శ్రీరామ అష్టోత్తర
శతనామ స్తోత్రము
రచన
పండిత నేమాని రామజోగి
సన్యాసి రావు
ప్రణవ మంత్రాత్మనే
- బ్రహ్మణే - పురుషాయ -
పరమాత్మనే - జగద్గురువరాయ
సచ్చిదానందాయ - శాశ్వతాయ-
సకల
భువన పాలకగణ
పూజితాయ
విశ్వస్వరూపాయ - వేదశీర్షస్తుత
ప్రజ్ఞానఘన ముఖ
లక్షణాయ
సకల మునీశ్వర
సంరక్షణరతాయ -
సాధు శరణ్యాయ - శాశ్వతాయ
దైత్య దానవగణ
దర్పవినాశాయ -
ధర్మసంస్థాపన
తత్పరాయ
శ్రీరామచంద్రాయ - క్షితిపాలకేంద్రాయ
-
సద్గుణసాంద్రాయ - జనహితాయ
ధర్మస్వరూపాయ - దశరథ
తనయాయ -
సీతా హృదీశాయ - చిన్మయాయ
మోహన రూపాయ - మునిజన
వంద్యాయ -
ప్రమథ లోకైక
సంరక్షకాయ
యజ్ఞఫలాయ - సర్వాగమ
వినుతాయ -
అర్కాన్వయాబ్ధి
సుధాకరాయ
లలిత కౌసల్యాస్య
జలజాత భృంగాయ -
మాతృసేవారత మానసాయ
మాతాపితృస్వాంత
మాథుర్యరసపాన
నిరతచిత్తాయ - వినిర్మలాయ
రాకేందు వక్త్రాయ-
రాజీవ నేత్రాయ -
సజల నీరదనిభ
శ్యామలాయ
శ్రీవశిష్ఠ
మునీంద్ర శిష్య విభూషాయ -
సకల విజ్ఞాన
విశారదాయ
క్షత్రియవీరాయ - గాధేయ
వినుతాయ -
యజ్ఞావనాయ - దైత్యాంతకాయ
క్షాళితాహల్యాఖ్య
సాధ్వీకళంకాయ-
మునిజనార్చిత
పదపుష్కరాయ
శైవ చాపఘ్నాయ - భావజ
వినుతాయ -
జనకావనీనాథ
సంస్తుతాయ
కార్ముకపాణినే - కళ్యాణమూర్తయే
-
వసుధాత్మజాచిత్త
భాస్కరాయ
ధృత
విదేహాత్మజాంచిత పాణిపద్మాయ -
పరశురామ మునీంద్ర
వందితాయ
పితృవాక్య పాలనరత
ధృఢ చిత్తాయ -
సామ్రాజ్య విముఖాయ
- జననుతాయ
ధృత మునివేషాయ - దేవకార్య
సముద్య
తాయ - శస్త్రాస్త్ర
విద్యాకరాయ
సీతా
సుమిత్రాత్మజాత సమేతాయ -
వనవాస నియమ
పాలనరతాయ
భరత సంపూజిత
పాదుకా యుగ్మాయ -
గుహ సుహృద్వరనుత
గుణగణాయ
వాల్మీకి కవివర
వర్ణిత చరితాయ -
అత్ర్యాది ముని
నిచయార్చితాయ
క్రూర విరాధాది
ఘోరాసుర హరాయ -
వనదేవతాగణ వందితాయ
ఖరదూషణాది రాక్షస
నాశకాయ - శూ
ర్పణఖా విమోహ
విభంజనాయ
మాయా మృగాకార
మారీచ శమనాయ -
అసురాపహృత
విదేహాత్మజాయ
అవనీసుతా
వియోగాగ్ని సంక్షుభితాయ -
వ్యాకుల మానస
వారిజాయ
శబరీ సమర్చనా
సంప్రీత చిత్తాయ -
సాయుజ్య విభవ
మోక్షప్రదాయ
ఆశ్రిత
వాయుపుత్రాది కపిగణాయ -
సుగ్రీవ సౌహార్ద
శోభితాయ
హత సురేంద్ర సుతాయ
- అర్కాత్మజ హితాయ -
వానరలోక సమ్మానితాయ
క్ష్మాసుతాన్వేషణా
కార్యనియోజిత
వానరబృందాయ - వరగుణాయ
వసుధాత్మజా క్షేమ
వార్తాప్రహర్షిత
మానసాంభోరుహ
మండితాయ
సేవితాంబుధితట
శ్రీమహాదేవాయ -
వారిధి బంధన
ప్రముదితాయ
అమల విభీషణ
ప్రార్థిత వరదాయ -
అసురాధినాథ
దర్పాపహాయ
రణరంగహత బహు
రాక్షసానీకాయ -
హత రావణాసురా
ద్యరిగణాయ
జాతవేదస్తుత జానకీ
శీలాయ -
మైథిలీజిత
మనోమందిరాయ
అసుర సామ్రాజ్య
