7, మార్చి 2014, శుక్రవారం

పద్య రచన – 528

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

29 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. చిరు ప్రయత్నం మాత్రమే:
   ----+-----+----+--
   నంద బాలుని చుట్టు భక్తులెల్లరు
   బృంద గానము ముట్టు భక్తియెల్లలు
   కొలను కలువ గుట్టు యెరిగె పెరుమాళ్ళు
   కలువ రమణుల జట్టు కొనియాడె వేనోళ్ళు

   తొలగించండి
 2. గోపాల బాలురు గోవుల గాచుచు
  ....విశ్రాంతి గైకొను వేళ యగుట
  కొలని యొడ్డున చెట్ల గుంపుల కడజేరి
  ....చల్దులు కుడుచుచు సంబరమున
  నాట పాటల లోన హాయిగా దేలుచు
  ....నానా ప్రకారాల నవ్వుకొనుచు
  వడియాలు, మాగాయ, పచ్చళ్ళు, కూరలు
  ....బాగుగా దినుచును బంచుకొనుచు
  కథలు చెప్పుచును పొడుపు కథలు వినుచు
  విందులొందు చుండిరి కనువిందు గాగ
  నందనందను సాంగత్య మందినట్టి
  వారలెల్లరు పొందిరి పరమ సుఖము

  రిప్లయితొలగించండి
 3. గోవులను గాచి యలసిన గోకు లమ్ము
  కల్ల కపటమ్ము లెరుగని మల్లె సిరులు
  గొల్ల వనితలు బాలురు గోము గాను
  చల్ది దినుచుండి రందరు సరస గతిని

  రిప్లయితొలగించండి
 4. విజయ్ రాఘవేంద్ర గారూ,
  వచన కవితగా మీ రచన బాగుంది. అభినందనలు.
  కాని మన బ్లాగు ఛందోబద్ధ రచనలకే ప్రాధాన్యం ఇస్తుంది. కనుక మీరు పద్యాలను వ్రాసే ప్రయత్నం చేయండి. శుభమస్తు!
  *
  పండిత నేమాని వారూ,
  గోపాలబాలురతో కృష్ణుడు చల్దులారగించే ఘట్టాన్ని మనోహరంగా రచించారు. అభినందనలు. ధన్యవాదాలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  సరసమైన పద్యాన్ని చెప్పి అలరించారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. కలువ రేకుల చందము కాని పించ
  గోపబాలురు కూర్చుని గుండ్రముగను
  మధ్య కృష్ణున కిచ్చుచు ముదము తోడ
  ఆర గింతురు చల్దుల నబ్బురముగ
  చిత్ర మందున చూడుడు చిత్రముగ ను

  రిప్లయితొలగించండి
 6. గోప బాలలు బాలురు కూర్మి తోడ
  నాట లాడి గోపాలుతో నలసి సొలసి
  కూరుచుండిరి ముదముతో కోనలోన
  బాలకృష్ణుని లీలలఁ బాడు కొనుచు

  రిప్లయితొలగించండి
 7. వన భోజనమన పులకిత
  మనముల పాల్గొనగ రాని మనుజులు గలరే?
  మునిజన సన్నుతుఁ దోడుగ
  వన భోజన గోకులంపు వర్ణన తరమే?

  రిప్లయితొలగించండి
 8. గోప వనితలు బాలురు గోవు లదివొ
  నడుమ గూర్చుండె కన్నయ్య నల్లనయ్య
  ఆల మందలు గాయుచు నలసి రేమొ!
  చల్ది బంచుచు దినుచుండె సంతసమున

  రిప్లయితొలగించండి
 9. బాలులారా! రండు జాలమేలనొ నేడు?
  ..........చల్దులు భుజియించు సమయమయ్యె,
  అలసియున్నారెంతొ పలుకులో దైన్యంబు
  ..........మిమ్మావరించెనో మిత్రులార!
  క్షుద్బాధ తీరంగ కూరిమి మీరంగ
  ..........నారగించెద మిప్పు డంద మొలుక
  బహుమాన్యమై యొప్పు భక్ష్యరాశిని గాంచు
  ..........డత్యంత మోదంబు నందగలరు
  జాగు చేయవలదు సత్వరంబుగ రండు
  మీర లంచు బిలువ వార లపుడు
  రండు రండటంచు రయమున కృష్ణుని
  చెంత జేరినారు సంతసమున. 1.

  గోపబాలు రట్లు గోవిందు కెడ జేరి
  పరమహర్ష మొదవ సరసులౌచు
  కోరి కృష్ణు జుట్టి కూర్చుండి చవులూర
  ముడులు విప్పిచల్ది మూటలపుడు. 2.

  ఊరగాయ జూపి యూరించగా నొక్క
  డారగించె దాని నంది యొకడు
  మేలు భక్ష్య మొకడు చాలంగ జూపించ
  లాగి మ్రింగె నొక్క డాగ కుండ. 3.

  తనవద్ద నున్నట్టి ఘనపదార్ధములన్ని
  ..........భక్షించ రండంచు పంచె నొకడు,
  తనభక్ష్యరాశులన్ తన్మయత్వము తోడ
  ..........మిత్రుల కందించె మేటి యొకడు,
  ఒకని చిక్కములోని యోగిరంబుల బట్టి
  ..........పంచె నందరిలోన బాలుడొకడు,
  మిత్రులందరిగూడి మిగుల సంతోషాన
  ..........నన్నదమ్ములయట్టు లద్భుతముగ
  ఒకరి నొకరు గాంచి యుత్సాహభరితులై
  పాడుచుండి హాస్యమాడుచుండి
  కృష్ణు జూచుచుండి తృష్ణ తీరగ చల్ది
  కుడుచుచుండి రచట కూర్మిమీర. 4.

  రిప్లయితొలగించండి
 10. శ్రీ vsnmHarigariki..నమస్సులు..
  మీ పద్యాలు చాలా బాగున్నాయి మాస్టారు...

  రిప్లయితొలగించండి
 11. గోపబాలుర కధినాయకుండు కృష్ణు
  డందరిని బిల్చి తను దెచ్చి నట్టి భోజ్య
  ములను పంచి తినుమనుచు ముద్దలిడగ
  మిత్రులందరు హాయిగా మెక్కిరచట.

  రిప్లయితొలగించండి
 12. శ్రీ హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ! శుభాశీస్సులు.
  ఖండికలతో మీ ప్రక్రియలు బాగుగా అలరారుచున్నవి. అభినందనలు.

  దొరకినదే తడవుగ సుం
  దరతరమగు శైలిలో సదా ఖండికలన్
  హరి వారు కూర్చుచుందురు
  సరసపు భావమ్ముతో ప్రశంసల గనుచున్

  రిప్లయితొలగించండి
 13. శ్రీ బొడ్డు శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
  4వ పాదమును ఇలాగ సవరించుదాము:
  "నారగించు చుండిరి మిత్రు లరుసమొంది"

  రిప్లయితొలగించండి
 14. శ్రీమతి శైలజ గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. 3వ పాదములో బహువచనమును వేసి 4వ పాదములో ఏకవచనముతో ముగించేరు. దానిని ఇలాగ మార్చుదాము:
  "చల్ది బంచుచు దినుచును సంతసమున"
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 15. శ్రీ నాగరాజు రవీందర్ గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. 4వ పాదములో ఒక లఘువు ఎక్కువ అయినది. ఇలాగ మర్చుదామా?
  "వనమునన్ చద్ది యన్నము దినుచు శౌరి"
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 16. శ్రీ సుబ్బా రావు గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
  3వ పాదములో యతి మైత్రి లేదు. సవరించండి.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 17. ఆర్యా!
  ధన్యవాదములు మరియు నమస్కారములు.

  రిప్లయితొలగించండి
 18. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
  విశ్రమించిరి వ్రేపల్లె వీడి జనుచు
  గోపగోపికల్ కృష్ణుడు కుటము ఛాయ
  సరసి తీరాన మధుర రసమ్ము లొలుకు
  పండ్లు చల్దులు కుడుచుచు పాడు కొనుచు
  సరస గోలోక వాసి రసాదినేత
  కృష్ణతత్వమ్ము తానె యౌ బృంద యదిగొ
  శత సహస్ర సఖుల గూడి శౌరి జేరె
  రాసలీలల దేలి విరాజిలంగ

  రిప్లయితొలగించండి
 19. శ్రీ తిమ్మాజీ రావు గారు! శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
  కుటము ఛాయ అన్నారు - అది సాధువు కాదు.
  సంస్కృతములో సమాసములో ఉత్తర పదము ఛ అగునపుడు అది ఛ్ఛ అని ద్విరుక్తముగా అగును.
  అందుచేత కుటఛ్ఛాయ అనుట సాధు ప్రయోగము. దానిని తెలుగులో వాడునప్పుడు కుటపు నీడ అంటే బాగుంటుంది.
  సరస గోలోకవాసి రసాధినేత అన్నారు. అది బృంద గురించి అయితే రసాధినేత్రి అని స్త్రీలింగము వాడాలి.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 20. పండిత నేమాని గారికి
  మీ సవరణ లకు సూచనలకు ధన్యవాదములు

  రిప్లయితొలగించండి
 21. కవిమిత్రులకు వందనాలు.
  ఒక పెళ్ళికి వెళ్ళి ఇప్పుడే ఇల్లు చేరడంవల్ల ఈనాటి పద్యరచన శీర్షికకు వచ్చిన పద్యాలను సమీక్షించలేకపోయాను. పండిత నేమాని వారు దయతో మిత్రుల పద్యాలను నిశితంగా పరిశీలించి, అభినందించి, అవసరమైన సూచనలు చేశారు. వారికి పాదాభివందనాలు.
  చక్కని పద్యాలను రచించిన...
  పండిత నేమాని వారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు,
  సుబ్బారావు గారికి,
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
  సహదేవుడు గారికి,
  నాగరాజు రవీందర్ గారికి,
  శైలజ గారికి,
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
  బొడ్డు శంకరయ్య గారికి,
  కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.
  *
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారిని ప్రత్యేకంగా ప్రశంసింపవలసి ఉన్నది. నేమాని వారి మెచ్చుకోలుకు పాత్రమైన మనోజ్ఞ ఖండికను వ్రాసి బ్లాగును శోభాయమానం చేశారు.

  రిప్లయితొలగించండి
 22. వారిదదెంత పుణ్యమొకొ! పామరులైనను గొల్లవారలా
  శ్రీరమణీ విశేషమగు శ్రీధరు చేతిని జారు ముద్దలన్
  కూరిమి మీరగా నిచట కోరినవారికి పెట్టు మాధవున్
  చేరిన జన్మ బొందిరిదె సిద్ధియటంచు మనమ్ము నమ్ముదున్.

  రిప్లయితొలగించండి