14, మార్చి 2014, శుక్రవారం

సమస్యాపూరణం - 1351 (వెన్నెలఱేని వెలుఁగులకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వెన్నెలఱేని వెలుఁగులకు విచ్చెఁ గమలముల్.

21 కామెంట్‌లు:

 1. పున్నమి రేయిని ముదముగ
  వెన్నెల ఱేని వెలుగులకు విచ్చె గమలముల్
  సన్నని జాజుల సొగసులు
  కన్నుల విందొసగి మదికి కానుక లిచ్చెన్  సోదరులకు శుభ వార్త 'మన గురువులు శ్రీ శంకరయ్య గారి సమస్యా పూరణ
  అవధాన సరస్వతి శ్రీ రాళ్ళ బండి కవితా ప్రసాద్ గారి లక్ష పద్యార్చనలో


  " మొట్ట ....మొదటి ....పూరణ మన...గురువుగారి...దే " అనిచెప్పడానికి చాలా చాలా ఆనందిస్తున్నాను " గురువులకు హృదయ పూర్వక శుభాభి నందనలు `````````````````````````

  రిప్లయితొలగించండి
 2. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  కాని సమస్య పరిష్కరింపబడలేదు. వెన్నెల వెలుగుల్లో విచ్చుకునేవి కలువలు కదా!
  లక్షపద్యార్చన విషయాన్ని ప్రస్తావించినందుకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 3. పున్నమి రేయిన కలువలు
  వెన్నెల ఱేని వెలుగులకు విచ్చె, గమలముల్
  మిన్నున దినకరునిగనగ
  కన్నుల విందుగ విరిసెను కాసారమునన్

  రిప్లయితొలగించండి
 4. శైలజ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘రేయిని’ అనండి.

  రిప్లయితొలగించండి
 5. పున్నమిన విరిసె కలువలు
  వెన్నెలఱేని వెలుఁగులకు; విచ్చెఁ గమలముల్.
  చెన్నుగ రవి బింబమలర
  కన్నులకింపైన ధవళ కాంతులు నిండెన్

  రిప్లయితొలగించండి
 6. పున్నమి రేయిని గలువలు
  వెన్నెల రేని వెలుగులకు విచ్చె, కమలముల్
  చెన్నుగ దినకరు రాకకు
  నన్నువు తో విరిసెమిగుల యందము దోపన్

  రిప్లయితొలగించండి
 7. కన్నుల వెల్గునుఁ బంచుచు
  మన్ననతో చందమామ మాయక మనగా
  సన్నని కాంతులఁ బంచెడు
  వెన్నెలఱేని వెలుఁగులకు విచ్చెఁ గమలముల్.

  రిప్లయితొలగించండి
 8. పన్నెండవతరగతిలో
  మున్నొక తడబాటుతోడ మోహనుడనువా
  డన్నాడు మిత్రులారా!
  వెన్నెల ఱేని వెలుగులకు విచ్చె గమలముల్

  రిప్లయితొలగించండి
 9. భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  మీరూ శైలజ గారు చేసిన పొరపాటే చేశారు. ‘పున్నమిని’ అనండి.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  కమలములు భ్రమపడినవని మీ భావమా? అయితే పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
  తడబాటు మాటగా మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. సన్నని కలువలు విరిసెను
  వెన్నెల ఱేని వెలుగులకు; విచ్చె గమలముల్
  తిన్నగ సూర్యుని కిరణము
  లన్ని తగిలి సరసు నందు నాహ్లాదముతో!

  రిప్లయితొలగించండి
 11. బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. లక్ష పద్యార్చన లో ప్రథమ పద్య సుమమును అందుకొనుచున్న శ్రీ గురు వర్యులకు అభినందనలు.

  రిప్లయితొలగించండి


 13. పండిత నేమానిగారికి పూజ్య గురుదేవులు శoకరయ్య
  గారికి వందనములు
  కన్నులకింపుగ కలువలు
  వెన్నెల రేని వెలుగులకు విచ్చె .గమలముల్
  క్రన్నన విరిసెను మిత్రుని
  సన్నిధి వెచ్చని కరములు సంశ్లేషిoచన్

  రిప్లయితొలగించండి
 14. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ధన్యవాదాలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. పున్నమి రోజున కలువలు
  వెన్నెలరేని వెలుగులకు విచ్చె, గమలముల్
  కన్నులకు విందు జేయుచు
  వెన్నుని పాదముల జేరి, వెలిగెన్ ధరపై

  రిప్లయితొలగించండి
 16. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. పన్నుగ శీతల మందున
  వెన్నెలవలె తోచు టెండ విరిసెన్ గనుమా!
  కన్నుల విందగు భ్రాంతిన
  వెన్నెలఱేని వెలుఁగులకు విచ్చెఁ గమలముల్

  రిప్లయితొలగించండి


 18. అన్నుల మిన్నగు యమ్మికి
  వెన్నెలఱేని వెలుఁగులకు విచ్చెఁ, గమలముల్
  వన్నియ కన్నులు గద ము
  వ్వన్నెలవిల్లు వలె సఖుని పవళింపులటన్ !

  ज़िलेबी

  రిప్లయితొలగించండి
 19. ప్రభాకర శాస్త్రి గారూ,
  జిలేబీ గారూ,
  పోటాపోటీగా ఉత్సాహంగా మీరిద్దరూ పాత సమస్యలకు క్రొత్త పూరణలు పెడుతున్నారు. పని భారం వల్ల వెంటవెంటనే స్పందించలేకపోతున్నందుకు మన్నించండి. నేను సిద్ధం చేస్తున్న 'బృహత్సమస్యాపూరణలు' గ్రంథంలో మీ పూరణలు తప్పక ఉంటాయి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ ప్రక్రియ మాకు వినోదం సార్! నాకైతే బ్రహ్మాండమైన కాలక్షేపం! అంతులేని సరదా! ధన్యవాదములు! త్వరలో మళ్ళీ కలుస్తాను...

   🙏🙏🙏

   తొలగించండి
 20. మిన్నగ ప్రొద్దున చనుచును
  పన్నుగ శీతల మిడెడెని పచ్చని గాగుల్స్
  కన్నుల ధరించి చూడగ
  వెన్నెలఱేని వెలుఁగులకు విచ్చెఁ గమలముల్

  రిప్లయితొలగించండి