11, మార్చి 2014, మంగళవారం

పద్య రచన – 532

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:


 1. భక్తుని ప్రతి రూపం భగవంతుడు
  అని ఎక్కడో చదివితే ఏమిటో ననుకున్నా !
  ఇప్పుడే తెలిసింది సిక్స్ పేక్ భగవంతుడు
  ఇట్లా ఉంటాడని - భక్తుని ప్రతి రూపంగా !


  శుభోదయం
  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. మణిభూషితుడై వెలుగుచు
  నణిమాదుల నొసగదగిన యహిసత్తముడై
  గణపతి కాత్మీయుండౌ
  ఫణిరాజున కందజేతు ప్రణతుల నిపుడున్. 1.

  మము మన్నించుము ఫణిపతి!
  క్షమతోడను కాచుచుండి కరుణావార్ధీ!
  విమలాంతరంగ! దయతో
  మమతను గురిపించవయ్య మహిలో నెపుడున్. 2.

  క్షీరంబు భక్తితోడను
  చేరుచు నీచెంత కెపుడు స్థిరచిత్తముతో
  తోరముగ నొసగుచుండెడు
  వారిన్ కరుణించ వలయు పరమప్రీతిన్. 3.

  క్రోధంబు చూపవల దిక
  బాధించగ బూనవలదు పలురకములుగా
  సాధించ వలదు మమ్మెపు
  డాధికి గురిచేయవలవదహిపతి నీవున్. 4.

  లోకములగాచుచుండెడి
  శ్రీకంఠుని హారమౌచు స్థిరయశములతో
  లోకంబుల విహరించెడి
  నీకొసగెద ప్రణతిశతము నిష్ఠాత్ముడనై 5.

  రిప్లయితొలగించండి
 3. శిరమున వెలిగెడు మణితో
  జురుకుగ కదలెడు ఫణిపతి జూడుము దయతో
  హరునికి హారమ్మగుఘన
  వరదుడవగు నాగరాజ ప్రణతులు నీకున్

  రిప్లయితొలగించండి
 4. పడగ లారు కలుగు ఫణిని జూ డగ రండు
  చిత్ర మందు గలదు చిత్రముగను
  ప్రణతు లిడుదు నీకు పాప రేడ ! శతము
  కనిక రంబు జూపు , గసరు కొనకు

  రిప్లయితొలగించండి
 5. శివుని మెడలో వసించగ
  భవనాశనమయ్యె నాగ ప్రభువా నీకున్
  శివదేవుని కరుణామృత
  మవ పోశనణ బట్ట నీవు నమరుడవయ్యా!

  రిప్లయితొలగించండి
 6. నేరము లెంచక దయతో
  గోరసమును గ్రోలుమయ్య కోపించకుమా
  కోరిన వరదుడ వనుచును
  భూరిగ పూజించు నిన్ను భువిలో జనులున్

  రిప్లయితొలగించండి
 7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 9. శిరమున పడగల మణులున్
  కరముల శూలమ్ముధనువు గదనే దాల్చన్
  మెరిసెడు ఖడ్గము బూనిన
  వరదుడ ఫణిపతినిగొలిచి వందన మనరే!

  రిప్లయితొలగించండి
 10. మిత్రులారా! శుభాశీస్సులు.
  నాగరాజు గూర్చి ఈనాడు వచ్చిన పూరణలును బాగుగ నున్నవి. అందరికి అభినందనలు.

  శ్రీ హరి వెంకట సత్యనారాయణ మూర్తి గారు:
  మణిభూషితుడగు ఫణిరాజు గూర్చి చక్కని ఖండికను వ్రాసేరు. చాల బాగుగ నున్నది.

  శ్రీమతి శైలజ గారు:
  మీరు కూడా ఖండికలను బోలిన రచనలు కావించు చున్నారు. మీ 3 పద్యములును బాగుగ నున్నవి.

  శ్రీ సుబ్బా రావు గారు:
  పాపరేనిని గూర్చిన మీ ప్రార్థన బాగుగ నున్నది.

  శ్రీ సహదేవుడు గారు:
  నాగ ప్రభువు గూర్చిన మీ పద్యము బాగుగ నున్నది.

  రిప్లయితొలగించండి
 11. భువిని పంటలతిను మూషికముల బట్టి
  రైతుసేవ జేయు రత్న మతడు
  నాగుల చవితి యని నామమిడ బుధులు
  పూజ చలుపు చుండ్రి ముదము తోడ

  రిప్లయితొలగించండి
 12. భవు దివ్య దేహాన ప్రాకుచు నాడెడు
  ....నాగరాజా! నీకు నతులు గొనుము
  శ్రీహరి పాన్పువై సేవించి తరియించు
  ....ఫణిరాజ! నీకివే వందనములు
  భూ మండలము నెల్ల మ్రోయుదు వోర్పుతో
  ....నాది శేషా! యిదే పాద పూజ
  తారకు జంప కుమారుడ వైనట్టి
  ....కార్తికేయా! నీకు కరము నుతులు

  వేయి పడగల స్వామి! వినాయక హిత!
  రాఘవానుజ!బలరామ రమ్యరూప!
  చిన్ని కృష్ణుని పాదాల శీర్షమందు
  దాల్చి తరియించి నావయ్య తనివి దీర.

  రిప్లయితొలగించండి
 13. భూభారమంతయు పువుగుత్తివలె నీవు
  భరియుంచు వానివై ప్రణతి గొనుచు
  బుసిరాజు వని నిన్నుఁ బూజించు నాదైన
  పుట్టింటి వారల పూజఁ గొనుచు
  మాయింటి దైవమ్ము మల్లేశుని గళము
  వీడక నిత్యమ్ము పేర్మి నిలుచు
  స్వామివి నీవంచు స్మరియింతు నిన్నెప్డు
  దీవించుమో యయ్య! తృప్తిఁ దీర

  గా ఫణీంద్ర! మాకు కరుణతోనెవ్వేళ
  చల్లదైన చూపు శాంతి నొసగ
  నెల్లవేళలందు నింపుగ సారించు!
  నాగరాజ! నిలుపు నమ్మకమ్ము.

  రిప్లయితొలగించండి
 14. ఐదు పడగలు హస్తము లారు కలిగి
  ఖడ్గము, త్రిశూలము, గద, శంఖము, ధనుస్సు
  పట్టుకొని సింహ పీఠము వద్దనిలిచి
  సర్పరాజము మనకు దర్శనమునిచ్చె

  రిప్లయితొలగించండి
 15. శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డిగారు: శుభాశీస్సులు.
  ఎలుకల బారినుండి పంటలను కాచెడి నాగులను గురించి మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.

  శ్రీ మిస్సన్న గారు: శుభాశీస్సులు.
  ఆదిశేషుని నుండి ఎందరో నాగరాజులను వర్ణించిన మీ పద్యము మనోహరముగా నున్నది. అభినందనలు.

  శ్రీమతి లక్ష్మీ దేవి గారు: శుభాశీస్సులు.
  మీ ఇలవేలుపులైన నాగరాజుల గూర్చి మీరు చెప్పిన పద్యము అలరించుచున్నది. అభినందనలు.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 16. శ్రీ బొడ్డు శంకరయ్య గారు: శుభాశీస్సులు.
  5 పడగల సర్పరాజును గురించి మీరు చెప్పిన పద్యము బాగుగ నున్నది. అభినందనలు.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి