పండిత నేమాని వారూ, అద్భుతమైన మేలుకొలుపు పద్యాలతో ఈ రోజు నిజంగా సుప్రభాతాన్ని చేశారు. అభినందనలు, ధన్యవాదాలు. ‘శుకములు + ఆలపించు’ అని విసంధిగా వ్రాశారు. అక్కడ ‘శుకపికశారిక/ లాలపించుచుండె’ అంటే ఎలా ఉంటుంది?
శ్రీ శంకరయ్య గారికి శుభాశీస్సులు. నా పద్యములో పికములు శుకములు నాలపించుచుండె అనినా సరిపోతుంది. పాదము మారిన చోట విసంధిగా వదిలివేసితిని. పిక శుక శారికలనుట కూడా మంచిదే. ఆలాగుననే అందాము. స్వస్తి.
కందుల వరప్రసాద్ గారూ, ఎప్పుడూ వినని లాలిపాటను బ్లాగు ద్వారా పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. అష్టమహిషుల పరిచర్యలతో పదహారు వేల మందిని అలరించిన శ్రీకృష్ణునిపై లాలి పాట అద్భుతంగా ఉంది. పాట చివర ‘రామదాసు’ అన్న ముద్ర ఉంది. అలా అని ఇది కంచెర్ల గోపన్న రచన కాదు. అతని కీర్తనలలో ‘రామదాసు’ అన్న ముద్ర ఉండదు. దశావతారాలను ప్రస్తావిస్తూ మీ మేలుకొలుపు సీసమాలిక బాగుంది. అభినందనలు. వటుని రూపమునందు వైరిని.... ‘బ్రోవగా’ అని ఉండాలనుకుంటాను. ‘నీల నీలంబుద’ను ‘నీలమేఘశ్యామ’ అనండి. ‘దైత్యుల’ అన్నచోట గణదోషం. ‘దైత్యులను’ అంటే సరి. ఎత్తుగీతిలో ‘సమయాయె’ ?.... అక్కడ ‘లీల సల్పు సమయ మాయె’ అనండి. ‘తిలక’ అన్నచోట గణదోషం. ‘తిలకమా’ అనండి. ‘సతి హిత’ కంటే ‘సన్నుత’ అంటే బాగుంటుందేమో? * పియెస్సార్ మూర్తి గారూ, కన్మోడ్పు లోపించిన కృష్ణుని రూపాన్ని వర్ణిస్తూ చక్కని పద్యాన్ని చెప్పారు. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, కనులకు కమనీయమైన పద్యాన్ని చెప్పారు. అభినందనలు. * హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ, ‘బాలుపగిది మారి లీలజూపి యోగనిద్రబోవు’ కృష్ణుని స్తుతి పద్యాలు హృదయాహ్లాదాన్ని కలిగించాయి. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘యోగి వర్యు/ డుట్టిపడుచుండె’ అనండి.
వరప్రసాద్ గారూ, మీరు సంతోషంగా ఆ పాటలను వ్యాఖ్యలుగా బ్లాగులో పెట్టవచ్చు. మరి ‘గోకుల మందు పెట్టుచున్నాను’ అన్నారు. అది బ్లాగా? అందులో పెట్టిన తర్వాత మళ్ళీ ఈ బ్లాగులో ఎందుకు? తెలియజేయండి. * సహదేవుడు గారూ, మంచి భావంతో చక్కని పద్యాన్ని చెప్పారు. అభినందనలు. టైపాట్లు ఉన్నాయి!
జరిగిన తప్పుకు బాధ పడు చున్నాను. టైపు తప్పు వలన ఒక రాక్షసి పేరు గొప్ప కవిగారి పేరుగా మారింది. తమరి సవరణకు మరొక సారి ధన్యవాదాలు తెలియ జేయు చున్నాను. చిన్ని కృష్ణయ్య శయనించె చెన్నుగాను ముద్దుమోముపై వెలుగులు పొంగిపొరలె పూతనన్ జంప తానిప్డు పొంచి యుండె? వెన్న దొంగిలింపంగను వేచి యుండె? చిన్ని కృష్ణయ్య లీలల నెన్న తరమె?
కనులు మూయు నెడల కలుగుచు ప్రళయమ్ము
రిప్లయితొలగించండికనులు తెరచుచో జగమ్ము లలరు
చుండు టెవని లీలయో నట్టి వేలుపు
యోగనిద్రలోన నుండె నేమొ?
శ్రీకరాంగ! సకల లోకాధినాయకా!
రిప్లయితొలగించండితెల్లవార వచ్చె దివ్యతేజ!
అరుణ కిరణ కాంతులలరారు చుండెను
మేలుకొమ్ము లెమ్ము బాలకృష్ణ!
పద్మబాంధవునకు స్వాగతమ్మును బల్కు
వేడ్కతోడ సరసి బిసరుహములు
వేయి కనుల తోడ వేచి చూచుచునుండె
మేలుకొమ్ము లెమ్ము బాలకృష్ణ!
గొల్ల సతులు మేలుకొని ముగించి పనులు
చల్ల ద్రిప్పుచున్న చప్పుడులవె
వినగనయ్యె నయ్య! వీనుల విందుగా
మేలుకొమ్ము లెమ్ము బాలకృష్ణ!
యమునలోన స్నానమాడిన భూజనుల్
సంజె వార్చి జలజ సఖుని కొరకు
ప్రణతులిడుచు నుండి రాదర మొప్పగా
మేలుకొమ్ము లెమ్ము బాలకృష్ణ!
నీదు వేణురవము నెమ్మది వినువేడ్క
గోప బృందములును గోగణములు
వేచియుండె నయ్య! బృందావనానంద!
మేలుకొమ్ము లెమ్ము బాలకృష్ణ!
కన్నె పిల్ల లిండ్లకడ జల్లి కళ్ళాపు
వన్నెలలరు రంగవల్లు లెన్నొ
పెట్టు చుండిరి కనువిందుగా సుందరా!
మేలుకొమ్ము లెమ్ము బాలకృష్ణ!
ఆలయమ్ములందు నర్చక బృందముల్
సుప్రభాత వేళ స్తోత్రములను
పాడుచుండిరయ్య! భక్తి భావమ్ముతో
మేలుకొమ్ము లెమ్ము బాలకృష్ణ!
పెరటి తోటలందు పికములు శుకములు
ఆలపించుచుండె నద్భుతముగ
సుప్రభాత గీతి సొంపుగ నాడుచు
మేలుకొమ్ము లెమ్ము బాలకృష్ణ!
జయము జయము సాధు సంఘ పరిత్రాత!
జయము జయము దుష్ట జన వినాశ!
జయము జయము ధర్మ సంరక్షణాశయ!
జయము బాలకృష్ణ! జయము జయము
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిఅద్భుతమైన మేలుకొలుపు పద్యాలతో ఈ రోజు నిజంగా సుప్రభాతాన్ని చేశారు. అభినందనలు, ధన్యవాదాలు.
‘శుకములు + ఆలపించు’ అని విసంధిగా వ్రాశారు. అక్కడ ‘శుకపికశారిక/ లాలపించుచుండె’ అంటే ఎలా ఉంటుంది?
ప్రణామములు గురువుగారు..భాలకృష్ణుని సుప్రభాతము
రిప్లయితొలగించండిమనోజ్ఞంగా రచించారు.
శ్రీ నేమాని ,శ్రీ శంకరయ్య గురువులకు వందనములు...
రిప్లయితొలగించండి.
ముక్తి సందాయక ! హరి ! సద్భక్త వరద !
కోరి రక్షించితివి గద ! గోకులమును ,
మేలుకొని రమ్ము ! కరుణ ఁ మమ్మేలు కొనుమ !
లీలఁజూపించి గావుము బాలకృష్ణ !
శ్రీ యెర్రాజి జయసారథి గారూ,
రిప్లయితొలగించండిబాలకృష్ణునిపై చక్కని పద్యాన్ని రచించారు. అభినందనలు.
‘కరుణ మమ్మేలు’ అన్నప్పుడు అరసున్నా అవసరం లేదు.
