గురువుగారు, బయల్దేరిపోయినారా? అక్కడ నాంపల్లి లో ఉన్న పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయములో అరవైఏళ్ళ నుంచీ ప్రచురించిన పుస్తకాల ప్రదర్శన మరియు అమ్మకం, యాభై శాతం రాయితీ తో పెట్టినారు. మీకు కావలసిన పుస్తకం దొరకవచ్చు.
మిత్రులారా! శుభాశీస్సులు. ఈనాడు అందరి పూరణలును అలరించుచున్నవి. అందరికి అభినందనలు.
Sri HVSN Moorti Garu మంచి విరుపుతో పద్యమును చెప్పేరు - సంతోష వైభవమును ఇచ్చే శివుని గూర్చి. పద్యము బాగుగ నున్నది.
శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు: మంచి విరుపుతో పద్యమును చెప్పేరు. అపవాదులను బాపెడి స్వామి గురించి. పద్యము బాగుగ నున్నది.
శ్రీమతి లక్ష్మీ దేవి గారు: గరళమిచ్చు బాధను హరించే హరుని గూర్చి చక్కగా చెప్పేరు. పద్యము బాగుగ నున్నది.
శ్రీ సుబ్బా రావు గారు: మంచి విరుపుతో చక్కగా చెప్పేరు. పద్యము బాగుగ నున్నది.
Sri Psr moorti garu పాప చింతనకు పాపులకు గరళమిచ్చే స్వామి గురించి చక్కగా చెప్పేరు. పద్యము బాగుగ నున్నది.
శ్రీ భాగవతుల కృష్ణా రావు గారు: నమస్కారములు కైలాస వాసుని గుణ వర్ణనలతో కోట్లకొలది కథలున్నవని చక్కగా చెప్పేరు. పద్యము బాగుగ నున్నది.
శ్రీ కందుల వర ప్రసాద్ గారు: మంచి విరుపుతో హిత బోధ చేయుచు పద్యము చెప్పేరు. పద్యము బాగుగ నున్నది.
శ్రీ సహదేవుడు గారు: ఒడలి నిండా మనస్సు నిండా గరళము గల వారికి గరళమిచ్చును స్వామి అని సమర్థించేరు - బాగుగ నున్నది పద్యము. కొన్ని టైపు పొరపాట్లు కలవు - కత్తు లెట్టుకు అని వ్యావహారికమును వాడేరు.
శ్రీమతి శైలజ గారు: గరళ మిచ్చు ననుచు గేలి చేయుచో శివుడు కూడా మురియును అని సెలవిచ్చేరు. పద్యము బాగుగ నున్నది.
శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో... ఆ పద్యము సెమినార్ మధ్యలో వ్రాసినాను గురువుగారు! నేను ఒక సెమినార్ కు వెళ్ళి ఇప్పుడు ఇంటికి తిరిగి వచ్చి యుంటిని గురువుగారు!
గరళకంఠుని బూజింప గరళమిచ్చు
రిప్లయితొలగించండివిఘ్ననాథుని సేవింప విఘ్నమొదవు
ననుటయు వినోదవల్లరు లనుచు బొంగి
దీవెనల గూర్చు నా యాదిదేవుడు కద!
నిత్యకల్యాణములు గూర్చు నిష్ఠతోడ
రిప్లయితొలగించండిగరళకంఠుని బూజింప, గరళమిచ్చు
వారలకుగూడ సంతోషవైభవంబు
నందజేసిన పరమాత్ము డభవుడతడు.
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిహైదరాబాద్ వెళ్తున్నాను. తిరిగివచ్చేసరికి ఏరాత్రి అవుతుందో.. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.
భక్తిభావంబు మెరయ సద్భావమందు
రిప్లయితొలగించండిగరళకంఠునిఁ బూజింప, గరళమిచ్చు
నట్టి యపవాదులను బాపి యనవరతము
శాంతిసౌఖ్యంబులను గూర్చు చల్లగాను.
గురువుగారు,
రిప్లయితొలగించండిబయల్దేరిపోయినారా? అక్కడ నాంపల్లి లో ఉన్న పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయములో అరవైఏళ్ళ నుంచీ ప్రచురించిన పుస్తకాల ప్రదర్శన మరియు అమ్మకం, యాభై శాతం రాయితీ తో పెట్టినారు. మీకు కావలసిన పుస్తకం దొరకవచ్చు.
సాగరమథనమందున సరసరనుచు
రిప్లయితొలగించండినుబికి వచ్చిన గరళము నోర్వలేక
గరళకంఠునిఁ బూజింప గరళ మిచ్చు
బాధ, గాచుమనగ- మ్రింగె; పరిహరించె.
సకల సంపద లిచ్చును సర్వులకును
రిప్లయితొలగించండిగరళ కం ఠుని బూజింప, గరళ మిచ్చు
పాము శిరమును గట్టిగా బట్టు కొనుచు
పిండ మొదలిడ ,కక్కుచు దండి గాను
ఫాలనేత్రుని నర్చింప ఫలము గలుగు
రిప్లయితొలగించండిసకల కళ్యాణములతోడ శాంతి గలుగు.
గరళకంఠునిఁ బూజింప గరళ మిచ్చు
పాప చింతనకు మరియు పాపులకును
గరళకంఠునిఁ బూజింప గరళ మిచ్చు
రిప్లయితొలగించండిననుట విన మేకథనమందు; నార్తి గొలువ
మెచ్చి కోరిన వరముల నిచ్చెననుచు
కలవు కైలాస నాధుని కథలు కోట్లు.
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు
రిప్లయితొలగించండినీ శిష్య పరమాణువు వినమ్రవందనములతో.
==============*================
కష్టముల నెల్ల దొలగించు కరుణ తోడ
గరళకంఠునిఁ బూజింప,గరళ మిచ్చు
సుతులకున్, వైరులకు,రాక్షసులననిశము,
జేర వలదు మీరు ఖలుల జెంత భువిని!
కాయ మంతయు నింపుకు గరళ మెల్ల
రిప్లయితొలగించండికత్తు లెట్టుకు ప్రెమతో కొగిలించి
తోటి వారల కెప్పుడు చేటు జేసి
గరళకంఠుని బూజింప గరళమిచ్చు
చిత్త శాంతిని గల్గించి చింత దీర్చు
రిప్లయితొలగించండిగరళ కంఠుని బూజింప,గరళ మిచ్చు
ననుచు గేలిడు వారిని గనుచు మురియు
భక్త వరదుడౌ శూలికి వందనములు
మోక్ష మార్గము దొరకును ముదముతోడ
రిప్లయితొలగించండిగరళకంఠుని బూజింప, గరళమిచ్చు
కలుష మానవున్ సేవింప, కొలువ వలయు
వారిజాక్షుని జేకుఱ పరమ పదము
మిత్రులారా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఈనాడు అందరి పూరణలును అలరించుచున్నవి. అందరికి అభినందనలు.
Sri HVSN Moorti Garu
మంచి విరుపుతో పద్యమును చెప్పేరు - సంతోష వైభవమును ఇచ్చే శివుని గూర్చి. పద్యము బాగుగ నున్నది.
శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు:
మంచి విరుపుతో పద్యమును చెప్పేరు. అపవాదులను బాపెడి స్వామి గురించి. పద్యము బాగుగ నున్నది.
శ్రీమతి లక్ష్మీ దేవి గారు:
గరళమిచ్చు బాధను హరించే హరుని గూర్చి చక్కగా చెప్పేరు. పద్యము బాగుగ నున్నది.
శ్రీ సుబ్బా రావు గారు:
మంచి విరుపుతో చక్కగా చెప్పేరు. పద్యము బాగుగ నున్నది.
Sri Psr moorti garu
పాప చింతనకు పాపులకు గరళమిచ్చే స్వామి గురించి చక్కగా చెప్పేరు. పద్యము బాగుగ నున్నది.
శ్రీ భాగవతుల కృష్ణా రావు గారు: నమస్కారములు
కైలాస వాసుని గుణ వర్ణనలతో కోట్లకొలది కథలున్నవని చక్కగా చెప్పేరు. పద్యము బాగుగ నున్నది.
శ్రీ కందుల వర ప్రసాద్ గారు:
మంచి విరుపుతో హిత బోధ చేయుచు పద్యము చెప్పేరు. పద్యము బాగుగ నున్నది.
శ్రీ సహదేవుడు గారు:
ఒడలి నిండా మనస్సు నిండా గరళము గల వారికి గరళమిచ్చును స్వామి అని సమర్థించేరు - బాగుగ నున్నది పద్యము. కొన్ని టైపు పొరపాట్లు కలవు - కత్తు లెట్టుకు అని వ్యావహారికమును వాడేరు.
శ్రీమతి శైలజ గారు:
గరళ మిచ్చు ననుచు గేలి చేయుచో శివుడు కూడా మురియును అని సెలవిచ్చేరు. పద్యము బాగుగ నున్నది.
శ్రీ అన్నపరెడ్డి సత్యనారయణ రెడ్డి గారు: శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
శ్రీ నాగరాజు రవీందర్ గారు: శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. అన్వయము ఇంకనూ సులభముగా నుండుటకు ప్రయత్నించండి.
స్వస్తి.
శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
రిప్లయితొలగించండిఆ పద్యము సెమినార్ మధ్యలో వ్రాసినాను గురువుగారు!
నేను ఒక సెమినార్ కు వెళ్ళి ఇప్పుడు ఇంటికి తిరిగి వచ్చి యుంటిని గురువుగారు!
శ్రీ నాగరాజు రవీందర్ గారు: శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ సవరించిన పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
స్వస్తి.