తీగకుపూచె చేమంతులెన్నొ
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములుఅరయ సిరిని నర్చింపoగ విరులు బూసె మల్లెతీగెకు .పూచె చేమంతులెన్నొ శివుని సతుల పూజలకు నీ శిశిర మందు ధన్యమాయెను పువు జీవితమ్ము నేడు
మల్లె తీగయు చేమంతి మనసు బడుఛు నాటినాడను కుండిలో నాడు, నేడు చూడ బట్టెను హతవిధీ చీడ లచట మల్లెతీగెకు, .పూచె చేమంతులెన్నొ
ముద్ద బంతులు చేమంతి పున్నా గముల
రిప్లయితొలగించండికల్లు కొన్నవి తీగలు యల్ల నల్ల
వెన్నె లందున గన్పట్టు వేడ్క జూడ
మల్లె తీగకు పూచె చేమంతు లెన్నొ
మల్లె తీగెను బోలిన మనుమరాలు
రిప్లయితొలగించండిబట్టపై పూల గుత్తుల పగిది జూచి
తాత పద్యమ్ము నల్లెను ప్రీతి తోడ
మల్లె తీగెకు బూచె చేమంతు లెన్నొ
ప్రణామములు
రిప్లయితొలగించండితాతగారి తో పద్యం వ్రాయించు కున్న మనుమరాలు ఎం.....త ....అదృష్ట వంతు రాలో ? చాలా చాలా బాగుంది
రిప్లయితొలగించండిఅమ్మా! రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు.
మా మనుమరాలు కళల పద్మజుని యాలు
సిరుల బేర్కొను నెడల శ్రీధరుని యాలు
వరలు సౌభాగ్యమెన్న శంకరుని యాలు
ముద్ద బంగార మనదగు ముద్దరాలు
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో.
==============*=================
తిమ్మడింట మల్లె తీగకు పూచె చే
మంతు లెన్నొజూడు మామ,పోయి
జూచి వచ్చె దమ్ము,కాచి యుంచితి నీరు
వేగ రమ్ము నీవు వేడుక గన !
కలువ కంటి యీ తిమ్మడు కాడు,బావ
తిమ్మడు,గణక యంత్ర స్థితి గతి మార్చ
చిత్ర మందు చిత్రముగాను చిత్ర మలర
మల్లె తీగకు పూచె చేమంతు లెన్నొ!
మల్లియల్ పూచె నిండుగా మాదు తోట
రిప్లయితొలగించండిమల్లె తీఁగకు; పూచె చేమంతులెన్నొ;
యింటి వాకిట చెండు పూలింపు గొల్పె;
నాదు మనమది నిండె నానందమిండ్రు.
పరిమళమ్ములు వెదజల్లి పలుకరించి
రిప్లయితొలగించండిబొండు మల్లెలు విరబూసె నిండుగాను
మల్లెతీగకు, పూచె చేమంతు లెన్నో
అందగించుచు కనులకు విందుజేసె
మానినీమణి యలివేణి మల్లెతీగ!
రిప్లయితొలగించండికొప్పునన్ పుష్ప మాలికల్ కొల్వుతీరె
నట్టి పూబోడి మరియింత నందగింప
మల్లెతీగకు పూచె చేమంతులెన్నొ!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిలక్ష పద్యార్చనం - 'గ్రంథ ముఖి '( ఫేస్ బుక్ ) మాధ్యమం లో డా . రాళ్ళబండి కవితాప్రసాద్
రిప్లయితొలగించండిhttp://andhraamrutham.blogspot.in/2014/03/blog-post_1.html#.UxGBMOOSyi4
పూలు విరివిగ బూచెను బొలుపు గాను
రిప్లయితొలగించండిమల్లె తీగకు, పూచె చేమంతు లెన్నొ
పసుపు వర్ణము తోడన పసిడి వోలె
మాపె రటిలోన గలయట్టి మడిని యందు
శ్రీ శంకరయ్యగారికి నమస్సులు
రిప్లయితొలగించండివింత గొలుపుచు వచ్చె వసంత ఋతువు
ఉల్లముప్పొంగ పూలెన్నొవెల్లి విరిసె
మల్లెతీగకు; పూచె చేమంతులెన్నొ,
పడతి పులకించ భర్తయే ముడిచె జడను
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటిపాదంలో ‘పున్నాగముల’ అన్నప్పుడు గణదోషం. ఆ పాదాన్ని ‘ముద్దబంతులు చేమంతి పొన్న జాజి’ అనండి.
