30, మార్చి 2014, ఆదివారం

పద్య రచన – 551 (విజయకు వీడుకోలు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశం...
విజయకు వీడుకోలు.

14 కామెంట్‌లు:


 1. వీడు కోలన్నవిజయకు వింత బాధ
  స్వాగ తింతుము జయమంచు సంత సమున
  ఎవరి ఘనతలు వారివి నెన్న తరమె
  సోము నిర్గమ మందున్న సోయ గములు
  భాను డుదయించి పులకించ భాసు రమ్ము

  రిప్లయితొలగించండి
 2. క్షమించాలి
  ఇక్కడ కుడా మోడవ పాదము " నెవరి ఘనతలు " అని ఉండా లను కుంటాను

  రిప్లయితొలగించండి
 3. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. ఇది అందరికీ పరీక్షల కాలం.. విజయానికి వీడ్కోలు పలకటం కుదరదు ...అయినా తప్పదు... విజయ ' జయ ' నే ఇచ్చి వెళుతున్నది... సంతోషం...  విజయము విద్యార్థులకును
  విజయమ్మే రాజకీయ వీరులకెల్లన్
  విజయా వీడ్కోలందుచు
  ను ' జయ ' ము మాకిచ్చి వెడల నుంటివి గాదే !

  రిప్లయితొలగించండి
 5. అన్నివనరు లున్న ఆంధ్రుల రాష్ట్రాన్ని
  వేరు జేసి నావు విజయ నీవు
  చిన్న రాష్ట్రములను చెన్నుగా నొనరించి
  జయము గలుగ జేయు జయ యుగాది

  రిప్లయితొలగించండి
 6. వీ డుకోలును జెప్పుదు విజయ నామ
  వత్సరంబున కీ రోజు వత్సలతన
  సుఖము లెన్నియో బొందితి ,శుభము లొదవె
  వత్సరంబంతయు నిజము వార్ధి శయన !

  రిప్లయితొలగించండి
 7. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ‘విజయ’కు వీడ్కోలు, ‘జయ’కు స్వాగతం! మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  అదృష్టవంతులు...‘విజయ’ మీకు సుఖసంతోషాల నిచ్చినందుకు!
  బాగుంది మీ పద్యం. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. ఐకమత్యమునకు నాంధ్రమే పేరని
  విర్రవీగినాము విజయ! నీవు
  వేరుజేసి మమ్ము వెళ్ళు చున్నావహో
  పొమ్ము కోర్కె దీరె పొమ్ము వేగ.

  రిప్లయితొలగించండి
 9. కలసి రాలేదు విజయని కలసి నంత
  పండితార్యులు బల్కగ వదల మన 'వి'
  విజయ లోని మొదటి 'వి'కి వీడు కోలు
  జయము నీయగ 'జయనామ' స్వాగతమ్ము
  వెతల దీర్చుము యభివృద్ధి గతుల జూపు
  {సంఖ్యా శాస్త్ర పరంగ ఒక అక్షరము 'వి' ని వదలమని పండితులు పలికారని కల్పిత భావంతో}

  రిప్లయితొలగించండి
 10. మిస్సన్న గారూ,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. అజరామరమగు శుభములు
  నిజముగ నందించలేక నిందలు పడుచున్
  విజయయె వెడలుచు నుండెన్
  విజయా! వీడ్కోలు నీకు వినయము తోడన్

  రిప్లయితొలగించండి
 12. అపజయముల దోలాడుచు
  విపత్తు గలిగించకుండ వీడక తోడున్
  తపియించిన జనులకు నీ
  వుపకారము జేసి వీడు చుంటివి విజయా!

  రిప్లయితొలగించండి
 13. శైలజ గారూ,
  మంచి పద్యాన్ని చెప్పారు. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ సర్వలఘుకందం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. వి జ య కు వీడు కో లు

  విభజనంబుతోడ వేర్పాటు భావంబు
  కలుగజేసినావు ఘనతరముగ
  సోదరాళిలోన మోదంబు క్షీణించ
  ప్రజలు మరువలేరు విజయ! నిన్ను. 1.

  జనుల జీవనంబు సకలభారతమందు
  దుఃఖభరితమయ్యె తోరమైన
  ధరలవృద్ధివలన నిరతదైన్యం బబ్బె
  ప్రజలు మరువలేరు విజయ! నిన్ను. 2.

  యశము సన్నగిల్లె దిశలలో నవినీతి
  యలముకొనెను నిత్య మధికముగను,
  నింద లధికమయ్యె నీకాలమందున,
  ప్రజలు మరువలేరు విజయ! నిన్ను. 3.

  కుత్సితంబు పెరిగె కువలయంబందంత
  మతముపేర కలహ మతులమగుచు
  విస్తరించియుండె వాస్తవం బియ్యది
  ప్రజలు మరువలేరు విజయ! నిన్ను. 4.

  వీడుకోలు నీకు విజయాఖ్య వర్షమా!
  మరువలేని వెన్నొ మహితముగను
  కూర్చినావు నిజము కువలయంబునకీవు
  ప్రజలు మరువలేరు విజయ! నిన్ను. 5.

  కోరుకున్నదంత తీరంగ నీరీతి
  తనిసియుండి మరల ధరణికీవు
  అరువదేండ్లకాల మగుపించకున్నను
  ప్రజలు మరువలేరు విజయ! నిన్ను. 6.

  లుప్తమయ్యె మమత, ప్రాప్తించె ద్వేషంబు,
  స్వార్ధమధికమయ్యె సకలజగతి
  నిజముబలుకుచుంటి నీకాలమందున
  ప్రజలు మరువలేరు విజయ! నిన్ను. 7.  రిప్లయితొలగించండి