11, మార్చి 2014, మంగళవారం

సమస్యాపూరణం - 1348 (తన బాలునిఁ జంప నెంచి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
తన బాలునిఁ జంప నెంచి తానే చచ్చెన్.

28 కామెంట్‌లు:

  1. చను బాలనిచ్చు నెపమున
    చనువుగ తాయొడిని జేర్చి సరసత్వ మునన్
    చను గవను నోటనుంచి పూ
    తన, బాలుని జంప నెంచి తానే చచ్చెన్

    రిప్లయితొలగించండి

  2. ఘనకార్యము సాధించగ
    తను గొల్లెత వేషమెత్తి స్తన్యంబిడగన్
    మన కృష్ణుని ధాటికి పూ
    తన బాలుని జంపనెంచి తానే చచ్చెన్

    రిప్లయితొలగించండి
  3. తనయుని హిరణ్య కశిపుడు
    వినమనె తన మాట, వీడి విష్ణువు జపమున్
    తన దైవము హరియే నను
    తన బాలుని జంప నెంచి తానే జచ్చెన్

    రిప్లయితొలగించండి
  4. శ్రీమతి రాజేశ్వరి గారు: శుభాశీస్సులు.
    పూతన కథను చెప్పిన మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    3వ పాదములో గణభంగము. ఇలాగ మార్చుదామా:
    చనులందించిన యా

    శ్రీ అనంత కృష్ణ గారు: శుభాశీస్సులు.
    పూతన వధను చెప్పిన మీ పూరణ బాగుగ నున్నది. అభినందనలు.

    శ్రీ సహదేవుడు గారు: శుభాశీస్సులు.
    హిరణ్య కశిపుని కథతో మీ పద్యము చాల బాగుగ నున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. ఘనమగు కృష్ణుని ముద్దిడి
    అనునయముగమాటలాడి హతమొనరించన్
    చనుబాలనిచ్చి యాపూ
    తన బాలుని జంపనెంచి తానే చచ్చెన్

    రిప్లయితొలగించండి
  6. ఆర్యా!
    నమస్కారములు,
    పైవారి బాటలోనే పూరణలు.

    అనుమానమేల వీనిని
    చనుబాలం గుడిపి యముని సదనంబునకున్
    కనుడిదె పంపెదనని పూ
    తన, బాలుని చంపనెంచి తానే జచ్చెన్. 1.

    అనయము హరినామము తా
    ననుపమముగ బల్కువాని, నసురాధిపుడున్
    ఘనుడౌ హిరణ్యకశిపుడు
    తనబాలుని జంపనెంచి తానే జచ్చెన్. 2.

    రిప్లయితొలగించండి


  7. ఘన ప్రహ్లాదుని జనకుడు
    తన బాలుని జంపనెంచి తానే చచ్చెన్
    చనుబాల నెపమునను పూ
    తన బాలుని జంపనెంచి తానే చచ్చెన్

    రిప్లయితొలగించండి
  8. చనుబాలిడి ద్రుంచగ పూ
    తన బాలునిఁ జంప నెంచి తానే చచ్చెన్.
    మును దైత్యుడు హరిని గొలుచు
    తన బాలునిఁ జంప నెంచి తానే చచ్చెన్.

    రిప్లయితొలగించండి
  9. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
    ============*==============
    వనముల బంపిన విడువక
    తన దైవము శ్రీ హరియని తండ్రికి దెలుపన్
    ఘనముగ బలుకగ హరి యని
    తన బాలుని జంపనెంచి తానే చచ్చెన్!

    వనధిని విడచిన విడువక
    తన తనివి ధీర్చు వాడు తప్పక హరియే
    నని ఘనముగ బలుకంగను
    తన బాలుని జంపనెంచి తానే చచ్చెన్!

    రిప్లయితొలగించండి
  10. ఘన కాల కూటమును ద్రా
    గిన తన దొర శ్రీ హరియని కీర్తించంగన్
    కనికరమును జూపక నే
    తన బాలుని జంపనెంచి తానే చచ్చెన్

    అనిశము హరి నామమ్మును
    నొనరగ బలుకగ సుతుండు,నుదధిని విడువన్
    తన రేడు హరియని దెలుప
    తన బాలుని జంపనెంచి తానే చచ్చెన్

    రిప్లయితొలగించండి
  11. తనుతలవని హరిని దలచు
    తనకొమరునిగని మునుపొక తండ్రియె యముడై
    కనికరములేక కినుకన
    తనబాలుని జంపనెంచి తానేచచ్చెన్ !!!

    రిప్లయితొలగించండి
  12. మనసున కపటపు యోచన
    కనుపించ నటుల నటనము గావించుచు బా
    లుని కృష్ణుని నెపమున పూ
    తన బాలునిఁ జంప నెంచి తానే చచ్చెన్.

    రిప్లయితొలగించండి
  13. అనురాగము బంచుచు తా
    జనని వలెను స్తన్యము నిడి జంపెడి విధమున్
    కనికరమును జూపక పూ
    తన బాలుని జంపనెంచి తానే చచ్చెన్

    రిప్లయితొలగించండి
  14. వినుడీ విషయము మీరలు
    పనిగొని శ్రీ కృష్ణు డపుడు బాలుని రూపం
    బునపూ తనజే రగపూ
    తన బాలుని జంప నెంచి తానే చచ్చెన్

    రిప్లయితొలగించండి
  15. చిన్న సవరణతో....

