23, మార్చి 2014, ఆదివారం

సమస్యాపూరణం - 1360 (గీతాపారాయణమ్ము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
గీతాపారాయణమ్ము గీడొనరించున్.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

23 కామెంట్‌లు:

  1. పోతన విరచిత కావ్యము
    గీతా పారాయణమ్ము . గీడొన రించున్
    చేతిని గీతలు నుదుటను
    వ్రాతలను దలచి వ్యధబడి నంతన్

    రిప్లయితొలగించండి
  2. యాతనలు దీర్చు జనులకు
    గీతా పారాయణమ్ము, గీడొన రించున్
    జోతలు చేయక నెవరికి
    చేతలు గోతులనుతీయ చేటొనగూర్చున్

    రిప్లయితొలగించండి
  3. రాజేశ్వరి అక్కయ్యా,
    పూరణ బాగుంది. అభినందనలు.
    ‘గీతాపారాయణము’ అనే గ్రంధాన్ని పోతన రచించాడా?
    *
    శైలజ గారూ,
    విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    ‘అక’ ప్రత్యయాంత అవ్యయం కళ. కాబట్టి ‘చేయక యెవరికి’ అనవలసి ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  4. నీతియు నియమము నేర్పును
    గీతా పారాయణమ్ము, గీడొనరించున్
    ఖాతాలో నల్లధనము
    గోతాములసంపదున్న గొడవలు దెచ్చున్

    రిప్లయితొలగించండి
  5. గీతా పారాయణమును
    సీతా రాములకు పూజ చేతువ యిపుడే
    ప్రీతియు శుభ్రత లేకను
    గీతా ! పారాయణమ్ము కీడొన రించున్

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  7. కాతరభావము డుల్చున్
    గీతా పారాయణమ్ము, గీడొనరించున్
    గీతఁ బరిహాసమాడిన
    చాతుర్యము నిచ్చు మిగుల సన్నుతి జేయన్ II

    రిప్లయితొలగించండి
  8. పండిత నేమానిగారికి పూజ్య గురుదేవులు శoకరయ్య
    గారికి వందనములు

    గీతను దెల్పిన సూక్తుల
    నేతీరున పాటించక నెన్నో గతులన్
    నీతిని దప్పిన నేతల
    గీతా పారాయణమ్ము గీడొనరించున్

    రిప్లయితొలగించండి
  9. రాజేశ్వరి గారు క్షమించాలి. గురువు గారి వ్యాఖ్య చదివి నవ్వాపు కోలేక పోయాను.

    రిప్లయితొలగించండి
  10. నీతిని పెంచును నిజముగ
    గీతా పారాయణమ్ము, గీడొనరించును
    జాతికి చేసిన ద్రోహము
    మాతాపితలకు సలిపిన మలినపు చెయివుల్

    రిప్లయితొలగించండి
  11. పాతకులే బల్కుదురిటు
    గీతాపారాయణమ్ము గీడొనరించున్.
    గీతా సారాంశం బని
    భీతిలు ఫల్గునునిగని యుపేంద్రుడు దెల్పెన్


    గీతా సారాశంబు + అని = గీతాసారాంశంబని

    రిప్లయితొలగించండి
  12. భీతిల్లితిగద పుత్రా
    రాతిరి విషయమ్ము తెలిసి,రంగని సుతయౌ
    ప్రీతిని పెండ్లాడుము "సం
    గీతా" పారాయణమ్ము గీడొనరించున్ !!!

    రిప్లయితొలగించండి
  13. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం. కాని పూరణ కాస్త గజిబిజిగా ఉన్నట్టుంది.
    మూడవ పాదంలో ప్రాస తప్పింది.
    *
    డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    నా వ్యాఖ్యలో ఏదైనా పొరపాటు దొర్లిందా? అక్కయ్య భావాన్ని సరిగా అర్థం చేసుకోలేక పోయానా?
    *
    అన్నపురెడ్డి సత్యనారాయణ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా ఉంది. బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. నమస్కారములు
    మిస్సన్నగారూ మీకేగాదు గురువుగారి వ్యాఖ చదవగానే నకూ నవ్వొచ్చింది ప్చ్ ! ఏంచెయను పోతన కాదని తెలుసు .కానీ ఎవరొ తెలీక అదన్నమాట

    రిప్లయితొలగించండి
  15. నీతియు మనుగడ నేర్పును
    గీతా పారాయణ మ్ము గీ డొ నరించున్
    బాతకము జేయు నెడలను
    మాతయె శి క్షించు మనల మరువకు నరుడా !

    రిప్లయితొలగించండి
  16. అమ్మా ! రాజేశ్వరి గారు ! నమస్కారము
    గీ తా పారాయణము అనగా భగవ ద్గీ తను పారాయణము చేయుట

    రిప్లయితొలగించండి
  17. నమస్కారములు
    గురువు గారి వ్యాఖ్య చక్కగా ఉంది నవ్వు ఆరోగ్యానికి మంచిది కాస్త అప్పుడప్పుడు ఇలా నవ్వుకొందాం .
    నవ్వించ గలిగినందుకు గురువులకు ధన్య్ వాదములు

    రిప్లయితొలగించండి
  18. సుబ్బారావు గారూ,
    మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. చేతంబు లలరజేయును
    గీతాపారాయణంబు, గీడొనరించున్
    భూతలమున పాఠకజన
    పాతకములకు, పరమునను భాగ్యం బొసగున్.

    రిప్లయితొలగించండి
  20. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. సుబ్బారావు గారూ,
    రేపు ఉదయానికి షెడ్యూల్ చేసిన సమస్య పొరపాటున ఇంతకు ముందు బ్లాగులో కనిపించింది. తొలగించాను. మీ పూరణను రేపు మళ్ళీ పోస్ట్ చేయండి. జరిగిన పొరపాటుకు మన్నించండి.

    రిప్లయితొలగించండి
  22. గీతా ముద్రణ మందున
    పాతవి క్రొత్తవి లొసుగులు ప్రాభవ మొందున్
    శ్రోతల కోరికపై "భగ
    గీతా" పారాయణమ్ము గీడొనరించున్

    రిప్లయితొలగించండి
  23. నీతులు కడు నుడువుచు పల్
    కోతలు కోయుచు సతతము, కోపము మీరన్
    వాతలు పెట్టుచు మగనికి
    గీతాపారాయణమ్ము గీడొనరించున్

    రిప్లయితొలగించండి