పండిత నేమాని వారూ, కరిని పట్టిన మకరిని గురించిన మీ పద్యం బాగుంది. కేశవనామాలను ఇముడ్చుకున్న మీ సీసపద్యం, దశావతారాలను స్తుతించిన సీసపద్యం మనోహరంగా ఉన్నాయి. అభినందనలు, ధన్యవాదాలు. * రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగుంది. అభినందనలు. * జిలేబీ గారూ, :-)
శైలజ గారూ, బాగుంది మీ పద్యం. చివరి పాదాన్ని ‘హరి నీవే బ్రోవవలయు నా కరిని దయన్’ అంటే బాగుంటుంది. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
శ్రీ అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు: శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. శక్తివంతమైన అనే ప్రయోగము సరికాదు. ఇకార ఉకారముల తరువాత మంతము అనాలి. శక్తిమంతమైన అనుట సరియైన ప్రయోగము. ఉదా: శక్తిమంతుడు, శ్రీమంతుడు, ధీమంతుడు, హనుమంతుడు, భానుమంతుడు, మొ.వి. ఆయుష్మంతుడు, రోచిష్మంతుడు మొదలగు వానిలో కూడ మంతుడు అనవలెను. స్వస్తి.
శ్రీ తిమ్మాజీరావు గారికి శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. మత్తేభము గురించి మత్తేభమును జెప్పిరి. అభినందనలు. కొన్ని సూచనలు: 1. దుస్సాధము అనవలెను. దుస్సాధ్యము కాదు. 2. కాపాడు కోవందగన్ అనుచోట వ్యావహారిక భాషను వాడిరి. 3. జెల్లును అనిన పిదప చివరలో ఉకారము ఉన్నది కావున యడాగమము రాదు. సంధి నిత్యము కదా. స్వస్తి.
కరి కరము బట్టి లాగగ
రిప్లయితొలగించండిసరసికి మకరమ్ము, కరియు శక్తి కొలదిగా
కరము ప్రతిఘటించుచు నా
యరితో పోరాడుచుండె నద్భుత రీతిన్
కరి మకరి పోరు గాంచిన
రిప్లయితొలగించండివరదుడు దిగివచ్చు నేమొ వరమీ యంగా
శరణన్న వారి నెన్నడు
కరుణించక విడువ డంట కారుణ్య మునన్
పాహిమాం కేశవ! పాహి నారాయణ!
రిప్లయితొలగించండి....పాహిమాం మాధవ! పాహి పాహి
పాహిమాం గోవింద! పాహి విష్ణో! మధు
....సూదన! మాంపాహి వేదవేద్య!
పాహి త్రివిక్రమ! వామన! శ్రీధర!
....పాహి హృషీకేశ! పద్మనాభ!
పాహి దామోదర! పాహి సంకర్షణ!
....పాహిమాం పాహిమాం వాసుదేవ!
పాహిమాం ప్రద్యుమ్న! పాహిమా మనిరుద్ధ!
....మాంపాహి పురుషోత్తమ! పరమేశ!
మామధోక్షజ! పాహిమాం మాం నృసింహ!
పాహి పాహిమా మచ్యుత! పాహి పాహి
మాం జనార్దన! పాహిమాం మాముపేంద్ర!
పాహి మాం హరే! శ్రీకృష్ణ! పాహి పాహి
రిప్లయితొలగించండిస్థాన బలిమి లేని మొసలి
పిల్ల ఏనుగు జేత చిక్కి
వరదా కావవా అని వేడిన
కపాల మోక్షము దక్కెన్ !
జిలేబి
వేదచోరుని గూల్చి వేదాల గాచిన
రిప్లయితొలగించండి....స్వామి! రావయ్య! మత్స్యావతార!
శరధి ద్రచ్చెడు వేళ గిరి నుద్ధరించిన
....త్రాత! రావయ్య! కూర్మావతార!
దనుజేశుని వధించి ధరణిని బ్రోచిన
....దేవ! రావయ్య! క్రోడావతార!
అసురేశు జీల్చి ప్రహ్లాదు రక్షించిన
....శ్రీశ! రమ్మా! నరసింహరూప!
రమ్ము స్వామి! త్రివిక్రమా! రమ్ము రమ్ము
రమ్ము భార్గవ! శ్రీరామ! రమ్ము రమ్ము
రమ్ము గోపాల నాయకా! రమ్ము రమ్ము
రమ్ము బుద్ధ! కలికిదేవ! రమ్ము రమ్ము
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండికరిని పట్టిన మకరిని గురించిన మీ పద్యం బాగుంది.
కేశవనామాలను ఇముడ్చుకున్న మీ సీసపద్యం, దశావతారాలను స్తుతించిన సీసపద్యం మనోహరంగా ఉన్నాయి.
