27, మార్చి 2014, గురువారం

పద్య రచన – 548

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:


  1. ఒక వైపు ఉర్రూత లూగించు భాజపా
    మరు వైపు చేయూత లాగించు కాంగీ
    వింతైన పోటైన పోటీ కి వచ్చావు మానవా
    ఇక నీ త్రిశంకు స్వర్గానికి వేచి చూడవలె !!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. పెద్దవారు తగదు వద్దనిన వినక
    పట్టుపట్ట రాదు పాడిగాదు
    దేవలోకమేగి తిరిగి పడు త్రిశంకుఁ
    జూచి నేర్చుకొనుము సుమతి వగుము.

    రిప్లయితొలగించండి
  3. మునివరుడా గాది సుతుడు
    యనువుగ సృజియించెనాడు యద్భుత రీతిన్
    ఘనముగ త్రిశంకు కోసము
    వినువీధిన సృష్టి జేసె వేరొక దివినే

    రిప్లయితొలగించండి
  4. నేతల మాటలు వినగా
    గోతిన పడద్రోయునేమొ గొప్పగ జనులన్
    భూతల త్రిశంకు దివియిది
    ఏతావాతా నరయగ యేమగు నేమో!

    రిప్లయితొలగించండి
  5. బొంది తోడను స్వర్గముఁ బోవ దలచి
    ముందుగా వశిష్టునికి తాఁ మొక్కి భక్తి
    తోడ రాజు త్రిశంకుడు కడు ముదమున
    తెలియ జేసెను తన కోర్కె తెల్లముగను
    బొందితో స్వర్గముఁ జనుట పొందరాని
    దనుచు, మంచి కార్యములతో తనువు విడిచి
    చేరవచ్చును దివికని చెప్పె నతడు
    పట్టువదలని రాజు తాఁ తట్టెనపుడు
    గాధి పుత్రుని తలుపును కాంక్ష తోడ
    అభయమిచ్చి విశ్వామిత్రుడపుడు, జరిపె
    పెద్ద యజ్ఞమును మిగులు శుద్ధిగాను
    తనదు శక్తితో రాజును తనువు తోడ
    దివికి పంపగ యత్నించ, దేవత లపు
    డాతనిప్రయత్నమును వేగ నడ్డుకొనగ
    కినిసి విశ్వామిత్రుడపుడు తనదు మహిమఁ
    సృష్టి జేసెను ప్రతిగాను, చిన్ని స్వర్గ
    మొకటి రాజు త్రిశంకుకై, యొప్పుగాను
    క్రొత్త స్వర్గమందునత్రిశంకుడు వసించు
    తల్ల క్రిందుగసతతము చల్లగాను

    రిప్లయితొలగించండి
  6. ఆచరించలేని హామీలు గుప్పించి
    ప్రజల మోసగించు పాలకులుకు
    తగినశాస్తిజేయ తరుణమొచ్చెనుచూడు
    వోటరన్న చేతివాటమందు

    రిప్లయితొలగించండి
  7. మిత్రులారా!
    ఈనాటి పద్య రచనలు చాల బాగుగ నున్నవి. అందరికి అభినందనలు.

    శ్రీమతి లక్ష్మీ దేవి గారు:
    త్రిశంకుని అనుభవమును జూచి నీతి నేర్చుకోవలె నన్నారు. పద్యము బాగుగ నున్నది.

    శ్రీమతి శైలజ గారు:
    మీ 2 పద్యములును బాగుగ నున్నవి.
    గాధిసుతుడు అని ఉండాలి - టిపు పొరపాటు కాబోలు.
    గాధిసుతుడు తరువాత యడాగమము రాదు. ఆలాగుననే నాడు తరువాత యడాగమము రాదు.
    వినువీధినకి బదులుగా వినువీధిన్ అందామా?
    2వ పద్యములో:
    గోతిన బడదోయకి బదులుగా గోతిన్ బడదోయ అందామా?
    నారయ తరువాత యడాగమము చేసేరు - నుగాగమము చెయ్యాలి.

    శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయనరెడ్డి గారు:
    మంచి ఖండిక వ్రాసేరు. బాగున్నది.
    3వ పాదములో ప్రాసయతి నియమము పాటింపబడ లేదు.
    కినిసి విశ్వామిత్రుడు - అను పాదములో గణభంగము కలదు. కినిసి కౌశికు డప్పుడు తనదు మహిమ అందామా?
    రాజు త్రిశంకుకై అన్నారు -- రాజు త్రిశంకునకై అనుట సాధువు. మొకటి యా త్రిశంకుని కొరకొప్పుగాను అందామా?
    క్రొత్త స్వర్గమ్మునన్ ద్రిశంకుడు వసించు అందామా?

    శ్రీ పానుగంటి వారు:
    మీ పద్యము బాగుగ నున్నది.
    పాలకులకు అనాలి (టైపు పొరపాటు కాబోలు).
    తరుణమొచ్చెను అనుట వ్యావహారికము. తరుణ మేతెంచెను అందామా?

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. ఆశ్రయించి నంత నాశ్రితుఁ గావగ
    సత్తువున్న జెల్లు స్వర్గమీయ
    నదియు నిదియుఁ గాక నడిమధ్య నుంచుట
    రాష్ట్ర విభజనంత రచ్చ రచ్చ!

    రిప్లయితొలగించండి
  9. శ్రీ సహదేవుదు గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము -- రచ్చ రచ్చతో చాల బాగుగ నున్నది.

    రిప్లయితొలగించండి
  10. పండిత నేమాని గారికి నమస్కారాలు
    మీరుచెప్పింది నిజమే పాలకులకు అనిరావాలి ప్రింటింగులో పొరపాటు

    రిప్లయితొలగించండి
  11. పూజ్య గురుదేవులు పండిత నేమాని గారికి నమస్సులు. తమరిచ్చిన సలహాలకు సవరణలకు కృతజ్ఞతలు. మూడవ పాదాన్ని యీవిధంగా మార్చాను.
    “తోడ రాజు త్రిశంకుడు వేడు కొనుచు”

    రిప్లయితొలగించండి
  12. కవిమిత్రులకు నమస్కృతులు.
    హైదరాబాదుకు అనుకున్న ప్రయాణం హుస్నాబాదుకు మారింది. అక్కడ ఒక పెళ్ళికి వెళ్ళి ఇంతకుముందే ఇల్లు చేరాను.
    నిన్న, ఈరోజు మిత్రులు ఉత్సాహంగా పూరణలు, పద్యాలను వ్రాయడం, పండిత నేమాని వారు దయతో వాటిని సమీక్షించడం నాకు ఆనందాన్ని, తృప్తిని కలిగించాయి. అందరికీ ధన్యవాదాలు.
    త్రిశంకుని గురించి చక్కని పద్యాలను చెప్పిన మిత్రులు.....
    లక్ష్మీదేవి గారికి,
    శైలజ గారికి,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    పానుగంటి వారికి,
    సహదేవుడు గారికి,
    అభినందనలు.

    రిప్లయితొలగించండి