కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రాముఁ డనఁగను సాక్షాత్తు రావణుండె.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రాముఁ డనఁగను సాక్షాత్తు రావణుండె.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
పంక్తికంఠుండు రాక్షస వంశవిభుడు
రిప్లయితొలగించండినఖిల లోకవిజేత లంకాధినేత
శివసమర్చనా నిరతుండు దివిజగణవి
రాముడనగను సాక్షాత్తురావణుండె
కోరె రావణు మరణమ్ము నరుని వలన
రిప్లయితొలగించండిహరిని శపియించె నరునిగ నార దుండు
శైవ భక్తుడు రావణు శరణు యనగ
రాము డనగను సాక్షాత్తు రావ ణుండె
రిప్లయితొలగించండిరావణుడు అపహరించిన భీతహరిణేక్షిణి
సీతాపతి సీతా అని సంశయిస్తే
గజేంద్ర హస్తాభిహతేవ వల్లరి అయ్యే
రాముడనగను సాక్షాత్తురావణుండె !!
జిలేబి
రామఁ బట్టిన పాపము లంటినంత
రిప్లయితొలగించండిరాము శరమునఁ గూలిన రాక్షసుండు
రామ శౌర్యమెఱుగని సురగణబలవి
రాముఁ డనఁగను సాక్షాత్తు రావణుండె.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదశరధేశుని తనయుడు ధర్మ మూర్తి
రిప్లయితొలగించండిరాము డనగను, సాక్షాత్తు రావణుండె
బిక్షు వేషము ధరియించి భిక్ష గోరి
సీత నెత్తుకు పోయిన ఘాతకుండు
పెనగుటకు ముహూర్తమ్మును బెట్టుమనుచు
రిప్లయితొలగించండిరాముడనగను, సాక్షాత్తు రావణుండె
నిర్ణయించెను సమయమున్ నియతి తోడ
రావణుని మించు పండిత రాజు గలడె
రాక్షసుల నెల్ల దునుమాడె రణములోన
రిప్లయితొలగించండినజితు డవతార వీరాగ్రు డసుర వైరి
రాముడనగను, సాక్షాత్తురావణుండె
పోరి మడసెను శ్రీరాము జేరె తుదకు
అతుల నిష్ఠాగరిష్ఠుడై యవిరళ తప
రిప్లయితొలగించండిమాచరించి కపర్దిని హరుని జూడ
గోరె దైత్యుడు తదితర కోరికల వి
రాముఁ డనఁగను సాక్షాత్తు రావణుండె
పోరునకు ముహూర్తముబెట్ట బుధ వరుడని
రిప్లయితొలగించండిరాముడనగను, సాక్షాత్తు రావణుండె
పొందు పరచె ముహూర్తము బుద్ధి దలచి
ప్రభువు చేతిలో జిక్కి పరమపదించ
మాయరూపమ్ము ధరియించి మహిసుపుత్రి
రిప్లయితొలగించండికాపహరణమ్ము గావించి నట్టి దైత్యుఁ
డతిభయంకరుఁ డతిదుష్టుఁ డాతఁడగ్గి
రాముఁడనఁగను సాక్షాత్తు రావణుండె.
అగ్గిరాముడు = చెడ్డ చేయుటలో సమర్ధుఁడు, (వి; నె)
దశరథుని ప్రథమ సుతుడే దాశరథియు
రిప్లయితొలగించండిరాముడనఁగను, సాక్షాత్తు రావణుండె
లయకరుఁ సతము పూజించు లంక రేడు
విద్య లన్నియు నేర్చిన విజ్ఞు డతడు
విశ్వరూపము జూపిన విష్ణు వేను
రిప్లయితొలగించండిరాము డనగను సాక్షాత్తు, రావణుండె
కోటి లింగాల యర్చన కూర్మి తోడ
చేసి చూపిన భక్తుడు వాసి గాను
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసీతనుంచితి లంక నేభాతినైన
రిప్లయితొలగించండిసమ్మతించును నాపొందు నెమ్మదిననె
కామమే తప్ప తదితర కాంక్షలకు వి
రాముఁ డనఁగను సాక్షాత్తు రావణుండె
పూజ్యులు పండిత నేమానివారికి, మిత్రులు కంది శంకరయ్యగారికి, సాహితీ మిత్రులందరికి నమస్కారములతో...
రిప్లయితొలగించండిదానవేంద్రుఁడు కైకసీ సూనుఁడతఁడు
జానకీహర్త వేదవిజ్ఞానయుతుఁడు
సోమభక్తుఁడు మండోదరీమనోఽభి
రాముఁడనఁగను సాక్షాత్తు రావణుండె!
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణలో మొదటి, రెండవ పాదాల్లో యతి తప్పింది. సమస్యకూడా సంతృప్తికరంగా పరిష్కరింపబడలేదు.
*
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
కాకుంటే ఒక అభ్యంతరం... ఆభరణము అనే అర్థంలో ‘నగ’లో అరసున్నా ఉండదు.
మీ రెండవ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘లయకరు’ తరువాత అర్ధానుస్వారం అవసరం లేదు.
*
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
గుండు మధుసూదన్ గారూ,
చాలాకాలానికి మామీద దయ కలిగింది. సంతోషం!
చక్కని పూరణతో మీ పునరాగమనం ఆనందాన్ని కలిగించింది. అభినందనలు.
నాగరాజు రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిచాలాకాలంగా అరసున్నాల గురించి వ్యాకరణ పాఠం పెట్టాలనే అనుకుంటున్నాను. వీలు చిక్కడం లేదు. సాధ్యమైనంత తొందరలో పోస్ట్ చేస్తాను.
చూడనటన భూకైలాసు చోద్యమంద
రిప్లయితొలగించండిఎంటియారును వేరుగా నెంచగలమె
నటనమందున జీవించె నందమూరి
రాముఁడనఁగను సాక్షాత్తు రావణుండె.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిరాముడుగాను, రావణుడుగాను నటించి మెప్పించిన రామారావును ప్రస్తావించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
మాస్టరుగారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండి