శ్రీమతి శైలజ గారు: శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. పుస్తక పురుగు అనకూడదు - దుష్టసమాసము.
శ్రీమతి లక్ష్మీ దేవి గారు: శుభాశీస్సులు. మీ పద్యము చాల బాగుగ నున్నది. అభినందనలు. సరస్వతిని సంబోధించుచు చివరలో శర్వాణి అన్నారెందుకు? శర్వాణి అంటే పార్వతి కదా!.
శ్రీ సుబ్బా రావు గారు: శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
శ్రీ నాగరాజు రవీందర్ గారు: శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
Sri HVSN Murti garu శుభాశీస్సులు మీ విపులమైన ఖండిక "పుస్తకమ్ము హస్త భూషణమ్ము" చాల బాగుగ నున్నది. అభినందనలు.
Sri PSR Murti Garu శుభాశీస్సులు: మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. అడవి......నాట్యమాడిన గాని - అనే పాదములో యతి మైత్రిలేదు. ఎవరు + అడవి = అనుచోట యడాగమము రాదు. అందుచేత ఇలాగ మార్చుదాము: ఆలకింతు రెవ్వరడవిలోన?
శ్రీమతి రాజేశ్వరి గారు: శుభాశీస్సులు మీ పద్య,ము బాగుగ నున్నది. అభినందనలు. బుద్ధుడు అనుచోట టైపు పొరపాటు బుధుడు అని వ్రాసేరు.
శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు: శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. పగిలెను + ఎత్తైన = అనుచోట సంధి నిత్యము; యడాగమము రాదు. అందుచేత "గుండె పగులగా" అందాము. కూరుచుంటిని అను ప్రయోగము ఇంపుగాలేదు.
మన్నించండి. అర్థము తెలియనప్పుడు శర్వాణి గీర్వాణి అంటే సరస్వతి అని మనసులో ముద్రపడింది. కానీ తర్వాత తెలిసిందేమంటే శర్వాణి పార్వతి అని గీర్దేవి సరస్వతి అని. గీర్వాణము అనే పదము తప్ప గీర్వాణి అనే పదము నిఘంటువులో కనిపించలేదు. ఎక్కడో విన్నట్టు గుర్తు. సినిమా కవులెవరన్నా వాడినారేమో.
శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది - అభినందనలు. యడాగమము కాకుండా మీరు వున్నది అని వుగాగమమును కొత్తగా చేర్చేరు. అది సంప్రదాయము కాదు. స్వస్తి.
కవిమిత్రులకు నమస్కృతులు. తిరుపతి ప్రయాణం ముగించుకొని రాత్రి ఇల్లు చేరాను. ఈ నాలుగు రోజుల్లో నెట్ సెంటర్‍కు వెళ్ళి బ్లాగును చూచే అవకాశం దొరకలేదు. ఇప్పుడే మిత్రుల పూరణలను చూస్తున్నాను. పండిత నేమాని వారు ఆంధ్రపద్యకవితాభిమానంతో, మనపై వాత్సల్యంతో పూరణల, పద్యాల గుణదోష విచారణ చేసి తగిన సూచన లిచ్చారు. వారికి నా ధన్యవాదాలు. చక్కని పద్యాలు చెప్పిన కవిమిత్రులు.... పండిత నేమాని వారికి, శైలజ గారికి, లక్ష్మీదేవి గారికి, పోచిరాజు సుబ్బారావు గారికి, నాగరాజు రవీందర్ గారికి, హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి, పియెస్సార్ మూర్తి గారికి, రాజేశ్వరి అక్కయ్యకు, అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి, గోలి హనుమచ్ఛాస్త్రి గారికి అభినందనలు, ధన్యవాదాలు.
పుస్తకమ్ముల ప్రోవులో మునిగె నొక్క
రిప్లయితొలగించండిడచ్చటనె ప్రొద్దు పుచ్చు నిరంతరముగ
పుస్తకమ్ములె సర్వస్వముగ జెలంగు
నతని మస్తకమ్మున నుండునదియె సున్న
రిప్లయితొలగించండిపుస్తకమ్ములు భారీ ఐనవి
మస్తకమ్ములు ఖాళీ ఐనవి
నేస్తకమ్ములు ఫెసుబుక్కు లైనవి
హస్తకమ్ములు అంకోపరి తోడైనవి !
