6, మార్చి 2014, గురువారం

సమస్యాపూరణం - 1343 (ఏటేట నెన్నికల్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ఏటేట నెన్నికల్ హితమిచ్చు మనకు.
(ఇది ద్విపద. ఒక్కపాదంతో పూరణ చెప్పవచ్చు. లేదా బేసిసంఖ్యలో ఎన్నిపాదాలతోనైనా చెప్పవచ్చు.)

27 కామెంట్‌లు:

 1. ఓటున కమ్ముడు బోయెడి నేత
  ఏటేట నెన్నికల్ హితమిచ్చు మనకు

  రిప్లయితొలగించండి
 2. బాటిలు దొరకగ పాడిరి వారు
  ఏటేట నెన్నికల్ హితమిచ్చు మనకు
  పోటీలు పడి బాగ పోయించుదురుగ
  నాటుకోడిమటను నాటుతోదొరకు

  రిప్లయితొలగించండి

 3. ఏటేట నెన్నికల్ హితమిచ్చు మనకు
  రోజేట కంది వారి పూరణల్ కిక్కిచ్చు మనకు !!  శుభోదయం
  జిలేబి

  రిప్లయితొలగించండి
 4. నాటును గొని చిన్న నాయకు లనిరి
  ఏటేట నెన్నికల్ హితమిచ్చు మనకు
  ఘాటగు సారాయి క్యానులు వచ్చు

  రిప్లయితొలగించండి
 5. ఏటేట నెన్నికల్ హితమిచ్చు మనకు
  దీటైన నేతలన్ దెప్పించు నిటకు

  రిప్లయితొలగించండి
 6. ఏటేట నెన్నికల్ హితమిచ్చు మనకు
  ఓట్లతో నోటులుఁ యొనగూడు ననిరి

  రిప్లయితొలగించండి
 7. ఏటేటా నెన్నికల్ హితమిచ్చు మనకు
  మాటాడగలహక్కు మనకప్పుడొచ్చు

  రిప్లయితొలగించండి
 8. ఏటేట నెన్నికల్ హిత మిచ్చు మనకు
  సాటైన నేతలన్ సమ కూర్చు కొనగ

  రిప్లయితొలగించండి

 9. ప్రణామములు గురువుగారు, ద్విపద ప్రదమంగా వ్రాసాను..తప్పులను మన్నించి సరిదిద్ద మనవి...

  ఓటేయు హక్కుని వొదిలించు కోకు
  నీటైన రూటున్న నేతల్ని జూడు
  తూటాయె మనవోటు తొలగించు చెడును
  దాటేసి నావంటె దండాలు నీకు
  ఏటేటా నెన్నికల్ హితమిచ్చు మనకు

  రిప్లయితొలగించండి
 10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 11. గురువుగారు చిన్న సందేహం... ద్విపదని ప్రాస లేకుండా వ్రాయవచ్చా ? అలాగే ప్రాసయతి వాడవచ్చా?

  రిప్లయితొలగించండి
 12. రాజేశ్వరి అక్కయ్యా,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  మొదటి పాదంలో యతి తప్పింది. ‘ఓటున కమ్ముడై యొప్పెడి నేత’ అందామా?
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  నాల్గవ పాదంలో ‘నాటు’ శబ్దం పునరుక్తమయింది. ‘నాటుకోడి మటను వాటమై దొరుకు’ అంటే?
  మీ రెండవ పూరణలో మూడు పాదాలే ఉన్నాయి. ద్విపదను రెండు పాదాల గుణకారముతో సరిసంఖ్యలో వ్రాయాలి. ద్విపద అంటేనే రెండు పాదాల పద్యం.
  మీ మూడవ పారణలో ‘ఓట్లతో పలునోటు లొనగూడు...’ అనండి.
  *
  జిలేబీ గారూ,
  __/\__
  *
  భాగవతుల కృష్ణరావు గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ‘వచ్చు’ను ‘ఒచ్చు’ అనడం గ్రామ్యం. అక్కడ ‘మన కప్పు డబ్బు’ అనండి.
  ద్విపదలో రెండు రెండు పాదాలకు ప్రాసను పాటించాలి. ప్రాసను పాటించకుండా కూడ వ్రాయవచ్చు. దానిని మంజరీ ద్విపద అంటారు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘సాటి + ఐన’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘సరియగు’ అనండి.

  రిప్లయితొలగించండి
 13. పూజ్యగురుదేవులు శంకరయ్య గారికి నమస్సులు. నాటు అని మాఏరియాలో మందును అంటారు. అందుకని అది రెండవ సారి వాడాను. రెండవ పద్యము నాలుగు పాదములతో యిప్పుడుపంపుచున్నాను.
  నాటును గొని చిన్న నాయకు లనిరి
  ఏటేట నెన్నికల్ హితమిచ్చు మనకు
  ఘాటగు సారాయి క్యానులు వచ్చు
  ఓట్లతో పలునోటు లొనగూడు ననిరి

  రిప్లయితొలగించండి
 14. ఏటేట నెన్నికల్ హితమిచ్చు మనకండ్రు
  ..........మద్యవిక్రేతలౌ మనుజులెల్ల
  ఏటేట నెన్నికల్ హితమిచ్చు మనకండ్రు
  ..........బాలబాలిక లిలన్ బహుళగతుల
  ఏటేట నెన్నికల్ హితమిచ్చు మనకండ్రు
  ..........వాహనచోదకుల్ వైభవముగ
  ఏటేట నెన్నికల్ హితమిచ్చు మనకండ్రు
  ..........గ్రామీణకర్షకుల్ శ్రామికులును
  కారణంబులు చూడంగ క్రమత మద్య
  విక్రయంబులు పెరుగును, విద్యలకును
  సెలవు లభియించు, తమనెందు దలతురిలను,
  పేరు పేరున తమకందు గౌరవంబు.  రిప్లయితొలగించండి
 15. ఏటేట నెన్నికల్ హితమిచ్చు మనకంచు
  ..........వచియించగానేల వసుధలోన
  అభివృద్ధి యణగారు, విభవంబు క్షీణించు
  ..........ధనధాన్య సంపత్తి తరగిపోవు
  కలహంబు లధికమై యిలలోన ద్వేషంబు
  ..........లినుమడించునుసతం బనుచితముగ
  నిత్యంబులైనట్టి కృత్యంబులన్నియు
  ..........చెదరిపోవుటె కాదు ముదమణంగు
  కాన నేటేట నెన్నికల్ మానవులకు
  హితము కలిగించు ననువాక్య మించుకేని
  సత్య మనదగ దెన్నికల్ జరుగవలయు
  నైదు వర్షాల కొకసారి మోదమొదవ.

  రిప్లయితొలగించండి
 16. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

  కోటులు వెచ్చింప కొంప కొల్లేరు
  కూటికా గుడ్డ కా కొరగామి ఖర్చు
  యేటేట నెన్నికల్. హితవిచ్చు?మనకు !

  రిప్లయితొలగించండి
 17. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  కేవలం ‘నాటు’ అంటే ఎలా ఆ నాటు సరుకు ఏదో పేర్కొనాలి కదా... ఎవరైనా మందుకొట్టడాన్ని నాటా, నీటా అని అడగడం అంతటా ఉన్నదే.
  సవరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
  ద్విపద సమస్యను సీసపద్యాలలో అమోఘంగా పూరించారు. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  మూడు పాదాలతో ద్విపదను వ్రాయడం సంప్రదాయం కాదు, రెండు దాని గుణకాల పాదాలుండాలి. అంటే సరిసంఖ్యలో పాదాలుండాలి.

  రిప్లయితొలగించండి
 18. ఓటరన్నకడకు నోర్పుతో వచ్చి
  నోటితో వరమిచ్చి నోట్లను పంచి
  ధాటిగా మద్యము ధారగా పోయ
  నేటేట యెన్నికల్ హితమిచ్చు మనకు

  రిప్లయితొలగించండి
 19. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 20. ఏటేటా నెన్నికల్ మబ్బులా ముంచుకొచ్చే
  పేట పేటా పార్టీలు వరాల జల్లు కురిపించే
  ఎటో దారి తెలీక తిరుగాడే సామాన్యునికి
  ఏ పట్టున నీడ దొరకునో తెలియదాయె
  ఏటేటా నెన్నికల్ హితమిచ్చు మనకని తెలియదాయె

  రిప్లయితొలగించండి
 21. ఏటేట నెన్నికల్ హితమిచ్చు మనకు
  నట్టేట మునకల్ మితమవ్వు తుదకు

  రిప్లయితొలగించండి
 22. శైలజగారు,

  కందము, తరువోజ లాగున ద్విపద ఒక 'జాతి' పద్యము కాబట్టి ప్రాసయతి వాడకూడదంటారు. కానీ సోమనాధుడు ద్విపదలో ప్రాసయతి వాడాడని చదివిన గుర్తు. ఇంకొక విషయము. ద్విపదలో పాదాంత విరామం ఉండాలి. అంటే మొదటి పాదంలోని ఆఖరి పదమును రెండవ పాదములోనికి పొడిగించకూడదు.

  రిప్లయితొలగించండి
 23. బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  మణి గారూ,
  విజయ్ రాఘవేంద్ర గారూ,
  మంచి భావాలను వెలుబుచ్చారు. సంతోషం.
  ఛందోబద్ధమైన పద్యాలు వ్రాయడానికి ప్రయత్నించండి. ఆ పయత్నంలో సహకరించడానికి నేను, మిత్రులు సిద్ధంగా ఉన్నాము. స్వస్తి!
  *
  పుష్యం గారూ,
  ద్విపదలో ప్రసయతిని వాడరాదని, ఏకపదం ఉభయపాదాలలో వ్యాపించరాదని లాక్షణికులు చెప్పినా కవులు కచ్చితంగా ఈ నియమాలను పాటించలేదు.
  ప్రాసయతికి ఉదా.
  సరసిజంబులు మొగి విరియక మున్న (పండితారాధ్యచరిత్ర, పురాతన, ౧౨ వ పంక్తి.)
  ఒకేపదం రెండు పాదాల్లో వ్యాపించడానికి ఉదా.
  ‘భళిర నా యేలిక బాపురే భూధ
  వుల శిరోమణితగవుల చక్రవర్తి’ (పరమయోగి విలాసము. ౪, ౬౭౩౭, ౮)
  ‘...వలిపంబు సరిగమ్మి తెలుపు దివ్యాంబ
  రంబును నుదయరాగంపు దేవాంబ
  రంబు పొత్తియు గుజరాష్ట్రంబు పట్టు..." (బసవపురాణము, పు. ౪౯)

  రిప్లయితొలగించండి
 24. మాటలు కోటలు దాటకఁ జూచి
  యేటేట నొక కార్యమీడేర్చ నెంచి
  సాటి జనులు మెచ్చు మేటికార్యమున
  కేటేట నెన్నికల్ హితమిచ్చు మనకు
  (ప్రతి సంవత్సరారంభములో నొక మంచి కార్యము నెన్నుకుని సాధించిన మంచిదను భావంతో)

  రిప్లయితొలగించండి