19, మార్చి 2014, బుధవారం

పద్య రచన – 540

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

 1. ఆదిపూజ్యం సదానందం
  పార్వతీ నందనాగ్రజం
  గజవక్త్రం గణాధీశం
  విఘ్నరాజ మహంభజే

  వందే పర్వత తనయాం
  వందే శివ వల్లభాం కృపారసపూర్ణాం
  వందే త్రిభువనవినుతాం
  వందే జగదీశ్వరీం శివాం వరదాత్రీం

  వందే కైలాస వాసం ప్రమథగణనుతం పార్వతీ హృద్విలాసం
  వందే నాగేంద్రహారం వనజశరహరం భక్తలోకాభిరామం
  వందే దేవాధిదేవం పరమహితకరం వాసుదేవార్చితాంఘ్రిం
  వందే విశ్వాధినాథం వరదమభయదం భక్తరక్షాతిదక్షం

  రిప్లయితొలగించండి
 2. విశ్వేశ్వ రుడవై విశ్వమంత టను
  కైలాస గిరివాస కరుణా సముద్ర
  శ్రీ గణ నాయకా శ్రీ గౌరి తనయ
  వందనం శరణంటి వందితు లకును

  గురువులు క్షమించాలి . నాఈ ప్రయత్నం ఎన్ని తప్పులు ఉంటాయో

  రిప్లయితొలగించండి
 3. ముద్దుల తనయుని ముచ్చటఁ గనుచు మురిసిన గౌరికి మోకరిల్లెదము
  సుద్దులఁ బలుకుచు చొక్కు గణపతి సుందరరూపము చూడ పుణ్యమ్ము
  హద్దుల నెఱుగక యాదరించి యఘహరణముఁ జేసెడు హరునివేడెదము
  తద్దయఁ బొందగ దక్షతఁ బొంద దారి చూపమనుచు తపముఁ జేసెదము.

  రిప్లయితొలగించండి
 4. లోకమాతగు పార్వతి లోక నాధు
  బజ్జ,బాల గణపతిని పదిలముగను
  నొడిని గూర్చుండ బెట్టుకు నుండె నచట
  మోకరింతును వారికి ముదము తోడ

  రిప్లయితొలగించండి
 5. గతంలో వ్రాసిన పద్యం చిత్రానికి సరిగ్గా సరిపోతుంది:
  మ్రొక్కెద మనస్సు నందున్
  ముక్కంటేశుని హిమసుత ముద్దుల బిడ్డన్
  మక్కువగా నుండ్రాల్లను
  మ్రెక్కెడి బొజ్జ గణపతిని మేటి చదువరిన్

  రిప్లయితొలగించండి
 6. శివుని గుడికి నేగి చిన్ని గజానను
  డమ్మ యొడిన జేరె నిమ్ముగాను
  మొదట నంబిక సుతుఁ ముదముతో పూజించి
  శర్వు పూజ పిదప జలిపిరి ప్రజ

  రిప్లయితొలగించండి
 7. శ్రీమతి లక్ష్మిదేవిగారికి నమస్సులు.

  మంచి పద్యాన్ని ఒక క్రొత్త చందస్సులో వ్రాశారు. దీని లక్షణాలు చెప్పమని మనవి.

  రిప్లయితొలగించండి
 8. అయ్యా శాస్త్రి గారు,
  ఇది అందరికీ తెలిసిన తరువోజ వృత్తమే. మీకు తెలిసియుండును.
  కొత్తవారికోసం నియమాలు ఇచ్చుచున్నాను.


  ప్రతి పాదమునందు 3,5,7 గణముల మొదటి అక్షరములు యతి స్థానములు.
  ప్రతి పాదమునందు మూడు ఇంద్ర , ఒక సూర్య , మూడు ఇంద్ర , ఒక సూర్య గణములుండును.
  ప్రాస నియమం కలదు

  రిప్లయితొలగించండి
 9. కవులందరికి విన్నపము. ముఖ్య వృత్తములు, జాతి పద్యములు, ఉపజాతి పద్యములు, గాకుండా యితరపద్యములు వ్రాయు పెద్దలు దాని పేరు లక్షణములు వ్రాస్తే మాబోటి క్రొత్తవారికి ఉపయోగపడుతుంది. చిత్తగించ గలరని ప్రార్థిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 10. వాక్కు నర్థమ్ము రూపమై పరగునట్టి
  విశ్వగురువుల యొడిలోన వినయమలర
  కవిత లల్లుచు నుండెను గజముఖుండు
  మువ్వురకు సాదరమ్మున మ్రొక్కులిడుదు

  రిప్లయితొలగించండి
 11. శర్వాణీ నందన! నా
  నిర్వర్తక నిగమవేద్య నిర్మల హృదయా!
  సర్వజ్ఞ సర్వ మంగళ
  సర్వోత్తమ శూర్పకర్ణ సన్నుతి గొనుమా!

  రిప్లయితొలగించండి
 12. అమ్మ వడిలోన గూర్చొని బొమ్మవోలె
  కమ్మ నైనట్టి కథలేవొ నిమ్మళముగ
  కుమ్మరించెడి మోమును సమ్ముదమున
  గాంచు చాలించు శ్రీ శూర్ప కర్ణు గొలుతు

  రిప్లయితొలగించండి
 13. పండిత నేమాని వారూ,
  మీ శ్లోకాలు నిత్యపారాయణాయోగ్యతను కలిగి ఉన్నాయి. అభినందనలు.
  మీ తెలుగు పద్యం మనోజ్ఞంగా ఉంది. ధన్యవాదాలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ ద్విపద బాగుంది. అభినందనలు.
  ‘వందనం’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ తరువోజ బాగున్నది. అభినందనలు.
  *
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు
  *
  సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘ముక్కంటేశుడు’ అనరాదు కదా. అక్కడ ‘ముక్కంటి హిమనగసుతల ముద్దులబిడ్డన్’ అనండి.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
  ‘తల్లి యొడి’ అనండి.

  రిప్లయితొలగించండి
 14. నాగరాజు రవీందర్ గారూ,
  మీ శ్లోకాలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. కరివదనునియొడిలోనిడి
  మురిపెముతో సింహయాన ముచ్చట లాడెన్
  గిరిసుత ప్రేమను బొందిన
  వరదుడ శ్రీ విఘ్నరాజ వందనమయ్యా!

  రిప్లయితొలగించండి
 16. అమ్మ యొడలున దీసిన యట్టి నలుగు
  పిండి ముద్దాయె ముద్దుల పిల్లవాడు
  నలువలేకనె జనియించి నగుచు జేరె
  నమ్మ యొడి దడ్సి ముద్దాయె నామె ప్రేమ.

  రిప్లయితొలగించండి
 17. శైలజ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘కరివదనుని నొడిలో నిడి’ అనండి.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  అమ్మ ప్రేమలో తడిసి ముద్దయైన పిండిముద్దను గురించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. మాస్టరుగారూ ! ధన్యవాదములు.
  మ్రొక్కెద మనస్సు నందున్
  ముక్కంటి హిమనగసుతల ముద్దులబిడ్డన్
  మక్కువగా నుండ్రాల్లను
  మ్రెక్కెడి బొజ్జ గణపతిని మేటి చదువరిన్

  రిప్లయితొలగించండి