అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘మళ్ళీ’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. అక్కడ ‘పెల్లున కోయిల గళములు..." అందాం. * మంద పీతాంబర్ గారూ, మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు. * సహదేవుడు గారూ, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణమైన మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు. * భాగవతుల కృష్ణారావు గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. * పండిత నేమాని వారూ, మీరు తాజాగా వ్రాసిన రెండు పూరణలూ ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. * నాగరాజు రవీందర్ గారూ, సుందరమైన పూరణ మీది. అభినందనలు.
తెల్లని పూవులు పూచెను
రిప్లయితొలగించండిమల్లియతీవియకు; కాచె మామిడికాయల్
కొల్లలుగ చైత్రమందున
నెల్లర ముదమందఁజేయ నీ పండుగకున్.
శ్రీ శంకరయ్య గారి పద్యము భలా! అభినందనలు.
రిప్లయితొలగించండిచెల్లీ! చూచితె పూవులు
మల్లియ తీవియకు, గాచె మామిడి కాయల్
కొల్లలుగా నా ప్రక్కనె
యల్లవిగో భూజమునకు నబ్బురము కదా!
మల్లెలు పూచెను ఘుమ్మని
రిప్లయితొలగించండిమల్లియతీవియకు, గాచె మామిడి కాయల్
కొల్లలుగతోట లందున
నుల్లంబులు సంతసిల్ల యూరించెనుగా
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీనేమాని గురుదేవులకు
రిప్లయితొలగించండినీ శిష్య పరమాణువు వినమ్రవందనములతో.
సరదాగా
==========*===============
అల్లరి కృష్ణుని గుడిలో
మల్లియతీవియకు కాచె మామిడికాయల్
మెల్లగ గోయగ వాటిని
మల్లె సుమముల వలె వేగ మారెను జెలియా(చెల్లీ)!
వెల్లని పువ్వులు బూచెను
రిప్లయితొలగించండిమల్లియ తీవియకుఁ, గాచె మామిడి కాయల్
నల్లని కోయిల కూతలు
మెల్లగవినబడుచునిచ్చె, మిక్కిలి ముదమున్
లల్లీ చూడుము పూలను
రిప్లయితొలగించండిమల్లియ తీ వియకు, గాచె మామిడి కాయల్
మల్లేశుని వృక్షమునకు
కొల్లలుగా జూడు డా ర్య !కూరిమి తోడన్
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘సంతసిల్ల నూరించెనుగా’ అనండి.
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
కందుల వరప్రసాద్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
తెల్లని పూవులు పూచెను
రిప్లయితొలగించండిమల్లియ తీవియకుఁ, గాచె మామిడి కాయల్
మళ్ళీ, కోయిల గళములు
నల్లన వినిపించియొసగె మెండగు ముదమున్
అల్లరి పిల్లడ యెక్కడ
రిప్లయితొలగించండిమల్లియ తీవియకుగాచె మామిడికాయల్ ?
పుల్లారవింద లోచన
కల్లలువ్రాయంగనీకు కరువౌగుణముల్ !!!
(పరీక్షలో తప్పుగా వ్రాసిన విద్యార్థిని ఉద్దేశిస్తూ గురువుగారు చెప్పిన సందర్భం )
ఎల్లరి బాగును గోరెడు
రిప్లయితొలగించండిచల్లని ప్రభువని దలంప జాలి మరచి మా
యెల్లలు మార్చ నుగాదికి
మల్లియ తీవియకుఁ, గాచె మామిడి కాయల్
(రాష్ట్రవిభజన దృష్ట్యా,తెల్లని పూవులు పూయల్సిన మల్లెతీవియకు వగరు మీమిడి కాయలు కాచాయను భావంతో )
పిల్లలు జూడన్ మంత్రపు
రిప్లయితొలగించండిజల్లులవెదజల్లి నింద్రజాలికుడనియెన్
మెల్లిగ నబ్రక దబ్రా
మల్లియ తీవియకుఁగాచె మామిడి కాయల్!!!
ఉల్లము రంజిల మల్లెలు
రిప్లయితొలగించండిమల్లియతీవియకుఁ గాచె ; మామిడికాయల్
కొల్లలుగా తొడిగే ననుచు
పిల్లలు చెట్లెక్కి తినిరి పింజ లుగాదిన్
మల్లీశ్వరి ప్రసవించెను
రిప్లయితొలగించండిపిల్లల కవ గనెను కనుల విందు గొలుపు నా
పిల్లల గని యని రాప్తులు
మల్లియ తీవియకు గాచె మామిడి కాయల్
కల్లల నాడుట యెరుగని
మల్లన్నయె సాక్షి కాగ మాట తడబడెన్
ఝల్లుమన గుండె యతడనె
మల్లియ తీవియకు గాచె మామిడి కాయల్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
‘మళ్ళీ’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. అక్కడ ‘పెల్లున కోయిల గళములు..." అందాం.
*
మంద పీతాంబర్ గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణమైన మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
*
భాగవతుల కృష్ణారావు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
మీరు తాజాగా వ్రాసిన రెండు పూరణలూ ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
సుందరమైన పూరణ మీది. అభినందనలు.
అల్లన నడచుచు దిరిగెడి
రిప్లయితొలగించండినల్లని కన్నయ్య మొలను నాణెముగానే
అల్లిక బంగరు త్రాడది
మల్లియ తీవియకుగాచె మామిడికాయల్
రిప్లయితొలగించండిచిన్న సవరణతో...
అల్లన నడచుచు దిరిగెడి
నల్లని కన్నయ్య మొలను నాణెముగానే
అల్లిన బంగరు త్రాడది
మల్లియ తీవియకుగాచె మామిడికాయల్
గోలి హనమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
అల్లదిగో మామిడి పై
రిప్లయితొలగించండినల్లుకొనిన తీవమల్లి; యయ్యారే నీ
యల్లరి యూహలు భళిభళి!
మల్లియతీవియకుఁ గాచె మామిడికాయల్.
నల్లని కొండల పాఱెడు
రిప్లయితొలగించండిచల్లని నీటి కెరటముల సాగినదదిగో
తెల్లని గుఱ్ఱము సౌరుల
వెల్లడి చేయగ పదములు విరళంబయ్యెన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅల్లరి లవకుశు లిరువురు
తొలగించండిపిల్లలు జన్మించి రింతి పేరిమి వరమై;
వల్లియలారా! కనురిట,
మల్లియతీవియకుఁ గాచె మామిడికాయల్!
రిప్లయితొలగించండిఅల్లుకొనగ పిరియముగా
మల్లియతీవియకుఁ గాచె మామిడికాయల్
మెల్లన విడివడి యుల్లము
జల్లన మధురిమలతోడ చక్కగ యెదిగెన్ !
జిలేబి