4, మార్చి 2014, మంగళవారం

సమస్యాపూరణం - 1341 (విటులు మఱుపుట్టువున)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
విటులు మఱుపుట్టువున నేలవేల్పులు గద!
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

18 కామెంట్‌లు:

  1. కోరి శృంగార మోహమ్ము కోమ లింట
    విటులు , మఱుపుట్టు వుననేల వేల్పులు గద
    ద్విజు లనంగ పండిత తేజ మనుచు
    గుడిని భగవంతు సన్నిధి గడపు వారు

    రిప్లయితొలగించండి
  2. కోరి శృంగార మోహమ్ము కోమ లింట
    విటులు , మఱుపుట్టు వుననేల వేల్పులు గద
    ద్విజు లనంగ పండిత తేజు లనుచు
    గుడిని భగవంతు సన్నిధి గడపు వారు

    క్షమించాలి పండిత తేజు లనుచు

    అంటే బాగుంటుం దేమొ అని

    రిప్లయితొలగించండి

  3. ఒక వేమన విటుడై జీవనము సాగింప
    ఒక చిన్నిపాప మామ కై ప్రాణము ఎడబాసే
    వేమన విశ్వదాభిరామ అయ్యే ! మరి
    విటులు మఱుపుట్టువున నేలవేల్పులు గద!!


    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. అనిరి''పూజారి మఱుజన్మ శునిగబుట్టు
    విటులు మఱు పుట్టువున నేలవేల్పులు గద''
    సత్య దూరంబిదియన నసత్య మగునె ?
    విప్ర నారాయణుడు జేర వినమె దివికి !

    రిప్లయితొలగించండి
  5. గురువుగారు చిన్నసందేహం
    పుట్టువునన్ ఏల వేల్పులు?

    రిప్లయితొలగించండి
  6. పుణ్య కార్యములను జేసి పోయి దివికి
    అవ్వుచున్నారు, గద కొందరప్సరసల
    విటులు, మఱుపుట్టువున నేలవేల్పులు గద
    మంచి మార్గము నిపుడు వసించువారు


    రిప్లయితొలగించండి
  7. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
    సవరణలకు శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో.

    గురువు గారు నాకు ప్రేమ దోమ కుట్టలేదు,బహుశ నా కుటుంబ ఆర్ధిక పరిస్థిని నేను అర్థము చేసుకొనుట వల్ల కావచ్చు,నాకు చెల్లెళ్ళు తప్ప చెలియలు లేరండి,మొదటి నుండి నేను కడ వరకు (M.Tech ) క్లాసు లీడర్ ను కావడం కూడా కారణం కావచ్చు. సరదాగా జేసిన పూరణ యది.
    ==============*=================
    పంది జన్మ మెత్తుదు రట పరగ మూఢ
    విటులు మఱుపుట్టువున,నేల వేల్పులు గద
    నరహరిని కీర్తించు వానరులు,భక్త
    తతులు,పుర హితు లెల్లరు ధరణి యందు!

    రిప్లయితొలగించండి
  8. పాండురోగిగ నిరతము బాధ పడును
    విటులు మఱు పుట్టువున , నేల వేల్పులు గద
    భక్తి శ్రధ్ధల బూజింత్రు భవుని నిలను
    నాయు రారోగ్య సంపద లందు కొఱ కు

    రిప్లయితొలగించండి
  9. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    కాకుంటే అన్వయం కుదరక, సమస్య పరిష్కరింపబడలేదన్న సందేహం కలుగుతున్నది.
    *
    జిలేబీ గారూ,
    మంచి భావాన్ని అందించారు. అభినందనలు.
    మిత్రులెవరైనా పద్యం రూపాన్ని ఇస్తారో చూద్దాం.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘దివికి/ నగుచు నున్నారు’ అన్నండి.
    *
    కందుల వరప్రసాద్ గారూ,
    విరుపుతో చక్కని పూరణ చెప్పి అలరించారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. సుబ్బారావు గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    కామిగాకున్నచో మోక్ష గామి గాడ
    నంగ వేశ్యల సంగతి ననుభ వించు
    విటులు,[మరుపుట్టువున నేల ?] వేల్పులు గద
    స్వర్గమున నేడె దేవవేశ్యలను గూడి
    ముక్తి కాంతను జేరగ రక్తు లైరి

    రిప్లయితొలగించండి
  12. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    బ్రాకెట్టుతో మీ పూరణ అర్థం కాకుండా ఉంది. దయచేసి వివరణ ఇవ్వండి.

    రిప్లయితొలగించండి
  13. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    కాముకులైన విటులు కేవలము మోక్షసాధన సాకుతో మరియొక జన్మవరకు నిరీక్షించడ మెందుకని ఈజన్మలోనే దేవతలు దేవవేశ్యల గూడినటుల ముక్తికాంతను గోరుచున్నారని నా భావన

    రిప్లయితొలగించండి
  14. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ వివరణతో సందేహం తీరింది. ధన్యవాదాలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    విటులను అవిటివారిని చేసిన మీ పూరణ బాగుంది. అభినందనల్.

    రిప్లయితొలగించండి
  15. లక్ష్మీదేవి గారూ,
    పుట్టువునన్ + ఏల వేల్పులు... అన్న విరుపు బాగానే ఉంది. ‘కద’ శబ్దం అన్వయించేలా పూరణ చెపితే సరి!

    రిప్లయితొలగించండి
  16. భక్తి పరులైన ధూర్జటి వంటి వారు
    విటులు , మఱు పుట్టువున నేల వేల్పుల్ముక్తి
    ముక్తి గోరిన కన్నప్ప మోక్ష మొంది
    శివుని జేరెను కైలాస శిఖర మందు

    రిప్లయితొలగించండి
  17. విటుని వలె కృష్ణ భగవాను వేల గోపి
    కల మదినిదోచి భోగించి యిలలోన
    రామునవతార మెత్తెను రాజుగాను
    విటులు మఱు పుట్టువున నేల వేల్పులు గద.

    రిప్లయితొలగించండి
  18. పుణ్యకర్మలఁ జేయుచు ముక్తిఁ బొంద
    విటులు మఱుపుట్టువుననే(న్-యే)ల వేల్పులు గద
    వరము లియ్యంగ నెదురుగ వచ్చి నిలువ
    వలయు! తప్పును దిద్దుటె పాడి యగును.

    రిప్లయితొలగించండి