3, మార్చి 2014, సోమవారం

పద్య రచన – 524

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

23 కామెంట్‌లు:

 1. సొగసు లీనుచు కనువిందు సుంద రాంగి
  రంభ యూర్వసి తలదన్ను రాణి వేమొ
  ఇంద్ర లోకము నందుండి నేరు గాను
  జనుల మురిపించి బ్రమియింప జాణ వైతి

  రిప్లయితొలగించండి


 2. పుడక ముక్కుకి అందం
  కొప్పు నీలవేణి బంధం
  జిమికీ కర్ణాబంధ చందం
  కనుదోయి కన్యానందం !!


  శుభోదయం
  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. శారద పూర్ణేందు సమసుందరాస్యంబు
  ....నీరజ పత్రాభ నేత్రయుగము
  తాళఫలము వోలె తనరుచుండెడి కొప్పు
  ....కొప్పులో చక్కని కువలయమ్ము
  పంచ సుమాస్త్రు చాపము బోలు కనుబొమల్
  ....సంపంగి పూవన జాలు ముక్కు
  పాటల రుచి మించి పరగెడు నధరాలు
  ....శ్రీకారములవంటి చెవుల జంట
  సహజ సౌందర్యమేకాక స్వర్ణ రత్న
  భూషణమ్ములు గలుగు నీ పొలతి యెవరొ
  అమరపురినుండి వచిన యప్సరసయొ
  చూచు వారల హృదయముల్ దోచుకొనును

  రిప్లయితొలగించండి
 4. నల్లని ముఖమేయైనను
  పిల్లది ముఖ సోయగమ్ము భేషని జడలో
  నల్లని కురులను నిలిచిన
  తెల్లని కలువేమొ తాను తెలతెల బోయెన్

  రిప్లయితొలగించండి
 5. ఇట్టి యతిలోక సుందరి యెక్క డైన
  నుండు నా నను ననుమాన మొదవె నాకు
  రంభ , యూ ర్వశి దలదన్ను రామ యీ మె
  అందమందున నంతటి యంద గత్తె

  రిప్లయితొలగించండి
 6. ముక్కెర మెరుపులు మోమున
  చిక్కని కురులందుకలువ చిందెను సొగసున్
  చెక్కిన శిల్పము తీరున
  చక్కగసింగారమొలుకు సఖినీ వెవరే!

  రిప్లయితొలగించండి
 7. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
  ================*===============
  వలపు వలయములను జిమ్ము వనిత జూపు లందునన్,
  కలువ కంటి కురుల మధ్య కవుల జూపు లెల్ల నా
  కలిని గొన్న పులుల వలెను కలహ మాడుచుండ,నా
  కలము నాట్యమాడు చుండె కాటుక కనులను గనన్!

  రిప్లయితొలగించండి
 8. రాజేశ్వరి అక్కయ్యా,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  మొదటి పాదంలో ‘కనువిందు’ శబ్దం అన్వయించడం లేదు. ఆ పాదాన్ని ‘సొగసు లీనుచు కనువిం దొసగు లలనవె’ అందామా?
  మూడవ పాదంలో యతిదోషం. ‘ఇంద్రలోకమ్మునందుండి యిలకు వచ్చి’ అనండి.
  *
  జిలేబీ గారూ,
  మీరు పెట్టిన బొమ్మ సైడ్ ఫోజులో ఇలాగే ఉంటుందా?
  *
  పండిత నేమాని వారూ,
  ‘చదువువారల హృదయముల్ ముదము నందు’ నట్టి సుందరపద్యాన్ని అందజేశారు. అభినందనలు, ధన్యవాదాలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ఉల్లమును మురిపింపజేసే పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  అందమైన పద్యం చెప్పారు. అభినందనలు.
  ‘ఉండునా యను’ అనండి.
  *
  శైలజ గారూ,
  ‘చక్కని పద్యము నుడివిన శైలజకు నుతుల్!’

  రిప్లయితొలగించండి
 9. కందుల వరప్రసాద్ గారూ,
  అమ్మాయి సౌందర్యం మీ కలాన్ని నాట్యమాడించిందంటారు. అందమైన పద్యాన్ని చెప్పారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. కోమలాంగి జూడ కుందనపు ప్రతిమ
  అందమందు తాను చంద మామ
  నల్లకేశములకు తెల్ల కలువ పూలు
  చక్కదనము తెచ్చె నిక్కముగను

  రిప్లయితొలగించండి
 11. కమలములను బోలు కన్నుల సొగసుతో
  చెక్కుటద్దములును, సిరిగల ముఖ
  మునకు వన్నె దెచ్చు ముక్కును, సుధచిందు
  నధరములును, గల్గు సుదతి గంటి

  రిప్లయితొలగించండి
 12. ముక్కెర మెరుపులు మోమున
  చిక్కని కురులందుకలువ చిందెను సొగసున్
  --------------------------
  sailaja గారూ మీ పద్యం చాలా బాగుంది.

  రిప్లయితొలగించండి
 13. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
  అభిసారిక
  సిగనుముడిచిన కలువయుసిగ్గువడగ
  కనుల నలదిన కాటుక కాంతులీన
  నాసికను బేసరి చెవినినాణ్య మైన
  లోలకులు చేయు సవ్వడి లీల వినుచు
  ప్రియుని రాక గోరు యభిసా రికవ!నీవు

  రిప్లయితొలగించండి
 14. గురువు గారు సరదాగా మరియొక పూరణ
  =============*============
  కనుల యందు బావము నను గాంచి కాళిదాసునై
  ఘన మగు కురుల సరము లను గాంచి దేవ దాసునై
  వెనుక దిరుగు చుంటి నేడు వెర్రి వేంగళప్పనై
  కనులు మూయు శక్తి లేక కంది పోతిని జెలియా!

  రిప్లయితొలగించండి
 15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 17. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
  *
  లక్కరాజు వారూ,
  ధన్యవాదాలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ ‘అభిసారిక’ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  కందుల వరప్రసాద్ గారూ,
  చెలిని సంబోధించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘భావములను గాంచి’ అన్నది టైపాటు వల్ల ‘బావము నను గాంచి’ అయినట్టుంది.

  రిప్లయితొలగించండి
 18. కురుల దువ్వి తీర్చి కుందన సిరులద్ది
  బొట్టు కాటుకమర పూవు ముడచి
  సొంపు లొసగ బెట్ట ఝకాలు, ముక్కెర
  నతివ మగడి కంటికద్భుతంబు!

  రిప్లయితొలగించండి
 19. సహదేవుడు గారూ,
  మంచి పద్యాన్ని చెప్పారు. అభినందనలు.
  ‘ఝుకాలు’ అన్నచోట గణదోషం. ‘జూకాలు’ సరియైన పదం. దానిని సవరిస్తే సరి!

  రిప్లయితొలగించండి
 20. శ్రీ లక్కరాజుగారికి ధన్యవాదములు..

  రిప్లయితొలగించండి
 21. ధన్యవాదములు గురువుగారు..మీ ప్రశంశ నాకు చాలా ఆనందం కల్గించింది..

  రిప్లయితొలగించండి
 22. గురుదేవుల సవరణకు ధన్యవాదాలు. సవరణతో పద్యం:

  కురుల దువ్వి తీర్చి కుందన సిరులద్ది
  బొట్టు కాటుకమర పూవు ముడచి
  సొంపు లొసగ బెట్ట, జూకాలు,ముక్కెర
  నతివ మగడి కంటికద్భుతంబు!

  రిప్లయితొలగించండి