శ్రీ నేమాని గురుదేవుల భాలకృష్ణుని మేలుకొలుపు మనోజ్ఞంగానున్నది.
రిప్లయితొలగించండిశ్రీ పాండురంగ భక్తి కీర్తనలు పుస్తకము లోని లాలి పాట. నాకు దొరకినది బ్లాగున పెట్టు చుంటిని, తప్పులున్న గరుదేవులను సవరించ ప్రార్థన.
==============*================
ప:లాలి శ్రీజన లోల లీలా వినోదా!లాలి శ్రీద్వారకా బాల గోపాలా!!లా!1
మిశిమి మించిన మంచి పసిడి గొలుసులును! పొసగ వజ్రాలతో పొందు పరచగను!
అసమాన తొట్టిలో కుసురు పాన్పునను!భస్మాపు టేదరు బాలీశు లోను!!లా!!
అందముగ జాంబవతి చందనము పూయ!పొందుగా కాళింది పూవు లందీయ!యిందు ముఖి లక్షణా వింజామ రేయ!!లా!!
మిత్ర విందయు చాల అత్తరవు పూయ!సత్య భామయు మంచి జవ్వాది పూయ!భద్ర నీ టుగ నిలువు టద్ద మందీయ!సుగంధి సొగసుగా సుర టీలు వేయ!!లా!!
పద హారు వేల గోప స్త్రీల చాలా!మోదమున నేలితివి మదన గోపాలా!కందర్ప సుందరా కవిజనా పాలా!నంద నందన స్వామి నన్నేల వేలా!!లా!!
కోటి సూర్యుల కాంతి కొమ రొప్ప గాను!పట్టింపు దేవితో పవళించ గాను!చుట్టు గోప స్త్రీలు తొట్టె నూచగను!కోరి రామ దాసు కోర్కె లొసగ గను!!లా!!
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
రిప్లయితొలగించండిశ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో.
==============*================
చోర సోమకుడను జేరి గూల్చిన దేవ!మేలుకో వయ్య మమ్మేలు కొనుము!
కూర్మ రూపము నందు కోర్కెలెల్లను దీర్చి! మేలుకోవయ్య మమ్మేలు కొనుము!
మేటి వరాహమై మీరు వారిని గూల్చి!మేలుకో వయ్య మమ్మేలు కొనుము!
నారసింహుడవయి వైరి తతిని గూల్చి!మేలుకో వయ్య మమ్మేలు కొనుము!
వటుని రూపము నందు వైరిని బ్రోయగా!మేలుకో వయ్య మమ్మేలు కొనుము!
పరశు తోడను ద్రుంచి బలుమార్లు పాపుల! మేలుకో వయ్య మమ్మేలు కొనుము!
నీల నీలంబుద!జాల మేలను రామ!మేలుకో వయ్య మమ్మేలు కొనుము!
దుష్ట రాక్షసులను ద్రుంచిన గోపాల!మేలుకో వయ్య మమ్మేలు కొనుము!
పుర దైత్యుల మార్చు బుద్దావతారుడ!మేలుకో వయ్య మమ్మేలు కొనుము!
కలికాలమున వచ్చు కలికి రూపుడ దేవ!మేలుకో వయ్య మమ్మేలు కొనుము!
లీల సల్పెడు సమయాయె మేలు కొనుము!
మేలు యదు వంశ తిలక మేలు కొనుము!
మేలుకో భక్త పాలనా మేలు కొనుము!
ఫాల లోచన సతి హిత మేలు కొనుము!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిలోకరక్షణలోన లోపించె కన్మోడ్పు
రిప్లయితొలగించండిఅలపు తీర నీకు సమయమేది?
మోముజూడ నీదు ముద్దుగారుచునుండె
పవ్వళించు తండ్రి పసిడి కూన
గురువుగారు,
రిప్లయితొలగించండిచిన్ని కృష్ణుని సుప్రభాతం మనోహరంగా ఉన్నది.
కనులను మూయకుండ మముఁ గాచెడు కృష్ణమనోహరా! నమో!
