రాజేశ్వరి అక్కయ్యా, మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు. రెండవ పద్యం రెండవపాదంలో గణదోషం. ‘చెఱగున పసివాని గట్టి...’ అనండి. * పండిత నేమాని వారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * శ్రీ యెర్రాజి జయసారథి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * సహదేవుడు గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు. జిలేబీ గారి భావానికి మీ పద్యం బాగుంది. ధన్యవాదాలు. * మిస్సన్న గారూ, మీ పద్యం కరుణరసాత్మకంగా ఉంది. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, మీ ద్విపద బాగుంది. అభినందనలు. * పియెస్సార్ మూర్తి గారూ, (దయచేసి మీ పూర్తి పేరు చెప్పండి.) మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * నాగరాజు రవీందర్ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
మండెడి నెండన బడియీ
రిప్లయితొలగించండిబండెడు నిటుకలను మోయ బాలుని కొఱకై
యెండిన గుండెల మాటున
పిండగ పాలెన్ని వచ్చు ప్రీతిగ నీయన్
మధ్యాక్కర:
రిప్లయితొలగించండిధరలోన సంసార భరము తలపంగ తరమె యేరికిని?
హరి హరీ! తన పొట్ట కొరకు అబ్బాయి కడుపు నింపుటకు
తరుణి కష్టము జూడగలమె? దైవమా! దీన దయాళు!
కరుణతో నట్టి వారలను కాపాడవే? కంజనేత్ర!
రిప్లయితొలగించండికడుపు లో నక నక భారం
జోలెలో కెవ్వు కెవ్వు భారం
తలపై ఇటికీ ల మోపు భారం
'ఇంతిహాసం' ఎల్లవేళలా భారం
జిలేబి
శిరమున బరువును మోయుచు
రిప్లయితొలగించండిచెరగున బిడ్డను గట్టి చింతించ మదిన్
వరపుత్రు డనుచు ముద్దిడి
పరవశ మునహత్తు కొనని పాపపు తల్లిన్
శ్రీ నేమాని ,శ్రీ శంకరయ్య గురువులకు వందనములు.
రిప్లయితొలగించండి.
సంసార భరము మోయగ
హింసలఁబడ దప్పుకొనగ నెవ్వరి తరమే ?
కంసారి దయను గలిగిన
సంసారమునీదవచ్చు సరళపు రీతిన్.
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పద్యం రెండవపాదంలో గణదోషం. ‘చెఱగున పసివాని గట్టి...’ అనండి.
*
పండిత నేమాని వారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
శ్రీ యెర్రాజి జయసారథి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
పొట్ట కూటికై యిటికల కట్ట నబల
రిప్లయితొలగించండిమోయు చుండెను జూడుడు ముదిత లార!
చంటి బాలుడు నడుమున నంటి నటుల
జోలి గట్టెను పాపమా యాలి యచట
నడుముకు బిడ్డను గట్టుకు
రిప్లయితొలగించండినిడుములు దీరంగ మోయ నిటుకల తలపై
పడునే ముద్దలు నిండగ
కడుపున,పాలిచ్చి బిడ్డ కడుపును నింపన్!
మాతృమూర్తి మనసు మకరంద బిందువు
రిప్లయితొలగించండికూలి కైన ధనికురాలి కైన
జాలి చూపు వారు వేలలో నుందురు
చింత దీర్చ నెవరు చెంత బోరు.
చిన్నినా కన్నయ్య చెదిరెనా నిదుర!
రిప్లయితొలగించండినిన్నునా యెదయందు నిదురబుచ్చేను!
కాయకష్టముఁ జేసి కాపాడుకొందు!
సాయముండును నీకు జగదీశుడెందు!
చదువు లేని తల్లి చమటోడు చున్నది
రిప్లయితొలగించండికూలి జేసి నీకు కూడు బెట్టె
పెరిగి రేపు నీవు పెద్దైన తరువాత
బరువు మోసినమ్మ పరువు నిలుపు
అమ్మ నమ్మకమ్ము వమ్ముజేయకు నీవు
ఆశ నీవు అమ్మ ఆస్తి నీవు
తల్లి విలువ తూచు తక్కెడెక్కడలేదు
ధనము కన్న ప్రేమ మనసు మిన్న
కన్న బిడ్డను ముదమున కటిని గట్టి
రిప్లయితొలగించండిమోయు చుండె తా నిటుకల మోత గనక
ఎన్నిపనులైన తాజేయు నింటి కొరకు
సహచరి యనెడి నామంబు సార్థకమ్ము
జిలేబి గారి భావానికి పద్య రూపం:
రిప్లయితొలగించండికడుపున నాకలి భారం!
నడుమున తనయుండి కేక నడవగ భారం!
తడవకు మోసెడు ఇటుకలు
యిడుముల దప్పించు హాస మింతికి భారం!
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
జిలేబీ గారి భావానికి మీ పద్యం బాగుంది. ధన్యవాదాలు.
*
మిస్సన్న గారూ,
మీ పద్యం కరుణరసాత్మకంగా ఉంది. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
మీ ద్విపద బాగుంది. అభినందనలు.
*
పియెస్సార్ మూర్తి గారూ, (దయచేసి మీ పూర్తి పేరు చెప్పండి.)
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.