21, మార్చి 2014, శుక్రవారం

పద్య రచన – 542

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

9 కామెంట్‌లు:

 1. చెల్లని నాణెము లనుచును
  చిల్లరగా చూడ వలదు శ్రీమహ లక్ష్మిన్
  కొల్లలుగ పెరుగు ధనమది
  వెల్లువగా విరియు నంత వేలుపు తానై

  రిప్లయితొలగించండి

 2. ఒకటి రెండు మూడు ఐదు
  పది ఇరవై యాభై పైసలు కూడిన
  రూపాయికి తొమ్మిది పైసలు మాయం
  బడ్జెట్ డెఫిసిట్ అనగ ఇది యే నేమో !!


  శుభోదయం
  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. యెల్లరి మన్నన బొందిన
  చిల్లర నాణెమ్ములన్ని చేరెను మూలన్
  చిల్లర సిరిమాలచ్చిమి
  చెల్లక పోయిననునేడు చేయరె జోతల్

  రిప్లయితొలగించండి
 4. చెల్లని నాణెములనుచును
  చిల్లరగా చూడబోకు చేరిచి దాచన్
  పిల్లల పిల్లలకే సరి
  గల్లాలో గత చరిత్ర కనబడు గాదా !

  రిప్లయితొలగించండి
 5. చిల్లర పైసల జూడుము
  చెల్లవు మఱి యిప్పు డసలు చెలియా ! వినుమీ
  చెల్లిన చెల్లక పోయిన
  నుల్లము దా నొచ్చుకొనుచు నూర్పులు నిగిడెన్

  రిప్లయితొలగించండి
 6. నాడు-నేడు
  చిరునగవున నిచ్చు చిల్లర పైసలు
  నిచ్చె సంతసమును బిచ్చ గాన్కి
  చిల్లరిచ్చువాని చీవాట్లు బెట్టును
  యాచకుండు గూడ నాలయమున

  రిప్లయితొలగించండి
 7. కాలము మీదంచు గణుతించు జనులు
  నాలుకఁ ద్రిప్పగా నమ్ముమో నరుడ!

  నేలనుఁ దన యున్కి నిత్యము నిలువ
  జాలదని తెలుపు సత్యముఁ గనుడు.

  రిప్లయితొలగించండి
 8. కాలము మీదంచు గణుతించు జనులు
  నాలుకఁ ద్రిప్పుటన్ నమ్ముమో నరుడ!

  నేలనుఁ దన యున్కి నిత్యము నిలువ
  జాలదని తెలుపు సత్యముఁ గనుడు.

  రిప్లయితొలగించండి
 9. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘మహలక్ష్మి’ సరియైన రూపం కాదు.
  *
  జిలేబీ గారూ,
  _/\_
  మీ బడ్జెట్ డెఫిసిటీ నిర్వచనం బాగుంది. దీనికెవరైనా పద్యం రూపం ఇస్తే బాగుండు. నాకైతే సమయం చిక్కడం లేదు.
  *
  శైలజ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  యడాగమంతో పద్యాన్ని ప్రారంభించారు. ‘ఎల్లరి’ అంటే సరి!
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ‘గల్లలో గతచరిత్ర కనబడు గాదా!" చాలా బాగుంది మీ పద్యం. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి