నాగరాజు రవీందర్ గారూ, కప్పను మ్రింగిన పాముతో చక్కని పూరణ చెప్పారు. మీ రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు. * భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * సుబ్బారావు గారూ, విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు. * శైలజ గారూ, మీ మూడు పూరణలూ బాగున్నవి. అభినందనలు. ‘తరువున నెగురుచు’, ‘కని యొక’ అనండి. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * పియెస్సార్ మూర్తి గారూ, మీ పూరణలో భావం బాగుంది. అభినందనలు. కాని మీరు ప్రాసనియమాన్ని పాటించలేదు. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగుంది. అభినందనలు. * నాగరాజు రవీందర్ గారూ, విజయ్ రాఘవేంద్ర గారూ, శాంతి శ్శాంతి శ్శాతిః
తెలుసుకోవాలని ఆశక్తి తో
రిప్లయితొలగించండిమీరు 'పూరి ' ంచి మాకు వడ్డించ గలరు
రిప్లయితొలగించండిసురసయను నాగదేవత
రిప్లయితొలగించండిగరుడుని బొమ్మలను జేయగా చక్కెరతో
సరదాపడి యా చక్కెర
గరుడుని మ్రింగినదట భుజగమ్ము గుటుకునన్
గరుడుడు పామును మ్రింగుట
రిప్లయితొలగించండినరసిన యొక చిన్నబాలు డతిభీతుండై
పురమేగి పలికె తడబడి
గరుడుని మ్రింగిన దట భుజగమ్ము గుటుకునన్
గరుడుని స్థంభము దిగువున
రిప్లయితొలగించండివరుసగ నెలకొన్న రాతి వ్యాళపు ప్రతిమల్
పొరబడి గాంచిన పిల్లలు
గరుడుని మ్రింగిన దట భుజగమ్ము గుటుకునన్
గరుడుడు వాసము యుండెడు
రిప్లయితొలగించండితరువును బ్రాకుచును బైకి తహతహతోడన్
గరుడుని సంతగు శాబక
గరుడుని మ్రింగిన దట భుజగము గుటుకునన్.
విజయ్ రాఘవేంద్ర గారూ,
రిప్లయితొలగించండిస్వాగతం. ఆసక్తితో అభిరుచిని పెంచుకొని అభ్యాసంతో పద్యరచన చేయండి.
*
పండిత నేమాని వారూ,
‘సురస’ ప్రస్తావనతో మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
*
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
బాలుడి తడబాటు మాటగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
ఆహా... చక్కని ఊహ. పూరణ బాగుంది. అభినందనలు.
మూడవ పాదాన్ని ‘పొరపడి కని పిల్ల లనిరి’ అంటే అన్వయం కుదురుతుంది.
*
బొడ్డు శంకరయ్య గారూ,
గరుడ శాబకాల ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘వాసము + ఉండెడు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘వాస మ్ముండెడు’ అనండి.
తిరుగుచు నుండగ సూర్యుడు
రిప్లయితొలగించండిమరి రాహువు వచ్చి మ్రింగె మసకయె జగమే
సరిదోచె నిట్లు మనమున
గరుడుని మ్రింగిన దట భుజగము గుటుకునన్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిసూర్యుని మ్రింగిన రాహువు పోలికతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మాస్టరుగారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఅట్లాగే గురూగారూ
రిప్లయితొలగించండిసురలసురులు కలిసినటుల
రిప్లయితొలగించండిగరుడులు సర్పములు కలియ కలికాలములో,
వెరవొoదక తదుపరినొక
గరుడుని మ్రింగిన దఁట భుజగమ్ము గుటుకునన్
మురహరి చేసెను బంటుగ
రిప్లయితొలగించండిగరుడుని, మ్రింగినదట భుజగమ్ము గుటుకునన్
దరి గనిపించిన గప్పను
హర! యని శివు వేడుకొనిన నాపద తప్పున్
వరముగనుగరుడపంచమి
రిప్లయితొలగించండిజరుపుచు నొకసతి గరుడుని చలిమిడి ప్రతిమన్
మురియుచు జేయన్ చలిమిడి
గరుడుని మ్రింగినదట భజగమ్ము గుటుకునన్
తరువున యెగురుచు జారిన
రిప్లయితొలగించండిగరుడుని కూననుగనినొక కాకోలమ్మున్
మురియుచు దొరికిన పోతక
గరుడుని మ్రింగినదట భుజగమ్ము గుటుకునన్
కరమగు నాకలి కలుగగ
రిప్లయితొలగించండినురవడితో మృత గరుడము నురగము మ్రింగన్
చిఱుతడొకరుడు విని యనియె
గరుడుని మ్రింగినదట భుజంగమ్ము గుటుకునన్
హరివాహనముగ చేకొనె
రిప్లయితొలగించండిగరుడుని, మ్రింగినదట భుజగమ్ము గుటుకునన్
ఇరవున మండూకముగని
ఘురణము కాకుండబట్టి కుహరము దూరెన్
Naagaraju gaaru..గరుడు అంటే విష్ణుమూర్తి వాహనమా లేక దశావతారాలలో 'గరుడావతారం ' ఒకటా? అనుమానం నివృత్తి చెయగలరు.
రిప్లయితొలగించండివిధిరాతకు దాసోహము
రిప్లయితొలగించండిజగమందున జీవులెల్ల సమమగు రీతిన్
సమయము ప్రతికూలమైన
గరుడుని మ్రింగిన దఁట భుజగమ్ము గుటుకునన్
Nagaraju Ravinder...నాకు మీ అంత పాండిత్యం లేనే లేదు.కానీ మీ కామెంట్ కి ఆ అమ్మవారే ఒక రోజు నాచేత సామాధానం పలికిస్తుందని ఆశిస్తున్నాను.
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్య గురుదేవులకు నమస్సులు, తమరు సూచించిన సవరణ శిరోధార్యము. సవరణతో..
రిప్లయితొలగించండిగరుడుడు వాసమ్ముండెడు
తరువును బ్రాకుచును బైకి తహతహతోడన్
గరుడుని సంతగు శాబక
గరుడుని మ్రింగిన దట భుజగము గుటుకునన్.
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండికరి బ్రోవగ పరుగున నే
యరదము జీరంగ రాడు హరి ?భేకములన్
దరి వేచి బట్టు నెయ్యది ?
గరుడుని , మింగును గద భుజగమ్ము గుటుకునన్
Nagaraju Ravinder...
రిప్లయితొలగించండి"కవిర్దండి కవిర్దండి కవిర్దండి నసంశయః " అని ఒకరంటే...
"త్వమేవాహం త్వమేవాహం త్వమేవాహం
న సంశయః " అని వేరొకరు అన్నారట.
ఇక్కడ అందరూ కోరేది రసమయమైన కవిత్వమే.
మీ కామెంట్స్ గురించి ఏమి ఫీల్ అవ్వకండి.
మీ ఆశీర్వాదానికి ధన్యవాదాలు.
ఇంక ఎవరి పని లో వారు ఉందాం.నమస్తే.
నాగరాజు రవీందర్ గారూ,
రిప్లయితొలగించండికప్పను మ్రింగిన పాముతో చక్కని పూరణ చెప్పారు.
మీ రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.
*
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ మూడు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
‘తరువున నెగురుచు’, ‘కని యొక’ అనండి.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
పియెస్సార్ మూర్తి గారూ,
మీ పూరణలో భావం బాగుంది. అభినందనలు.
కాని మీరు ప్రాసనియమాన్ని పాటించలేదు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
విజయ్ రాఘవేంద్ర గారూ,
శాంతి శ్శాంతి శ్శాతిః
గురువుగారూ,
రిప్లయితొలగించండినకారపు పొల్లువేసి "గరుడుని" ను "కరుడుని" (ముద్ద) గా తీసికొనే వీలుందాండీ
భవదీయుడు
రామకృష్ణ గారూ,
రిప్లయితొలగించండిఆ అవకాశం, అధికారం పూరకులకు ఉంది. ‘నిరంకుశాః కవయః’
తరుమగ జటాయు వతని
రిప్లయితొలగించండిన్నరయగ రావణుడు పోరి హతమొనరించెన్;
గురువర! అది యెట్లన్నన్:
గరుడుని మ్రింగిన దఁట భుజగమ్ము గుటుకునన్
కలియుగ గజేంద్ర మోక్షము:
రిప్లయితొలగించండిబరువగు పద్యము లందున
కరి యేడవ తన హృదయము కరుగగ వడిగా
పరుగిడ విష్ణువు భువికిన్
గరుడుని మ్రింగిన దఁట భుజగమ్ము గుటుకునన్