    ఘనమగు కృష్ణుని ముద్దిడి
    అనునయముగ జెంత జేరి హతమొనరించన్
    చనుబాలనిచ్చి నాపూ
    తన బాలుని జంపనెంచి తానే చచ్చెన్

    రిప్లయితొలగించండి
  16. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు


    తన మేనల్లుడు ప్రహ్లా
    దుని యగ్నిని కాల్చి చంప ధుని లోనన్ జొ
    చ్చినదుష్టు రాలి దుశ్చి౦
    తన బాలుని జంప నెంచి తానే జచ్చెన్

    రిప్లయితొలగించండి
  17. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈనాటి పూరణలను పరిశీలించుదాము. ఎక్కువగా పూతన అని పూరణలు వచ్చినవి. అందరికి అభినందనలు.

    శ్రీమతి శైలజ గారు:
    పూతన కథగా చెప్పబడిన మీ రెండు పద్యములు బాగుగ నున్నవి.

    శ్రీ హరి వెంకట సత్యనారాయణ మూర్తి గారు:
    మీ 2విధముల పూరణలు - పూతన గూర్చి, హిరణ్యకశిపుని గూర్చి -- బాగుగ నున్నవి.

    శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు:
    మీ పద్యములో 2విధములునూ బాగుగ నున్నవి.

    శ్రీ నాగరాజు రవీందర్ గారు:
    కంసుని గూర్చిన మీ పద్యము బాగుగ నున్నది.

    శ్రీ భాగవతుల కృష్ణా రావు గారు:
    నమస్కారములు.
    మీ 2 విధములతో కూడిన పూరణ బాగుగ నున్నది.

    కందుల వరప్రసాద్ గారు:
    మీ 5 పద్యములును బాగుగ నున్నవి -- 4 హిరణ్యకశిపుని గూర్చి & 1 పూతన గూర్చి.

    2వ పద్యములో: తన తనివిన్ దీర్చు వాడ అని ఉండాలి - టైపు పొరపాటు కావచ్చును.
    3 వ పద్యములో: కనికరమును జూపకయే అని ఉండాలి - జూపకనే అని కాదు.

    శ్రీ మంద పీతాంబర్ గారు:
    మీ పద్యము - హిరణ్య కశిపుని గూర్చి- బాగుగ నున్నది.

    శ్రీ పి.ఎస్.ఆర్.మూర్తి గారు:
    పూతన గూర్చి మీరు చెప్పిన పద్యము బాగుగ నున్నది.

    శ్రీ సుబ్బా రావు గారు:
    పూతన గూర్చి మీరు చెప్పిన పద్యము బాగుగ నున్నది.

    శ్రీ తిమ్మాజీ రావు గారు:
    ప్రహ్లాదుని మేనత్త యగు దుష్టురాలి ప్రస్తావనతో మీ పద్యము బాగుగ నున్నది.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  18. ధనదాహముతో నిథికై
    తనయుని జంపగ తలచిన త్రాష్టున్ కసితో
    తనభార్య చంపివేసెను
    తనబాలుని జంపనెంచి తానే చచ్చెన్

    రిప్లయితొలగించండి
  19. అనువగు వేళను శకటుడు
    గని కృష్ణుని పోయె జంప గబగబ, తృటి నా
    తని ధాటికి పొందెను యా
    తన, బాలునిఁ జంప నెంచి తానే చచ్చెన్.

    రిప్లయితొలగించండి
  20. సవరణలకు శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  21. శ్రీ అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు: శుభాశీస్సులు.
    ధన దాహపు పిశాచుని గూర్చి మీ రచన బాగున్నది. అభినందనలు.

    శ్రీ మిస్సన్న గారు: శుభాశీస్సులు.
    శకటాసురుని గూర్చి మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. అనురాగము కొరబడగను
    తన బాలుని జంప నెంచి తానే చచ్చెన్
    ఘన సర్పము బారినపడి
    అనుమానపు మొగడొకండునాశ్చర్య ముగా !!!

    కనకము గలదని గుడిచెం
    తన, బాలుని జంప నెంచి తానే చచ్చెన్
    ఘన సర్పమునకు బలియై
    గుణ హీనుడు గుప్త నిధుల కోరిక హెచ్చన్ !!!

    రిప్లయితొలగించండి
  23. ఘనమగు హరి కథలఁ బలుకు
    చినవానిని, ప్రియమగు సుతుఁ జిత్రముగా నా
    తని తండ్రియె పలు విధముల
    తన బాలునిఁ జంప నెంచి తానే చచ్చెన్.

    రిప్లయితొలగించండి
  24. మనువాడిన భర్త యెడల
    ననువంతయు ప్రేమలేక హాయిగ తిరిగే
    వనిత తన కడ్డనుకొనుచు
    తన బాలుని జంపనెంచి తానే చచ్చెన్

    రిప్లయితొలగించండి
  25. శ్రీ మంద పీతాంబర్ గారు: శుభాశీస్సులు.
    మీ రెండు పద్యములును బాగుగ నున్నవి - 1. అనుమాన పిశాచి, 2. ధన పిశాచి. అభినందనలు.

    శ్రీమతి లక్ష్మీ దేవి గారు:శుభాశీస్సులు.
    ప్రహ్లాదుని గూర్చి మీరు చెప్పిన పద్యము బాగుగ నున్నది. అభినందనలు.

    శ్రీ బొడ్డు శంకరయ్య గారు: శుభాశీస్సులు.
    చెడుగా తిరిగే వనిత గూర్చి మీరు చెప్పీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  26. అనువుగ శకటాసురుడా
    పనిపై గోకులము జేరి భళిభళి యనుచున్
    కనుగొనగనె గోవుల చెం
    తన బాలునిఁ జంప నెంచి తానే చచ్చెన్

    రిప్లయితొలగించండి