కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
శ్రీ కృష్ణుడు శూర్పణఖకు చెవులం గోసెన్.
ఈ సమస్యను పంపిన మెఱుగుమిల్లి వేంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
శ్రీ కృష్ణుడు శూర్పణఖకు చెవులం గోసెన్.
ఈ సమస్యను పంపిన మెఱుగుమిల్లి వేంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు.
శ్రీకృష్ణుడె సకలంబని
రిప్లయితొలగించండియాకర్ణించిన బుడుత డాభావముతో
నీ కరణి జెప్పె పద్యము
శ్రీకృష్ణుడు శూర్పణఖకు జెవులం గోసెన్
రిప్లయితొలగించండిపరశు రాముడు భార్య తల కోసేన్
శ్రీ రాముడు పూతన ప్రాణముల్ తీసెన్
శ్రీ కృష్ణుడు శూర్పణఖ జెవులం గోసెన్
జిలేబి కోతల కథల తో రంజిల్ల జేసెన్ !!
శుభోదయం
జిలేబి
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిబుడుతడి మాటగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘బుడుత’ డన్నచోట గణదోషం. ‘ఆకర్ణించి యొక బుడుత డాభావముతో’ అనవచ్చునా?
*
జిలేబీ గారూ,
మీ కోతలు బాగున్నవి. సంతోషం.
కానీ మీ కోతలను కందంలో ఇమిడ్చె ప్రయత్నం చేసి విఫలమయ్యాను. చూద్దాం... మిత్రు లెవరైనా చేస్తారేమో?
ఆకలికి సత్యభామకు
రిప్లయితొలగించండిశ్రీకరమగు రామచరిత చెప్పుచు నింకా
నాకతన నిట్లు చెప్పెను
శ్రీకృష్ణుడు, శూర్పణఖకు జెవులం గోసెన్
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండికృష్ణునిచేత సత్యభామకు రామకథను చెప్పించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
నాగరాజు రవీందర్ గారూ,
రిప్లయితొలగించండివిరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
పోకిరి కంసుని జంపెను
రిప్లయితొలగించండిశ్రీకృష్ణుడు, శూర్పణఖకు జెవులం గోసెన్
కేకలు వేయుచు సౌమిత్రి
లేకిగ సరసమ్ములాడు లేమను జూడన్
మార్చి 05, 2014 10:35 AM
తొలగించు
భీ కరుడౌ శత్రువులకు
రిప్లయితొలగించండిశ్రీ కృ ష్ణుడు, శూ ర్ప ణ ఖ చెవులం గోసెన్
రాకాసి దనను గోరగ
శ్రీ కరుడా ల క్ష్మణుం డు సేమము కొఱకున్
లోకేశు తండ్రి హరియే
రిప్లయితొలగించండిశ్రీ కృష్ణుడు, శూర్పణఖకు చెవులం గోసెన్
కైకకు సవతి కొడుకు వెస
శూకము లేకుండ నతని సోదరునాజ్ఞన్
శూకము: కనికరము
శైలజ గారూ,
రిప్లయితొలగించండివిరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘సౌమిత్రి’ అన్నచోట గణదోషం. ‘కేకలతో లక్ష్మణు డా/ లేకిగ..." అందామా?
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆకృతి లక్ష్మణు నిదగుచు
రిప్లయితొలగించండిశ్రీకృష్ణుడు శూర్పణఖకు చెవులం గోసెన్.
శ్రీకృష్ణుడు విష్ణువె కద
శ్రీకృష్ణుడు,శ్రీ రాముడు, సిరి వల్లభుడే
ఆకృతిలో బలభద్రుడు
నాకృతిలో లక్ష్మణుండు హరి యంశ యవ
న్నాకృతి సౌమిత్రి దగుచు
శ్రీ కృష్ణుడు శూర్పణఖకు చెవులం గోసెన్.
అయ్యా! శ్రీ శంకరయ్య గారూ!
రిప్లయితొలగించండిటైపు చేయునప్పుడు గల ప్రతిలో తప్పు దొరలినది. మీ సవరణ బాగుగ నున్నది. సంతోషము. స్వస్తి.