అభినందనలు, ధన్యవాదాలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
జిలేబీ గారూ,
:-)
కరి కరముబట్టిమకరము
రిప్లయితొలగించండిసరసుకు లాగుచునుకరిని జంపగ దలచెన్
బిరబిర సరిగొని మకరిని
హరి నీవే ప్రాపుకరిని ఔదార్యముతో
శక్తి వంతమైన సామజ కరమును
రిప్లయితొలగించండిపట్టె నొక్క మొసలి పటిమ తోడ
కడవ యంత కాయ కత్తికి లోకువ
చిన్న మకరి కరికి చేటు దెచ్చె
శైలజ గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పద్యం.
చివరి పాదాన్ని ‘హరి నీవే బ్రోవవలయు నా కరిని దయన్’ అంటే బాగుంటుంది.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
రిప్లయితొలగించండిసవరణలకు శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో.
శ్రీ నేమాని గురుదేవుల పద్యములు గజేంద్ర మోక్షములోని పద్యముల వలె బహుబాగున్నవి.
==============*============
వావివరుస లెల్ల మరచి పరగ మూడుల జతలో
కావరమున కన్ను మిన్ను గానక తిరుగాడి నా
మావటివని విని సరగున మరుగు జొచ్చితి హరీ!
భావజజనకుడవు స్వామి బంధములను ద్రుంచ వే
గోవుల దరి జేరి గాచు గోప బాల ప్రేమతో
కోవిధులు బలుకగ నాడు గూర్మి నొందియుంటి నే
దేవ దేవ పద్మ నాభ!దీన రక్షకా హరీ!
రావణాది రాక్షసులను రణము నందు గూల్చి నా
భూవరుడవు జీవ తతికి భూరి వరము లీయగన్
క్ష్మావరేశ ధర్మ మగునె? కరుణ జూప కుంటి వే
పావనమగు పాదములను బట్టి యనవరతము నీ
సేవ జేయ వైరి తతికి సీమ నిచ్చి నాడ వే
దేవ!దేవ!వేగ మకరి తృప్తి జెందు రీతినన్
గావ రావ భక్త కరిని కలియుగమున శ్రీహరీ!
మకర మయ్యది హెచ్చగు మదము తోడ
రిప్లయితొలగించండికరము నోటన బట్టుచు కరిని లాగు
చుండె నీటి లోని క చట చూడు డార్య !
జలచ రముగాన మొసలికి శక్తి మెండు
వరప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
శ్రీ వరప్రసాద్ గారు! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యములు బాగుగ నున్నవి. అభినందనలు.
ఇంకా పద లాలిత్యము కొరకై ప్రయత్నించండి.
స్వస్తి.
శ్రీ అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు: శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. శక్తివంతమైన అనే ప్రయోగము సరికాదు. ఇకార ఉకారముల తరువాత మంతము అనాలి.
శక్తిమంతమైన అనుట సరియైన ప్రయోగము.
ఉదా: శక్తిమంతుడు, శ్రీమంతుడు, ధీమంతుడు, హనుమంతుడు, భానుమంతుడు, మొ.వి.
ఆయుష్మంతుడు, రోచిష్మంతుడు మొదలగు వానిలో కూడ మంతుడు అనవలెను.
స్వస్తి.
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండికరితుండమ్మునుబట్టి లాగును గిలగ్రాహమ్ము దంష్ట్రమ్ములన్ ,
గరిసొ౦తమ్మగు శక్తినంతయు తనన్ గాపాడుకోవన్ తగన్
స్థిరసంకల్పమ్ముతో ఝషమ్ముబిగువున్ ఛేది౦పబోరాడ,శ్రీ
హరికే జెల్లును యాపదన్ గడపగా, నన్యత్ర దుస్సాధ్యమే .
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ తిమ్మాజీరావు గారికి శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. మత్తేభము గురించి మత్తేభమును జెప్పిరి. అభినందనలు. కొన్ని సూచనలు:
1. దుస్సాధము అనవలెను. దుస్సాధ్యము కాదు.
2. కాపాడు కోవందగన్ అనుచోట వ్యావహారిక భాషను వాడిరి.
3. జెల్లును అనిన పిదప చివరలో ఉకారము ఉన్నది కావున యడాగమము రాదు. సంధి నిత్యము కదా.
స్వస్తి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికరి కరమును జాపగనే
రిప్లయితొలగించండిమరి మకరము పట్టి దాని మరి మరి లాగెన్
మరియొక గజేంద్ర మోక్షము
ధరలో కనుపించునేమొ తా హరి దిగునో !
చిక్కిన యేనుగు పిల్లా
రిప్లయితొలగించండిచిక్కితివా మొసలికిపుడు, చిక్కులు తొలగన్
మక్కువ గజేంద్ర మోక్షము
చక్కగనే తలచి హరిని స్మరియింపుమ ! హా !