26, మార్చి 2014, బుధవారం

ప్రహేళిక - 52

ఎవరా ప్రభువు?
ఆ.వె.
తండ్రికొడుకు లొక్క తరుణిని రమియింప
పుత్రు లిద్ద రొంది పోరు గలుగ
నొకని జంపి రాజ్య మొకని కిచ్చిన ప్రభు
వాతఁ డిచ్చు మనకు నఖిల సిరులు.

(‘నానార్థ గాంభీర్య చమత్కారిక’ గ్రంధం నుండి.)

3 కామెంట్‌లు:

 1. మాస్టరు గారూ ! వాలి సుగ్రీవులలో వాలిని చంపి సుగ్రీవునికి రాజ్యము కట్టబెట్టిన రాముడే ఆ ప్రభువు అని అనుకుంటున్నాను నిజమేనా...మొదటి పాదమునకు మాత్రం వివరం నాకు తెలియదు...

  రిప్లయితొలగించండి
 2. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
  వాలికి తండ్రి ఇంద్రుడు.
  సుగ్రీవుని తండ్రి సూర్యుడు.
  చంద్రుడు సముద్రుని కుమారుడు.
  సూర్యుడు అదితి కశ్యపుల కుమారుడు.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి