20, మార్చి 2014, గురువారం

సమస్యాపూరణం - 1357 (నీటితో నగ్ని నార్పెడి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
నీటితో నగ్ని నార్పెడి మాట కల్ల.

16 కామెంట్‌లు:

 1. నేటి యుగమున జగతిని నీతి సున్న
  రగులు చుండిన బడబాగ్ని తగుల ములకు
  రాజ కీయపు రణమున రగులు పొగలు
  నీటితో నగ్ని నార్పెడి మాట కల్ల

  రిప్లయితొలగించండి
 2. రాజకీయాననవినీతి రగులి పొగలె
  నీతిమంతుడు మార్చుట నిజము కల్ల
  కారుచిచ్చున పుక్కిట గలిగియున్న
  నీటితో నగ్ని నార్పెడి మాట కల్ల.

  రిప్లయితొలగించండి
 3. నేటి నేతల ప్రతి మాట నీటి మూట
  గద్దె సిద్ధించు వరకు తా ముద్దు ముద్దు
  మాటలను జెప్పి నమ్మించు మనని కాని
  నీటితో నగ్ని నార్పెడి మాట కల్ల

  రిప్లయితొలగించండి
 4. రాజకీయపు కక్షలు రగులు కొనగ
  పంట కుప్పను మండించె పాపి యొకడు
  పేదల గుడిసె లంటించె పేడి యొకడు
  అనలునికి ననిలుడు పూర్తి యండ నివ్వ
  నీటితో నగ్ని నార్పెడి మాట కల్ల
  మైల పడిపోయె మనుజుల మానసములు
  మాడి పోయెను పల్లెల మాన్య చరిత

  ప్రజల సొమ్ముతో నాయకుల్ ప్రబలు చుండ
  బడుగు జనుల మనసులు బగ్గు మనగ
  రైతు గుండియల్ పూర్తిగా రగులు చుండ
  కపట నాటక నాయకుల్ కార్చు కనుల
  నీటితో నగ్ని నార్పెడి మాట కల్ల

  రిప్లయితొలగించండి
 5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 6. కమ్మె కాకుల కోనలో కారుచిచ్చు
  పచ్చ దనమంత బడిపోయె చిచ్చులోన
  రగులుకొనుచున్న మంటల సెగలు జూడ
  నీటితో నగ్ని నార్పెడి మాట కల్ల

  రిప్లయితొలగించండి
 7. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు
  నీ శిష్య పరమాణువు వినమ్రవందనములతో.

  భూమి పైన గల జలమును వ్యర్థము జేసి, చంద్ర మండలము,అంగారక గ్రహము లందు నీటి జాడకై ప్రయత్నము జేయు చున్నారు..
  ==============*============
  ముంత యందు నీటి నొలుక బోసి,దూర
  తీరముల గాంచ తీరైన తేరు వలెను
  మరలు గొల్పు చుండెడి యండ మావులందు
  నీటితో నగ్ని నార్పెడి మాట కల్ల !

  (ముంత = భూమి)

  రిప్లయితొలగించండి
 8. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  పుక్కిటినీటితో కార్చిచ్చు నార్పలేమన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  కందుల వరప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘ఎండవావులు’ టైపాటు వల్ల ‘అండమావు’ లయింది.

  రిప్లయితొలగించండి
 9. శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు తో...
  ===========*============
  ముంత యందు నీటి నొలుక బోసి,దూర
  తీరముల గాంచ తీరైన తేరు వలెను
  మరలు గొల్పు చుండెడి యెండ మావులందు
  నీటితో నగ్ని నార్పెడి మాట కల్ల !

  ( ముంత = భూమి)

  రిప్లయితొలగించండి
 10. అడవియందు కార్చిచ్చుల నడపతరమె?
  యచటి నిర్వాహకపు వర్గమన్ని గతుల
  సిద్ధముగ లేని యెడల కొంచెముగ నున్న
  నీటితో నగ్ని నార్పెడి మాట కల్ల.

  రిప్లయితొలగించండి
 11. కొండ లన్నియు భగభగ మండు చుండి
  మిన్ను నంటె ను మంటలు మన్ను నుండి
  యెంత యత్నము జేసిన సుంత గూడ
  నీ టితో నగ్ని నార్పెడి మాట కల్ల

  రిప్లయితొలగించండి
 12. తెలుగు ప్రజలను విడదీసి కలతబరచి
  వారి గుండెలు మండగా బాధ మాన్ప
  వారి కివి వీరి కవి యన వలనె శాంతి?
  నీటితో నగ్ని నార్పెడి మాట కల్ల.

  రిప్లయితొలగించండి
 13. లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  తెలుగువారి గుండెమంటల్ని ఆర్పడానికి ఏ నీళ్ళు ఉపకరిస్తాయి? చాలా మంచి పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. బూది యగ్నిని చల్లార్చ బూను ననిన
  మడియ బ్రతుకుట నిజమన్న మాట కల్ల
  ఇసుక నిండు ఎడారిలో నెండమావి
  నీటితో నగ్ని నార్పెడి మాట కల్ల.

  రిప్లయితొలగించండి
 15. పాటి కాదని విభజింప పల్కుచున్న
  చెవిటి చెవినొగ్గి తమమాట చెల్లు ననుచు
  పూర్తి యొంటెత్తు పోకడ పొవుటన్న
  రగులు శేషాచలపు మంట పొగల రీతి
  ' నీటితో నగ్ని నార్పెడు మాట కల్ల '
  ప్రజల బాహాట వాక్కులు ప్రతి దినంబు

  రిప్లయితొలగించండి