కనులను మూసియుంచి మము గారడి చేసెడు పాపవైతివో!
కనులను మూయువేళ నిను కమ్మని పేరున పిల్చు భాగ్యమున్
కనులను నిండుగా కరుణ క్రమ్మగ దీవన లిచ్చి బ్రోవుమా!
శ్రీ నేమాని పండితార్యుల మేలుకొలుపులు మనోహరముగా నున్నవి. నమస్కారములు.
రిప్లయితొలగించండిఅన్నివేళలందు నత్యంత వాత్సల్య
పూర్ణ మానసమున పుడమి జనుల
గాచునట్టి దేవ! కంసారి! కేశవా!
నిద్రనున్న కృష్ణ! నిన్ను గొలుతు. 1.
పొట్టలోన సకల భువనంబులం దాచి
చిన్నవాడ వౌచు నెన్నదగిన
మహిమలెన్నొ చూపి మముగావగా బూను
చిన్ని కృష్ణ! నీకు చేతునతులు. 2.
క్రోధమేల మీకు? బాధచెందగనేల?
శాంతమూని మనుడు జనులటంచు
తెలుపగోరి యిట్లు స్థిరమానసంబుతో
నిద్రబోవు కృష్ణ! నిన్ను గొలుతు. 3.
జగతి నేలునట్టి సర్వేశ్వరుండవై
బాలుపగిది మారి లీలజూపి
యోగనిద్రబోవు యోగేశ్వరా! కృష్ణ!
వెన్నదొంగ! నిన్ను సన్నుతింతు. 4.
స్తుతుల కందబోవు, మతులతో యోచింప
చిక్కబోవు నిన్ను చేరుటెట్లు?
శుద్ధమానసమున జోడింతు కరములు
వాసుదేవ! కొనుము వందనంబు. 5.
శ్రీ శంకరయ్య గారికి శుభాశీస్సులు.
రిప్లయితొలగించండినా పద్యములో పికములు శుకములు నాలపించుచుండె అనినా సరిపోతుంది.
పాదము మారిన చోట విసంధిగా వదిలివేసితిని. పిక శుక శారికలనుట కూడా మంచిదే. ఆలాగుననే అందాము. స్వస్తి.
యోగ నిద్రను మునిగెను యోగి వరుడు
రిప్లయితొలగించండిఉట్టిపడుచుండె దేజము బిట్టు గాను
భూనభో రాంత రాళము ల్దాన యగుచు
నేమి తెలియని వాడుగ నెట్టు లుండె ?
చోద్యమే గద యీ యది చూడు డార్య !
కందుల వరప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిఎప్పుడూ వినని లాలిపాటను బ్లాగు ద్వారా పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. అష్టమహిషుల పరిచర్యలతో పదహారు వేల మందిని అలరించిన శ్రీకృష్ణునిపై లాలి పాట అద్భుతంగా ఉంది. పాట చివర ‘రామదాసు’ అన్న ముద్ర ఉంది. అలా అని ఇది కంచెర్ల గోపన్న రచన కాదు. అతని కీర్తనలలో ‘రామదాసు’ అన్న ముద్ర ఉండదు.
దశావతారాలను ప్రస్తావిస్తూ మీ మేలుకొలుపు సీసమాలిక బాగుంది. అభినందనలు.
వటుని రూపమునందు వైరిని.... ‘బ్రోవగా’ అని ఉండాలనుకుంటాను.
‘నీల నీలంబుద’ను ‘నీలమేఘశ్యామ’ అనండి.
‘దైత్యుల’ అన్నచోట గణదోషం. ‘దైత్యులను’ అంటే సరి.
ఎత్తుగీతిలో ‘సమయాయె’ ?.... అక్కడ ‘లీల సల్పు సమయ మాయె’ అనండి.
‘తిలక’ అన్నచోట గణదోషం. ‘తిలకమా’ అనండి.
‘సతి హిత’ కంటే ‘సన్నుత’ అంటే బాగుంటుందేమో?
*
పియెస్సార్ మూర్తి గారూ,
కన్మోడ్పు లోపించిన కృష్ణుని రూపాన్ని వర్ణిస్తూ చక్కని పద్యాన్ని చెప్పారు. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
కనులకు కమనీయమైన పద్యాన్ని చెప్పారు. అభినందనలు.
*
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
‘బాలుపగిది మారి లీలజూపి యోగనిద్రబోవు’ కృష్ణుని స్తుతి పద్యాలు హృదయాహ్లాదాన్ని కలిగించాయి. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘యోగి వర్యు/ డుట్టిపడుచుండె’ అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితెల్ల వార వచ్చె దినకరుడరుదెంచె
రిప్లయితొలగించండిగొల్ల వనిత లంత చల్ల ద్రిప్పె
ఆల మంద లన్ని గోలచేయుచునుండె
మేలు కొనుము కృష్ణ లీల జూప
వెన్న దీసి యుంచె వ్రేపల్లెవాసులు
పిడత నుండె పాలు పెరటి లోన
వేచి యుండె సఖులు వీధి వాకిటిలో
వేగ మేలు కొనుము వెన్న దొంగ
సగము మూయు కనుల జగములే తిలకించి
మహిమ లెన్నొ జూపి మహిని గాచి
బాల ప్రాయ మందు లీలలే జూపేవు
బాల కృష్ణ నీకు వందనములు
శైలజ గారూ,
రిప్లయితొలగించండిబాలకృష్ణునికి వందనాలు తెలిపిన మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘చల్ల ద్రిప్పి/ రాలమంద’ అనండి.
స్పందించిన మిత్రులందరకు శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిసవరణలకు శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో .....
రిప్లయితొలగించండిమంచి పుస్తకము జీర్ణ దశలోనున్నది గురువు గారు కొన్ని అక్షరములు కనిపించుట లేదు. మీరనుమతి నిచ్చిన కొన్ని పాటలు బ్లాగున పెట్టెదను.శ్రీ గోకుల మందు పెట్టు చుంటిని గురువు గారు.నా కుమారుని పరీక్షలు ముగిసినవి.
సవరణలతో
-------------*----------
చోర సోమకుడను జేరి గూల్చిన దేవ!మేలుకో వయ్య మమ్మేలు కొనుము!
కూర్మ రూపము నందు కోర్కెలెల్లను దీర్చి!మేలుకో వయ్య మమ్మేలు కొనుము!
మేటి వరాహ మై మీరు వారిని గూల్చి!మేలుకో వయ్య మమ్మేలు కొనుము!
నార సింహుడ వయి వైరి తతిని గూల్చి ! మేలుకో వయ్య మమ్మేలు కొనుము !
వటుని రూపము నందు వైరిని బ్రోవగా!మేలుకో వయ్య మమ్మేలు కొనుము !
పరశు తోడను ద్రుంచి బలు మార్లు పాపుల!మేలుకో వయ్య మమ్మేలు కొనుము!
నీలమేఘశ్యామ! జాల మేలను రామ!మేలుకో వయ్య మమ్మేలు కొనుము!
దుష్ట రాక్షసులను ద్రుంచిన గోపాల!మేలుకో వయ్య మమ్మేలు కొనుము !
పుర దైత్యులను మార్చు బుద్దావ తారుడ! మేలుకో వయ్య మమ్మేలు కొనుము!
కలికాలమున వచ్చు కలికి రూపుడ దేవ!మేలుకో వయ్య మమ్మేలు కొనుము!
లీల సల్పు సమయ మాయె మేలు కొనుము!
మేలు యదు వంశ తిలకమా మేలు కొనుము!
మేలుకో భక్త పాలనా మేలు కొనుము!
ఫాల లోచన సన్నుత మేలు కొనుము!
పాలు దొంగ లించ బాధపడి యశోద
రిప్లయితొలగించండిచెవి నులిమి భయంబు చెప్ప దల్ఁచి
నిన్ను చేర, కపట నిద్రలో నరమోడ్పు
కనుల జూచు కృష్ణ కావ రార
వరప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిమీరు సంతోషంగా ఆ పాటలను వ్యాఖ్యలుగా బ్లాగులో పెట్టవచ్చు. మరి ‘గోకుల మందు పెట్టుచున్నాను’ అన్నారు. అది బ్లాగా? అందులో పెట్టిన తర్వాత మళ్ళీ ఈ బ్లాగులో ఎందుకు? తెలియజేయండి.
*
సహదేవుడు గారూ,
మంచి భావంతో చక్కని పద్యాన్ని చెప్పారు. అభినందనలు.
టైపాట్లు ఉన్నాయి!
లెమ్మని యంచు గారముగ లేపుచు కృష్టుని ముద్దుగా యశో
రిప్లయితొలగించండిదమ్మ శుభోదయమ్మయెన నంచును పల్కగ కండ్లు విచ్చుచున్
నెమ్మదిగాను నిష్కపట నిద్దుర లేచుచు బాల మిత్రులన్
సమ్మతితోడ బిల్చుకొని సాగెను పాలు,పెరుంగు దొంగిలించగన్!
బొడ్డు శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
‘దొంగిలించగన్’ అన్నప్పుడు గణదోషం. ‘దొంగిలన్’ అంటే సరిపోతుంది.
గురుదేవులకు నమస్సులు, సవరణతో
రిప్లయితొలగించండిలెమ్మని యంచు గారముగ లేపుచు కృష్టుని ముద్దుగా యశో
దమ్మ శుభోదయమ్మయెన నంచును పల్కగ కండ్లు విచ్చుచున్
నెమ్మదిగాను నిష్కపట నిద్దుర లేచుచు బాల మిత్రులన్
సమ్మతితోడ బిల్చుకొని సాగెను పాలు,పెరుంగు మ్రుచ్చిలన్!
చిన్ని కృష్ణయ్య శయనించె చెన్నుగాను
రిప్లయితొలగించండిముద్దుమోముపై వెలుగులు పొంగిపొరలె
పోతనన్ జంప తానిప్డు పొంచి యుండె?
వెన్న దొంగిలింపంగను వేచి యుండె?
చిన్ని కృష్ణయ్య లీలల నెన్న తరమె?
బొడ్డు శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిమీ సవరణ బాగుంది.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘పూతన’ టైపాటు వల్ల ‘పోతన’ అయింది.
జరిగిన తప్పుకు బాధ పడు చున్నాను. టైపు తప్పు వలన ఒక రాక్షసి పేరు గొప్ప కవిగారి పేరుగా మారింది. తమరి సవరణకు మరొక సారి ధన్యవాదాలు తెలియ జేయు చున్నాను.
రిప్లయితొలగించండిచిన్ని కృష్ణయ్య శయనించె చెన్నుగాను
ముద్దుమోముపై వెలుగులు పొంగిపొరలె
పూతనన్ జంప తానిప్డు పొంచి యుండె?
వెన్న దొంగిలింపంగను వేచి యుండె?
చిన్ని కృష్ణయ్య లీలల నెన్న తరమె?
లక్ష పద్యార్చన లో ప్రథమ పద్య సుమమును అందుకొనుచున్న శ్రీ గురు వర్యులకు అభినందనలు
రిప్లయితొలగించండిగురుదేవులకు నమస్సులు, సవరణతో
రిప్లయితొలగించండిపాలు దొంగ లించ బాధపడి యశోద
చెవి నులిమి భయంబు చెప్ప దలచి
నిన్ను జేర, కపట నిద్రతో నరమోడ్పు
కనుల జూచు కృష్ణ కావ రార
ఎంత పుణ్యముఁ జేసెనో కంత లుండి
వెదురు గొట్టమ్ము వీడక వెంట నుండ
పార దర్శకత నిరహంకార గుణము
మెత్తు వని దెలియగ మాకు మేలు కొలుపు!
నిదురించెడు వేళ మురళిఁ
వదలక కరమందు పట్టు భావము జూడన్
మదిలో నహమది వీడగ
ముదమున దరిఁజేర్తు వనెడు బోధన కాదే!