*
పండిత నేమాని వారూ,
‘మల్లెపూవువంటి మనుమరాలి ఒంటినిండ చేమంతులు...’ మనోహరమైన భావం. చక్కని పూరణ. అభినందనలు.
మనుమరాలిని ముగ్గురమ్మల బోలు పుత్తడిబొమ్మగా వర్ణించిన పద్యం చాలా బాగుంది.
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ పద్యవనంలో రకరకాల పూలు వికసించాయి. బాగుంది. అభినందనలు.
*
కందుల వరప్రసాద్ గారూ,
మీ రెండు పూరణలూ వైవిద్యంగా అలరిస్తున్నవి. అభినందనలు.
‘వచ్చెదము’ ... వచ్చెదమ్ము... అయింది. దానికి ‘వచ్చెద మిక’ అందామా?
*
లక్ష్మీదేవి గారూ,
మదినిండా ఆనందాన్ని నింపగల పూరణ చెప్పారు. చాలా బాగుంది. అభినందనలు.
*
శైలజ గారూ,
విరుపుతో అందమైన పూరణ చెప్పారు. అభినందనలు.
*
"అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
ముగ్ధమనోహరమైన భావంతో పూరణ చెప్పి ఆనందాన్ని కలిగించారు. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
‘మడిని యందు’ అన్నదానిని ‘మడినిఁ బెంచ’ అనండి.
*
భాగవతుల కృష్ణారావు గారూ,
ఉల్లమును పులకింపజేసే పూరణ చెప్పారు. అభినందనలు.
‘ఋతువు ఉల్లము’ అనకుండా ‘వసంతకాల/ ముల్లముప్పొంగ...’ అనండి.
సవరణలకు శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో.
రిప్లయితొలగించండి===========*==============
తిమ్మడింట మల్లె తీగకు పూచె చే
మంతు లెన్నొజూడు మామ,పోయి
జూచి వచ్చె దమిక,కాచి యుంచితి నీరు
వేగ రమ్ము నీవు వేడుక గన !
చేర వచ్చు రాముని గని యోర కంట
రిప్లయితొలగించండిమల్లె తీగ సీతామాలక్ష్మి మఱచె శ్వాస
విల్లు విఱచిన వెంటనె యుల్లమలర
మల్లె తీగకు పూచె చేమంతులెన్నొ!
సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
‘సీతామాలక్ష్మి’ అన్నచోట గణదోషం. ‘సీతాదేవి’ అంటే సరి!
గురుదేవుల సవరణకు ధన్యవాదాలు. తమరి సూచిసూచిక సవరణతో:
రిప్లయితొలగించండిచేర వచ్చు రాముని గని యోర కంట
మల్లె తీగ సీతాదేవి మఱచె శ్వాస
విల్లు విఱచిన వెంటనె యుల్లమలర
మల్లె తీగకు పూచె చేమంతులెన్నొ!
మల్లె పువ్వును బోలెడు మచ్చ కంటి
రిప్లయితొలగించండిసిగను చామంతులు ముడిచి చెంగలించ
అనియె పెనిమిటి భార్యతో నంబుజాక్షి!
మల్లె తీగకుపూచె చేమంతులెన్నొ
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిఅరయ సిరిని నర్చింపoగ విరులు బూసె
మల్లెతీగెకు .పూచె చేమంతులెన్నొ
శివుని సతుల పూజలకు నీ శిశిర మందు
ధన్యమాయెను పువు జీవితమ్ము నేడు
మల్లె తీగయు చేమంతి మనసు బడుఛు
రిప్లయితొలగించండినాటినాడను కుండిలో నాడు, నేడు
చూడ బట్టెను హతవిధీ చీడ లచట
మల్లెతీగెకు, .పూచె చేమంతులెన్నొ