సింహాసనాధిస్ఠిత
వినుత గుణాఢ్య
విభీషణాయ
ముని భరద్వాజ
సంపూజిత చరణాయ -
శ్రీమదయోధ్యాపురీశ్వరాయ
భరత శత్రుఘ్నాది
బాంధవ సహితాయ -
సకల జనానీక
సంస్తుతాయ
పట్టాభిషేకోత్సవ
సమీక్షణ ముదిత
బ్రహ్మేంద్ర
ముఖ్యామర నిచయాయ
పౌర యోగక్షేమ భార
ధురీణాయ -
రామరాజ్య ప్రభా
రాజితాయ
సర్వలోక హితాయ - సర్వ
శరణ్యాయ -
సకల లోకాధిప
సంస్తుతాయ
రామాయ - రఘువంశ
సోమాయ - పావన
నామాయ - భవ భయ
నాశనాయ -
తే.గీ. రామచంద్రాయ
- ధర్మసంరక్షకాయ
రామభద్రాయ - మునిజన
రంజకాయ
దివ్యతేజోనిధానాయ -
తేనమోస్తు!
దినకరాన్వయ భూషాయ -
తేనమోస్తు!
శ్రీ పండితుల వారికి ప్రణామములు
రిప్లయితొలగించండిఅష్టోత్తర శతనామా వళి సీస మాలిక అద్భుతము గా నున్నది నాకు వ్రాయడం రాక పోయినా చదివి ఆనందించ గల అదృష్టం గలిగించి నందులకు గురువులకు ధన్య వాదములు
రామాష్టోత్తరశత శుభ
రిప్లయితొలగించండినామస్తోత్రమ్ముఁ జెప్పి నాబోంట్లకు మో
దామృతము నొసఁగు పండిత
నేమాని గురూత్తమునకు నేఁ గైమోడ్తున్.
గురుదేవుల "అష్టోత్తర శతనామావళి సీసమాలిక" ఆత్యద్భుతముగా నున్నది.
రిప్లయితొలగించండినేను మీ శిష్యుడనగుట నా పూర్వ జన్మ పుణ్య ఫలము.
చదువగ మాకు పుణ్య గతులు గలుగు నట్లు జేయుచున్న మీకు పాదాభివందనములు.
శ్రీ రాముని నామములను
రిప్లయితొలగించండిమారాముడు వ్రాసె నిచట మది నింపుగగన్
మీ రాము డెవరు ? చెప్పుము
మారాముడు రామజోగి మన గురువులె గా
స్పందించిన మిత్రులందరికి శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిశ్రీరాముని స్తోత్రమ్మును
శ్రీరాముడె యెదను నిలిచి చేయించెకదా!
శ్రీరమ్యమ్ముగ ననినే
శ్రీరామారమణు దలచి చేయుదు ప్రణతుల్
స్వస్తి.
/\
రిప్లయితొలగించండినేమాని పండితార్యా! రామాయణ మహా కావ్యాన్ని సంక్షిప్తంగా శ్రీరామ అష్టోత్తరం లో యిమిడ్చి సీసమాలికగా వ్రాసిన మీ పాండిత్యానికి జోహార్లు.
రిప్లయితొలగించండిలక్ష్మీ దేవి గారి వ్యాఖ్య ఏమిటో అంతుబట్టడం లేదు నాకు.
రిప్లయితొలగించండిమిస్సన్న గారు,
రిప్లయితొలగించండిఅవి జోడించిన చేతులకు ప్రతీక. :)
లక్ష్మీ దేవిగారూ సంతోషం.
రిప్లయితొలగించండినాకు కొంచెం సాంకేతిక పరిజ్ఞానం తక్కువ. ఏమీ అనుకోకండి.
శ్రీ మిస్సన్న గారికి శుభాశీస్సులు. వారి స్పందనకి సంతోషము.
రిప్లయితొలగించండిశ్రీమతి లక్ష్మీదేవి గారి "నమస్తే" సంజ్ఞను ముందుగా నేను కూడా తెలుసుకొన లేక పోయేను. అయితే అది top/pinnacleకి గుర్తు అనుకొనినాను. మా అబ్బాయి చి.నంద కిశోర్ నాకు చెప్పేడు- అది నమస్తేకి గుర్తుగా ఉందని. సంతోషము. స్వస్తి.