రాజేశ్వరి అక్కయ్యా, కదళిని గురించి నాకు తెలియని కథను తెలియజేశారు. ధన్యవాదాలు. ‘కళత్ర’తో మొదటిపాదంలో, ‘సుషుప్తి’తో రెండవ పాదంలో గణదోషం... ఆ రెండు పాదాలకు నా సవరణ.... కదళి యనగ దుర్వాసుని గాదిలి యన సంధ్య వార్చగను సుషుప్తి సబవు కాదు . * "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ, శ్రీకరమైన కదళీఫలాన్ని గురించి చక్కని పద్యం చెప్పారు. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు. ‘కార్యమునకు’ అనాలి కదా. రెండవపాదంలో యతి తప్పింది. ఆ పాదానికి నా సవరణ....‘ఏ కార్యమ్మునకునైన నేనోమునకున్’ * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘లో’ ప్రత్యయాన్ని హ్రస్వాంతంగా వ్రాయరాదు. ‘కార్యమందు’ అనండి. * సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
శైలజ గారూ, మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు. తెలుగులో కదళి హ్రస్వాంతమే. కనుక అక్కడ ‘ఫలము కదళి కదా’ అనండి. ‘పులకించి తినెదరు గాదె’ అనండి. ‘మృదువుగ నుండని’ అనడం సరి.
అరటి పువ్వు కూర, యరటికాయలకూర అంటి చెట్టు క్రింద వంట మరియు నరటి విస్తరందు నారగింపు లరటి పండు పెరుగు తోడ, పాయసమున కైన నరటి దొప్ప, లరటి బజ్జీలహ హ! చిరుతిండి మాకు నగును నూనె లేని నాడు పళ్ళె లెస్స, యరటిలేక తిధి గడచునె కృష్ణ తీరమందు?
పండిత నేమాని వారూ, కదళీమాధుర్యాన్ని తెలిపే మధ్యాక్కరతో విందు చేశారు. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, కవితాపాకాలను రుచి చూపించారు మీ పద్యంలో. అభినందనలు. ‘ద్రాక్షాపాకము’ అనాలి కదా. * రామకృష్ణ గారూ, కృష్ణాతీరవాసులకు అరటి ఎంతగా ఇష్టమో, ఎన్ని రకాల ఉపయోగిస్తారో చక్కగా తెలిపారు. అభినందనలు. * కందుల వరప్రసాద్ గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు. * సహదేవుడు గారూ, మీ పద్యం బాగుంది. ఆభినందనలు. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు.
పండిత నేమాని వారూ, కదళీమాధుర్యాన్ని తెలిపే మధ్యాక్కరతో విందు చేశారు. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, కవితాపాకాలను రుచి చూపించారు మీ పద్యంలో. అభినందనలు. ‘ద్రాక్షాపాకము’ అనాలి కదా. * రామకృష్ణ గారూ, కృష్ణాతీరవాసులకు అరటి ఎంతగా ఇష్టమో, ఎన్ని రకాల ఉపయోగిస్తారో చక్కగా తెలిపారు. అభినందనలు. * కందుల వరప్రసాద్ గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు. * సహదేవుడు గారూ, మీ పద్యం బాగుంది. ఆభినందనలు. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు.
కదళి యనగను దుర్వాసు కళత్ర మనగ
రిప్లయితొలగించండిసంధ్య వార్చగ సుషుప్తి సబవు కాదు
జాగృతుని జేయ రుద్రుడై శాప మిడెను
కదళి వైనీవు శుభముల గణన కెక్కు
పాకమునన్ మధ్యస్థం,
రిప్లయితొలగించండిబాకలి తీర్చుటను ముందు, మహిపూజలలో
నీ కదళీఫలమే సతతము
శ్రీకరమైచెన్నుమీరు! సిరి స్వస్థతకున్!!
రిప్లయితొలగించండిఈ కదళీ ఫలములు గన
నేకార్యముకైన నెట్టి నోమునకైనన్
శ్రీకరమగు , రుచికరమగు
నాకటికిని తినెడు వేళ నారోగ్యమిడున్.
కమ్మని రుచి గలిగి కదళీ ఫలమ్ములు
రిప్లయితొలగించండిశక్తినిచ్చి నీరసమ్ము బాపు
పుణ్యకార్యములలొ ముఖ్యమైనఫలము
చేసినారు బుధులు చింతచేసి
రిప్లయితొలగించండిఆ ఱు సంఖ్యన గలయట్టి యరటి పండ్లు
పసుపు వర్ణము తోడన బరగు చుండి
మెరయు చున్నవి చూడుడు ,మీరు కూడ
రండి తినుటకు మఱి మీరు రయము గాను
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండికదళిని గురించి నాకు తెలియని కథను తెలియజేశారు. ధన్యవాదాలు.
‘కళత్ర’తో మొదటిపాదంలో, ‘సుషుప్తి’తో రెండవ పాదంలో గణదోషం... ఆ రెండు పాదాలకు నా సవరణ....
కదళి యనగ దుర్వాసుని గాదిలి యన
సంధ్య వార్చగను సుషుప్తి సబవు కాదు .
*
"అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
శ్రీకరమైన కదళీఫలాన్ని గురించి చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
‘కార్యమునకు’ అనాలి కదా. రెండవపాదంలో యతి తప్పింది. ఆ పాదానికి నా సవరణ....‘ఏ కార్యమ్మునకునైన నేనోమునకున్’
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘లో’ ప్రత్యయాన్ని హ్రస్వాంతంగా వ్రాయరాదు. ‘కార్యమందు’ అనండి.
*
సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
ఫలములలోకెల్లఘనము
రిప్లయితొలగించండిపలురకములమేలుచేయు ఫలమే కదళీ
సులువుగ తినగలుగు ఫలము
పులకించుచు తినునుగాదె వృద్దులు పాపల్
మధురము గాలేనిమధువు
రిప్లయితొలగించండిమధనము లేనట్టిహృదియు మాతయు లేకన్
మృదువుగయుండని వెన్నయు
కదళీపలమిడనిపూజ గలవే మహిలో
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
తెలుగులో కదళి హ్రస్వాంతమే. కనుక అక్కడ ‘ఫలము కదళి కదా’ అనండి. ‘పులకించి తినెదరు గాదె’ అనండి. ‘మృదువుగ నుండని’ అనడం సరి.
నాగరాజు రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
మాస్టరు గారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమీరు చూపిన సవరణతో...
ఈ కదళీ ఫలములు గన
నేకార్యమ్మునకునైన నేనోమునకున్
శ్రీకరమగు , రుచికరమగు
నాకటికిని తినెడు వేళ నారోగ్యమిడున్.
మధ్యాకర:
రిప్లయితొలగించండిఅందరు మెచ్చెడు పండు అందమ్ము లొల్కెడు పండు
విందులు గూర్చెడు పండు వివిధ రుచుల నిచ్చు పండు
సందడుల్ నింపెడు పండు జనుల ఆకలి దీర్చు పండు
అందుకో అమృత బాణీలో ఔర! కర్పూర కేళీలొ
నారికేళమనుచు పరువిడు చదువరి
రిప్లయితొలగించండిద్రాక్షపాకమనిన తక్కువనిన
కావ్యరంగమందు కదళి వినుతికెక్కి
కవుల గరిమ తెలిపి గరిమనందు.
శ్రీమతి లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
మొదటి పాదములో ప్రాస యతి పాటింపబడ లేదు. సవరించండి.
స్వస్తి.
ధన్యవాదాలండి తప్పు సూచించినందుకు.
రిప్లయితొలగించండిసవరించిన పద్యము
నారికేళమనుచు భీరత్వమందిన,
ద్రాక్షపాకముఁ గని తక్కువనిన,
పఠిత విలువ పెంచి పాండితి గరిమను
కావ్యరంగమందు కదళిచాటె.
అరటి పువ్వు కూర, యరటికాయలకూర
రిప్లయితొలగించండిఅంటి చెట్టు క్రింద వంట మరియు
నరటి విస్తరందు నారగింపు లరటి
పండు పెరుగు తోడ, పాయసమున
కైన నరటి దొప్ప, లరటి బజ్జీలహ
హ! చిరుతిండి మాకు నగును నూనె
లేని నాడు పళ్ళె లెస్స, యరటిలేక
తిధి గడచునె కృష్ణ తీరమందు?
శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమానిగురుదేవులకు పాదాభివందనములతో
రిప్లయితొలగించండి=============*====================
పసిడి జతను చిందులు వేయు పండు వమ్మ
పండగ దినములందున వగలుబోక
బక్కవారి యాకలి దీర్చుపండు వమ్మ
ప్రణతి యందు జనకుడగు బ్రహ్మకమ్మ!
అరటి పండు జూడ నారగించగ దోచు
రిప్లయితొలగించండితోలు పలచి తినిన మేలు జేయు
మంచి వాని చెలిమి మహిననీలాగురా
పెద్ద వారి మాట సద్ది మూట!
విందు భోజనమే పెట్టేసిన రామకృష్ణ గారికి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమరి పేర్లు చెప్పినది మీరైతే వండినదెవరో?
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిఆకలినిదీర్చచాలు రెండరటి పండ్లు
పేద ప్రజలకై నవి యెయాపిలు ఫలములు
లవణ శర్కర విటమిను లవసరమగు
పోషకమ్ములు గలవు సంపూర్ణముగను
ధరలు ఆకసమoటునీతరుణ మందు
పెరుగు పోయుము పచ్చని అరటిపండు
తెమ్ము తెమ్మని భర్త వేధింపు చుండ
వినిన యజమాని దాసుని గనుచు బలికె
‘తగదు నీవిటు బల్క కదళి ఫలములు
పెరుగు తెమ్మన ధరలన్ని పెరిగె నుగద
యనగ “ ఫచ్చి మిర్చీయె మా అరటి పండు ,
గంజి నీళ్ళుయే మాపెరుగంచు బలికె”
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండికదళీమాధుర్యాన్ని తెలిపే మధ్యాక్కరతో విందు చేశారు. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
కవితాపాకాలను రుచి చూపించారు మీ పద్యంలో. అభినందనలు.
‘ద్రాక్షాపాకము’ అనాలి కదా.
*
రామకృష్ణ గారూ,
కృష్ణాతీరవాసులకు అరటి ఎంతగా ఇష్టమో, ఎన్ని రకాల ఉపయోగిస్తారో చక్కగా తెలిపారు. అభినందనలు.
*
కందుల వరప్రసాద్ గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. ఆభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండికదళీమాధుర్యాన్ని తెలిపే మధ్యాక్కరతో విందు చేశారు. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
కవితాపాకాలను రుచి చూపించారు మీ పద్యంలో. అభినందనలు.
‘ద్రాక్షాపాకము’ అనాలి కదా.
*
రామకృష్ణ గారూ,
కృష్ణాతీరవాసులకు అరటి ఎంతగా ఇష్టమో, ఎన్ని రకాల ఉపయోగిస్తారో చక్కగా తెలిపారు. అభినందనలు.
*
కందుల వరప్రసాద్ గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. ఆభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
గురువుగారు, ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిసవరించిన పద్యము
నారికేళమనుచు భీరత్వమందిన,
ద్రాక్ష పండ్ల రసము తక్కువనిన,
పఠిత విలువ పెంచి పాండితి గరిమను
కావ్యరంగమందు కదళిచాటె.