10, మార్చి 2014, సోమవారం

పద్య రచన – 531

కవిమిత్రులారా,
 పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
(ఈ చిత్రాన్ని ప్రకటించడానికి అనుమతించిన సీతారామ్ సూరి గారికి ధన్యవాదాలు.)

18 కామెంట్‌లు:

  1. హాస్యస్పూర్తితో:
    నాయనమ్మఁ జూచి నవ్వుకొంటి నటులే
    కాలమహిమ గాక కంప్యుటర్ల
    గ్రీకువీరుడంటి బైకుమగడు నచ్చె
    ముసలితనము లోన ముచ్చటయ్యె!

    రిప్లయితొలగించండి
  2. అమ్మమ్మను జూడుమ, యట
    యిమ్ముగ మఱి తిష్ట వేసి యెంతయొ దీ క్షన్
    బొమ్మను గం ప్యూ టరులో
    నెమ్మనమున జూచు చుండె నీ త మ బైకున్

    రిప్లయితొలగించండి
  3. మేటిగ వర్తమానమున మిక్కిలి సౌఖ్యము లందజేయు కం
    ప్యూటరు మానవాళి కిల నుత్సవదంబయి వెల్గుచుండు ము
    మ్మాటికవశ్యవస్తువయి, మైమరపించుచు, కార్యదక్షతన్
    పాటవ మందజేయుచును బంధునిభంబుగ నున్న దంతటన్. 1.

    విషయ మెటులనున్న వేర్వేరుగా నంది
    ..........తనలోన దాచు తాననుపమముగ,
    భాషతో భేదంబు పాటించగా బోక
    ..........జ్ఞానసంచయ మెంతొ మేన దాల్చు,
    అడిగినప్పుడు పల్కి యనుమానములు తీర్చు
    ..........మార్గదర్శకమౌచు మనము దోచు,
    చిటికలో విశ్వాన చేరదల్చిన చోటు
    ..........చక్కగా నంతరజాలమందు
    చూపి తృప్తి బరచు శోధించు, సాధించు
    నెట్టిదానినైన పట్టుదలకు
    మారుపేరు చాలతీరుల గాన్పించు
    గణకసాధనంబు ఖ్యాతిదంబు. 2.

    చిన్నపిల్లలతోడ చిత్రాలు గీయించు
    ..........నాటలు నేర్పించు నందమొప్ప,
    మధురసంగీతంబు మహిళల కందించు
    ..........నాట్యంబు చూపించు నవ్యముగను,
    విద్యార్థులకు నెప్పు డద్యతనంబైన
    ..........విజ్ఞాన మందించు వివిధగతుల,
    బహుమాన్యతను గూర్చు సహకార మందించు
    ..........నెల్లమానవులకు నుల్ల మలర
    చిన్నదైన నేమి యెన్నెన్నొ విషయాల
    నాత్మలోన దాచి యందరకును
    కరము ముదము గూర్చు కంప్యూట రేవేళ
    ధరను దీని ఘనత తరమె పలుక. 3.

    పెద్ద చిన్నయనెడి భేదభావము లేదు
    పురుషు లబల లనుచు నరయ బోదు,
    ఘనత నందజేయు కంప్యూట రన్నింట
    మిత్రుడట్లు నేడు మేదిని పయి. 4.

    విజ్ఞులార! కనుడు విజ్ఞానమును గోరి
    బామ్మగా రొకర్తె భాగ్యమనుచు
    క్రమత నేర్చుచుండె కంప్యూట రక్కటా!
    ప్రాయ మడ్డురాదు ధ్యేయమునకు. 5.

    రిప్లయితొలగించండి
  4. విశ్వమంత జూపు విజ్ఞాన మందించు
    మాన వాళి కిలను మంచి దోస్తు
    ఘనత నంద జేయు కంప్యూటరేనేర్వ
    మౌసు చేత బట్టె మామ్మ గారు

    రిప్లయితొలగించండి
  5. అన్ని రంగములందున నారి తేరి
    అమ్మ నమ్మమ్మలు యిమ్ముగాను
    నేర్చుచుండిరి కంప్యూటర్ నోర్పుతోడ
    తెలుగు జాతికి వెలుగులు దెచ్చుచుండ్రి
    పిల్లలకు విద్య నేర్పుచు ప్రేమ తోడ

    రిప్లయితొలగించండి
  6. మిత్రులారా! శుభాశీస్సులు.

    శ్రీ చంద్రశేఖర్ గారు:
    హాస్య స్ఫూర్తితో మీరు చెప్పిన పద్యము చాల బాగుగ నున్నది. అభినందనలు.

    శ్రీ సుబ్బా రావు గారు:
    బొమ్మలోని అమ్మమ్మను చూడమన్నారు. పద్యము బాగుగ నున్నది. అభినందనలు.

    శ్రీ హరి వెంకట సత్యనారాయణ మూర్తి గారు:
    అను నిత్యము ఒక ఖండికను వెలువరించుచున్నారు. మీ కృషికి అభినందనలు. నేటి ఖండిక చాల బాగుగ నున్నది.

    శ్రీమతి శైలజ గారు:
    మీ పద్యము బాగుగ నున్నది. 4వ పాదమును కొంచెము సవరించుదాము: "మౌసు పట్టుకొనిరి మామ్మ గారు" అందాము.

    శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు:
    మీ పద్యము బాగుగ నున్నది. 2, 3 పాదములలో చిన్న మార్పులు చెయ్యాలి: ఇలాగ చేద్దాము:
    2. అమ్మ లమ్మమ్మలును చాల యిమ్ము గాను
    3. నేర్చుచుండి కంప్యూటరు నిపుణ లగుచు

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. యంత్రము ముంగిట మామ్మలు
    మంత్రించి నటుల గాంచు మహిమా న్వితమౌ
    తంత్రీ నాదము వేదము
    మంత్రము తంత్రము చిత్రము మాయా జాలం

    రిప్లయితొలగించండి
  8. ధన్యవాదములు గురువుగారు...


    విశ్వమంత జూపు విజ్ఞాన మందించు
    మాన వాళి కిలను మంచి దోస్తు
    ఘనత నంద జేయు కంప్యూటరేనేర్వ
    మౌసు పట్టు కొనిరి మామ్మ గారు

    రిప్లయితొలగించండి
  9. నేటి యుగము నందు నెరజాణలేగాదు
    వయసుడిగిన యట్టి బామ్మకూడ
    కాలగమనమందు కంప్యూటరును వాడి
    గొప్ప వారి చేత మెప్పు నొందె.

    రిప్లయితొలగించండి
  10. శ్రీ నాగరాజు రవీందర్ గారు: శుభాశీస్సులు.
    బామ్మకు మంచి ఫ్రెండుగా వర్ణించిన మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.

    శ్రీ బొడ్డు శంకరయ్య గారు: శుభాశీస్సులు.
    మెప్పు నొందిన కంప్యూటర్ బామ్మ గురించి మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    చిత్రమందున జూడువిచిత్రముగను
    యరువ దే౦డ్లనుమించిన యతివ మౌసు
    బట్టి చేతను త్రిప్పుచు బహువిధముల
    నాట పాటల నానంద మనుభవించు
    కులమత భేద భావ ములు గొప్పను బీదను తారతమ్యముల్
    తెలియగరావు కంపుటరుదీటుగ సర్వజనాళి మెచ్చగన్
    కలివిడి తోడ కొత్త పాతలగు గాధలు గానము క్రీదలున్ తగన్
    తెలుపును నన్ని బాసలను విస్త్రు తమౌ వివరమ్ము లిచ్చున్

    రిప్లయితొలగించండి
  12. శ్రీ తిమ్మాజీ రావు గారూ: శుభాశీస్సులు.
    మీ 2 పద్యములును బాగుగ నున్నవి. అభినందనలు. 2వ పద్యములో కొన్ని సవరణలు చెయ్యవలెను:
    1. 3వ పాదములో 2 అక్షరములు ఎక్కువగా నున్నవి. కలివిడి తోడ సర్వ విధ గాథలు అందామా?
    2. విస్త్రుతము అనుత సరికాదు - విస్తృతము అనుట సాధువు.
    3. 4వ పాదము చివర లిచ్చుచున్ అని ఉండాలి. టైపు పొరపాటు కావచ్చును.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. పూజ్యులు పండిత నేమాని గారికి నమస్సులు. తమరిచ్చిన సవరణలకు కృతజ్ఞతలు. "అమ్మతోడను నమ్మమ్మలు" అను వ్రాయాలి పొరపాటున తోడను తైపుచేయటం మరచి పొయ్యాను. తమరి సవరణ చాలా బాగుగానున్నవి. తమరి సవరణలు సలహాలు మాలాంటి క్రొత్తవారికి స్పూర్థిని కలిగిస్తున్నాయి.

    రిప్లయితొలగించండి
  14. పూజ్యులు పండిత నేమాని గారికి నమస్సులు. తమరిచ్చిన సవరణలకు కృతజ్ఞతలు. "అమ్మతోడను నమ్మమ్మలు" అను వ్రాయాలి పొరపాటున తోడను తైపుచేయటం మరచి పొయ్యాను. తమరి సవరణ చాలా బాగుగానున్నవి. తమరి సవరణలు సలహాలు మాలాంటి క్రొత్తవారికి స్పూర్థిని కలిగిస్తున్నాయి.

    రిప్లయితొలగించండి
  15. అమ్మను బంధుజనంబులు
    అందరుగాంచెదరటంచు చిత్రపటమునన్
    బామ్మను మనుమని జేరిచి
    భావములుప్పొంగ మదిని, ముఖకావ్యమునన్
    అందరి మెప్పునుబడయగ
    ఆనందోత్సాహమలర నే ప్రచురింపన్,
    అంతర్జాలపు మహిమయొ
    ఆకర్షితులైరి కంది శంకర గురువుల్.

    కలము పనిజెప్పి పండితులు కనికరించి,
    కంది శంకరుల బ్లాగున పొందుపరుప,
    కలయొ వైష్ణవ మాయయో యనుచు జనని
    కను చెమర్చగ నీ కావ్యముద్భవించె

    ధన్యవాదాలు దెలుపగ భాష దెలియ,
    కవ్య కవనాల ననుభవము లేనివాడ
    ధన్య మాన్యులు భవుని మన్నింపవలయు
    అన్యధానిట ఈ రీతి సాహసింప

    రిప్లయితొలగించండి
  16. సూరి సీతారామ్ గారు,
    కొన్ని చిన్న పొరబాట్లను దిద్దుకొన్నచో మీరూ మంచి పద్యాలను వ్రాయగలరు. తప్పక ప్రయత్నించండి. మీ భావములు బాగున్నవి.

    రిప్లయితొలగించండి
  17. లక్ష్మీ దేవి గారికి కృతజ్ఞతాభివందనాలు.
    మీరందించిన స్పూర్తి అనిర్వచనీయం.
    తప్పక ప్రయత్నం కొనసాగిస్తాను.

    రిప్లయితొలగించండి