10, మార్చి 2014, సోమవారం

సమస్యాపూరణం - 1347 (భర్తను వధియించ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
భర్తను వధియించ వనిత పరితోషించెన్.

16 కామెంట్‌లు:

 1. ధూర్తుండై జనకజ నపు
  డార్తికి గురిచేయువాని, నఘసంయుతు, దు
  ర్వర్తను, రాముడు రాక్షస
  భర్తను వధియించ వనిత పరితోషించెన్.

  రిప్లయితొలగించండి
 2. నర్తనము నందు ఘనుడట
  కర్తవ్యము మరచి సతిని గాసిలి బెట్టన్
  ఆర్తిగ రక్షణ కొఱకని
  భర్తను వధియించ వనిత పరితోషించెన్

  రిప్లయితొలగించండి
 3. ఆర్తిని మునిగిన జానకి
  కర్తవ్యము సలుప మదినె కాంతుని వేడన్
  ధూర్తునెరిగి, మండోదరి
  భర్తను వధియించ వనిత పరితోషించెన్.

  రిప్లయితొలగించండి
 4. కర్తవ్యము మఱచిన పతి
  ధూర్తుడు గా మారిమఱియు దోకాడిం చ
  న్నార్తిని మునుగుట కతనన
  భర్తను వధియించ వనిత పరితోషించెన్

  రిప్లయితొలగించండి
 5. వర్తన మంచిగ నుండిన
  భర్తను గని సంతసబడు వనిత, యతనే
  పూర్తిగ రాక్షసు డయితే
  భర్తను వధియించ వనిత పరితోషించెన్

  రిప్లయితొలగించండి
 6. హర్తగ మారి ఖలుండై
  భర్త తనసుతులను తనను బాధలు పెట్టన్
  కర్తవ్యము మరచిన నా
  భర్తను వధియింప వనిత పరితో షించెన్

  రిప్లయితొలగించండి
 7. మిత్రులారా! శుభాశీస్సులు.
  ఈ నాటి సమస్యకు పూరణలు చాల తక్కువగనే వచ్చినవి.
  అందరికి అభినందనలు.

  శ్రీ హరి వెంకట సత్యనారాయణ మూర్తి గారు:
  రావణ వధతో ప్రారంభించేరు. ప్రథమ తాంబూలము మీదే. పద్యము బాగుగ నున్నది.

  శ్రీమతి రాజేశ్వరి గారు:
  గాసిలి బెట్టే భర్తను ప్రస్తావించేరు. పద్యము బాగుగ నున్నది.

  శ్రీ భాగవతుల కృష్ణా రావు గారు: నమస్కారములు.
  మండోదరి భర్తను గూర్చి పద్యము చెప్పేరు. బాగుగ నున్నది.

  శ్రీ సుబ్బా రావు గారు:
  ధూర్తుడైన భర్తను గూర్చి చెప్పేరు. పద్యము బాగుగ నున్నది.

  శ్రీ పి.ఎస్.ఆర్.మూర్తి గారు:
  రాక్షసుడగు భర్తను గూర్చి చెప్పేరు. మీ పద్యమును ఈ విధముగ సవరించుచున్నాను:

  వర్తనము మంచిదగుచో
  భర్తను గని సంతసపడు వనిత, యతండే
  ........
  ........

  శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు:
  బాధలు వెట్టే భర్తను గురించి చెప్పేరు. పద్యము బాగుగ నున్నది.

  రిప్లయితొలగించండి
 8. పండిత నేమాని గారికి వందనములు
  నర్తనశాలకు వచ్చిన
  యార్తిని దీర్చెద నటంచు నాహవమ౦దున్
  ధూర్తుని విరటుని సేనా
  భర్తను వధియించ వనితపరితో షి౦చెన్

  రిప్లయితొలగించండి
 9. ధూర్తుండగు భర్త యెకడు
  హర్తగ మారి సతి సుతల నమ్మగ జూడన్
  కర్తవ్యముతో సుతుడా
  భర్తను వధియించ వనిత పరితోషించెన్.

  రిప్లయితొలగించండి
 10. శ్రీ నాగరాజు రవీందర్ గారు: శుభాశీస్సులు.
  రావణ వధను చెప్పిన మీ పూరణ బాగుగ నున్నది. అభినందనలు.

  శ్రీ తిమ్మాజీ రావు గారు: శుభాశీస్సులు.
  కీచక వధ ప్రస్తావనతో మీ పూరణ బాగుగ నున్నది. అభినందనలు.

  శ్రీ బొడ్డు శంకరయ్య గారు: శుభాశీస్సులు.
  ధూర్తుడగు వాని వధతో మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 11. ధూర్తుడు మూర్ఖుడు మరి చెడు
  వర్తన గల వాని పైకి వానర సఖుడై
  యార్తిని బాపగ లంకా
  భర్తను వధియించ వనిత పరితోషించెన్.

  రిప్లయితొలగించండి
 12. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు: శుభాశీస్సూ.
  మీ పూరణ "లంకా భర్తను వధియించి" అనుట చాల బాగుగ నున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. కర్తయు నాతడె, జగతికి
  భర్తయు నాతండె , యెఱిగి పాలించు, వెతల్
  తీర్తునని రణమున నసురభర్తను
  వధియించ వనిత పరితోషించెన్.

  రిప్లయితొలగించండి
 14. కర్తగ శ్రీహరి భక్తుని
  యార్తిని విని మకరి దునిమి హాయిని గొల్పన్
  వార్తను వినిముక్తి గొనిన
  భర్తను వధియించ వనిత పరితోషించెన్

  రిప్లయితొలగించండి
 15. కర్తలు కర్మలు క్రియలన్
  గుర్తించుచు వ్రాయుమనుచు కొట్టుచు చంపన్
  పూర్తిగ వ్యాకరణాసురు
  భర్తను వధియించ వనిత పరితోషించెన్

  రిప్లయితొలగించండి