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
*
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఆకంసుని పరిమార్చెను
రిప్లయితొలగించండిశ్రీకృష్ణుడు, శూర్పణఖకు చెవులం గోసెన్
తేకువ మీరగ లక్ష్మణు
డేకాలము దుష్టజాతి కిట్లగు నుర్విన్.
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిగోకుల చంద్రు౦ డెవ్వడు ?
రాకాసికి నెట్టిశిక్ష లక్ష్మణు డేసెన్ ?
సాకల్యమ్ముగ తెలుపుమ.
శ్రీకృష్ణుడు, శూర్పణఖకు చెవుల౦ గోసెన్
శ్రీ భాగవతుల కృష్ణా రావు గారు: నమస్కారములు.
రిప్లయితొలగించండిమీ పద్యములు బాగుగ నున్నవి. అభినందనలు. ఈ క్రింది పాదములో గణభంగము కలదు. 6వ గణము సరిగా వేయబడలేదు. సరిజేయండి:
"శ్రీకృష్ణుడు, శ్రీరాముడు సిరి వల్లభుడే"
స్వస్తి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆ కృష్ణకు వలువ లిడెను
రిప్లయితొలగించండిశ్రీ కృష్ణుడు , శూర్ఫణఖకు చెవులం గోసెన్
ఏకృతిని గలదు చెపుమా
ఆకృతి సౌమిత్రి యెగద యా రక్కసి నడచెన్
శ్రీ నేమని వారికి నమస్సులు
రిప్లయితొలగించండినా పద్యములో "శ్రీ కృష్ణుడు శ్రీ రాముడు సిరి వల్లభుడే" అను పాదములో 6 వ గణము ఎటుల వచ్చునో తెలుపగోరెదను. ఆ పాదములో 12 నుండి 15 వరకు గణములు వచ్చును. గణదోషము వివరింప గోరెదను.
శ్రీ కృష్ణారావు గారికి నమస్కారములు.
రిప్లయితొలగించండిమీ వంటి పెద్దలకు కందపద్య లక్షణములను నేను చెప్పవలెనా? కంద పద్యములో 6వ గణము జగణము గాని నల గణముగాని అయి ఉండవలెను. మీరు "రాముడు" అని భగణమును వేసినారు. ఒక్క మారు మీ పద్యమును సరిచూసుకొనండి. స్వస్తి.
శ్రీ కృష్ణా రవు గారికి నమస్కారములు.
రిప్లయితొలగించండిమీకు ఇంకను విపులముగా చెప్పవలెనన్నచో:
కందపద్యములో 1, 2 పాదములు కలిపి 3 + 5 = 8 గణములు ఉండును. అటులనే 3, 4 పాదములు కలిపి 8 గణములు ఉండును.తొలి 8 గణములలో గాని, మలి 8 గణములలో గాని బేసి గణము జగణము కాకూడదు. అటులనే తొలి 8 గణములలో గాని మలి 8 గణములలో గాని 6వ గణము జగణము గాని నల గణము గాని అయి ఉండవలెను. మీకు సందేహము నివృత్తి అయినదని అనుకొను చున్నాను. స్వస్తి.
శ్రీ నేమని వారు ,
రిప్లయితొలగించండిమీ వివరణ చూసాను. ఆ పద్య పాదాన్ని క్రింది విధముగా మార్చవచ్చును
"శ్రీ కృష్ణుడు రఘువరుడును సిరి వల్లభుడే "
ధన్యవాదాలు
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
=============*===============
చీకటిలో చెల్లి జదువ
శ్రీకృష్ణుడు శూర్పణఖకు చెవుల౦ గోసెన్,
శ్రీ కాంతుడు బలికె నిటుల
శ్రీకృష్ణుడు రాధ ముక్కు చెవుల౦ గోసెన్!
శ్రీకరముగ సాందీపని
రిప్లయితొలగించండివాకిట రక్కసి చరితము పలికెన్ని టులన్ : ---
భీకరముగ సౌమిత్రుడు,
"శ్రీ కృష్ణుడు!"
శూర్పణఖకు చెవులం గోసెన్