శుభోదయం
జిలేబి
పుస్తక పురుగై జదివిన
రిప్లయితొలగించండిమస్తకమునకెక్కలేదె మానవ నీకున్!
మస్తుగ పెరిగెకితాబులు!
పుస్తకములు తొడవులయ్యె పుడమిని జూడన్
కరమునఁ బట్టితి పుస్తకమ్మును భారతీ! నీదు
రిప్లయితొలగించండిశరణముఁ గోరితినమ్మశారదా! వీడను దేవి
చరణముఁ, బాలన సేయ సందియమేలనో!నాదు
మొఱలనుఁ జెవినిడి కరుగు మోయమ్మ! వాణి!శర్వాణి!
పుస్త కంబుల పురుగుగా బోలు నతడు
రిప్లయితొలగించండిఒక్క దానిపై నొక్కటి యుండు నటుల
పేర్చి కూర్చుండె వానిపై పేర్మి తోడ
చూచు వారల కయ్యది చోద్య మాయె
పుస్తకంబు భువిని హస్తభూషణ మండ్రు
రిప్లయితొలగించండిభూషణంబె కాదు పుడమి జనుల
కధికమైన జ్ఞాన మందించు శ్రేష్ఠుడౌ
హితునివలెను చేరి ఎల్లవేళ. 1.
పుస్తకంబు చదువ మస్తిష్కవికసనం
బగుట సత్యసూక్తి యన్నిగతుల
పొత్తమునకు సాటి పుడమి లేదొక్కటి
పుస్తకంబు శ్రేష్ఠభూషణంబు. 2.
మంచి చెడులు తెలుపు, మమతానురాగాలు
పంచుచుండి జనుల కంచితమగు
ధర్మపథములోని మర్మంబులన్నియు
విస్తరించి చూపు వివిధగతుల. 3.
ఆచరించదగిన దత్యుత్తమంబైన
రీతిలోన పలుకు, నీతితోడ
చేయు వర్తనమున సిద్ధించు సుఖములన్
పుస్తకంబు తెలుపు విస్తరించి. 4.
సంఘమందునుండు సభ్యులందరికెంతొ
యుపకరించుచుండు నున్నతముగ
ప్రాణమిత్రుడట్లు పథమును చూపించు
పుస్తకంబు శ్రేష్ఠభూషణంబు. 5.
గురువు పలుకుచుండు పరమాద్భుతంబులౌ
సూక్తులన్ని యొక్క చోట జేర్చి
విశదపరచుచుండు విజ్ఞానమును పెంచు
పుస్తకంబు శ్రేష్ఠభూషణంబు. 6.
పిన్న పెద్ద యనెడి భేదభావము లేక
ఉర్విజనుల కెల్ల నున్నతమగు
భావజాలమొసగు పరమహర్షముతోడ
పుస్తకంబు శ్రేష్ఠభూషణంబు. 7.
బ్రతుకుతెరువు చూపు, భాగ్యంబులందించు
సంఘజనులతోడ సవ్యగతిని
వ్యవహరించు తీరు పలుకు నేందేగిన
పుస్తకంబు శ్రేష్ఠభూషణంబు. 8.
ఇందునున్నయట్టి దెందైన గాన్పించు
నిందులేని దొక్క టెందు లేదు
జగతిలోన వెలుగు సర్వాత్మకంబౌచు
పుస్తకంబు శ్రేష్ఠభూషణంబు. 9.
పుస్తకాలపురుగు మస్తకంబంతయు
జ్ఞానసాగరమున స్నానమాడ
నితని జూడదగును సతతంబు పఠియించు
చుండె నౌర! స్వాంతశుద్ధిగోరి. 10.
ఎంత చదువుకున్న నేమి లాభంబు రా
రిప్లయితొలగించండిపరులకెవరికి యది పంచనపుడు
అడవిలోన నెమలి నాట్యమాడిన గాని
ఆలకించు నెవరు యడవిలోన
మస్తకము లేని వాడట
రిప్లయితొలగించండిపుస్తకముల శిఖర మందు బుధుడు తానై
సుస్థిరమగు నాశ్రయ మని
హస్తమునకు భూషణ ముగ హాయి నొసంగున్
కవిని కావలయుననెడి కాంక్షతోడ
రిప్లయితొలగించండిప్రొగు చేసితి నెన్నియో పుస్తకముల
గుండెపగిలెను ఎత్తైన గుట్ట చూసి
కూరుచుంటిని గుట్టపై నీరసముగ
శ్రీమతి శైలజ గారు: శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
పుస్తక పురుగు అనకూడదు - దుష్టసమాసము.
శ్రీమతి లక్ష్మీ దేవి గారు: శుభాశీస్సులు.
మీ పద్యము చాల బాగుగ నున్నది. అభినందనలు.
సరస్వతిని సంబోధించుచు చివరలో శర్వాణి అన్నారెందుకు?
శర్వాణి అంటే పార్వతి కదా!.
శ్రీ సుబ్బా రావు గారు: శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
శ్రీ నాగరాజు రవీందర్ గారు: శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
Sri HVSN Murti garu శుభాశీస్సులు
మీ విపులమైన ఖండిక "పుస్తకమ్ము హస్త భూషణమ్ము" చాల బాగుగ నున్నది.
అభినందనలు.
Sri PSR Murti Garu శుభాశీస్సులు:
మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
అడవి......నాట్యమాడిన గాని - అనే పాదములో యతి మైత్రిలేదు.
ఎవరు + అడవి = అనుచోట యడాగమము రాదు. అందుచేత ఇలాగ మార్చుదాము:
ఆలకింతు రెవ్వరడవిలోన?
శ్రీమతి రాజేశ్వరి గారు: శుభాశీస్సులు
మీ పద్య,ము బాగుగ నున్నది. అభినందనలు.
బుద్ధుడు అనుచోట టైపు పొరపాటు బుధుడు అని వ్రాసేరు.
శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు: శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
పగిలెను + ఎత్తైన = అనుచోట సంధి నిత్యము; యడాగమము రాదు.
అందుచేత "గుండె పగులగా" అందాము.
కూరుచుంటిని అను ప్రయోగము ఇంపుగాలేదు.
మన్నించండి. అర్థము తెలియనప్పుడు శర్వాణి గీర్వాణి అంటే సరస్వతి అని మనసులో ముద్రపడింది. కానీ తర్వాత తెలిసిందేమంటే శర్వాణి పార్వతి అని గీర్దేవి సరస్వతి అని. గీర్వాణము అనే పదము తప్ప గీర్వాణి అనే పదము నిఘంటువులో కనిపించలేదు. ఎక్కడో విన్నట్టు గుర్తు. సినిమా కవులెవరన్నా వాడినారేమో.
రిప్లయితొలగించండిసవరణ.
కరమునఁ బట్టితి పుస్తకమ్మును భారతీ! నీదు
శరణముఁ గోరితినమ్మశారదా! వీడను దేవి
చరణముఁ, బాలన సేయ సందియమేలనో!నాదు
మొఱలనుఁ జెవినిడి కరుగు మోయమ్మ!వాణి!మాయమ్మ!
ధన్యవాదాలు.
లా వైన పుస్తకమ్ములి
రిప్లయితొలగించండిలావున్నవి క్రింద , చేత లా చదువా ? చా
లావున్నవి చదువన లౌ
లావున్నది నీకు నేది లక్ష్యము చెపుమా ?
శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది - అభినందనలు. యడాగమము కాకుండా మీరు వున్నది అని వుగాగమమును కొత్తగా చేర్చేరు. అది సంప్రదాయము కాదు. స్వస్తి.
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండితిరుపతి ప్రయాణం ముగించుకొని రాత్రి ఇల్లు చేరాను. ఈ నాలుగు రోజుల్లో నెట్ సెంటర్‍కు వెళ్ళి బ్లాగును చూచే అవకాశం దొరకలేదు. ఇప్పుడే మిత్రుల పూరణలను చూస్తున్నాను. పండిత నేమాని వారు ఆంధ్రపద్యకవితాభిమానంతో, మనపై వాత్సల్యంతో పూరణల, పద్యాల గుణదోష విచారణ చేసి తగిన సూచన లిచ్చారు. వారికి నా ధన్యవాదాలు.
చక్కని పద్యాలు చెప్పిన కవిమిత్రులు....
పండిత నేమాని వారికి,
శైలజ గారికి,
లక్ష్మీదేవి గారికి,
పోచిరాజు సుబ్బారావు గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
పియెస్సార్ మూర్తి గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి
అభినందనలు, ధన్యవాదాలు.