తిననెంచెన్ మకరమ్ము ఖేచరము నెంతే యత్నమున్ జేయుచున్గనె నా పక్షియు నాపదన్ దొలగి శీఘ్రం బందరానట్లుగా జనుచున్ నవ్వుచు బల్కె నో మకరమా! చాలించు సంరంభమున్ వినువీధిన్ జను నన్ను బట్టగలవే వేవేల యత్నాలతో
మైత్రికి తరతమ భేదము ధాత్రిని లేదెన్న డనగ దైవాను గ్రహమున్ చిత్రానది యేమో నిదిమరి స్తోత్రము జేయంగ దెచ్చె శుభమ గునీకున్ అంబర మున దిరిగెడునను సంబరముగ తినగ నెంచి చాతుర్యము నన్ జంబుకము వంటి జిత్తులు దంభకములు చెల్లవనగ తాళుము మకరీ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఎగురు చున్న బకము నెరవేసి బట్టగజోరు తోడ మకరి నోరు తెరచెశక్తి యుక్తులున్న చక్కడగు విపత్తుమకరి నోట బడక బకము నెగిరె
మడుగు నందున జూడుము మకరమొకటిలాగు చుండెను బకమును రయము గాను ఆహరించను గాబోలు నైన బకముఅందకుండగ బోజూచె నయ్యదనున
సరసిని మకరం బటపైనరయంగా విహగమొక్క టద్భుతరీతిన్నిరతము మైత్రిని బూనుచునరుసంబు వహించియుండు నందరు మెచ్చన్. 1.జలవాసుల సంగతులంబలుకును మకరంబు, పిదప పక్షుల గతులందెలుపును ఖేచర మక్కట!జలచర ఖగములకు నిట్లు సఖ్యత గూడెన్. 2.తననెచ్చెలి వచ్చుట గనిమనమున హర్షంబు నిండ మకరం బదిగోఘనతరముగ పైకెగయుచుననె హిత! కుశలంబె నీకు నన్నివిధాలన్. 3.కుశలము తెల్పుచు పులుగికదశదిశలం దిరిగియుంట తనమిత్రునకున్మశకాదులైన ప్రాణులదశలం దెలియంగ జెప్పి తనియగ జేసెన్ 4.ప్రేమంబున తనచంచువునామకరపు ముఖము జేర్చి యాత్మీయతతోసేమంబె మిత్రసత్తమ!ధీమతి! యనె పక్కి మైత్రి దీపిల్లునటుల్ 5.వారిద్దరి మాటలలోభారతదేశంబులోని బహువిషయాలున్వారింపలేని మోసములారయ చర్చలకు వచ్చె నౌరా యచటన్ 6.ఎన్నికలు జరుగురీతియుమన్నిక నందంగ దలచు మానవు లిలలోపన్నుచు నుండెడి జిత్తులనన్నియు చర్చించి రప్పు డామిత్రు లటన్ 7.కలలో నైనను భేదముతలపని యాంధ్రంబు జూచి తమపని యనుచున్నిలువున జీల్చినవారలతలపులు చర్చించి రచట తా రామిత్రుల్. 8.ఒకజాతి వారిమధ్యనుప్రకటితమగు భేదమిలను బహువిధములుగా,నకటా! సఖ్యము గాంచుడుమకరము ఖగములకుమధ్య మానవులిందున్. 9.
మిత్రులకు శుభాశీస్సులు.ఈనాడు కొద్దిగా పూరణలు వచ్చినవి. అందరికి అభినందనలు.స్రీ కంది శంకరయ్య గారికి తిరుపతి ప్రయాణము శుభప్రదముగా జరుగు గాక అని అశీస్సులు.శ్రీమతి రాజేశ్వరి గారు:మీ 2 పద్యములు బాగుగ ఉన్నవి. 3వ పాదములో "నిది" అనే 2 అక్షరములు ఎక్కువగా నున్నవి. వానిని తొలగించుదాము.శ్రీనాగరాజు రవీందర్ గారు:బకమునకు నుద్బోధ చేయుచున్న మీ పద్యము బాగుగ నున్నది.శ్రీమతి శైలజ గారు:మకరము నోట బడక బకము నెగిరె - అను మీ పద్యము బాగుగ నున్నది. శ్రీ సుబ్బా రావు గారు:బకము నందకుండగ బోజూచె నయ్యదనున - అను మీ పద్యము బాగుగ నున్నది.శ్రీ హరి వెంకట సత్యనారాయణ మూర్తి గారు:మీ ఖండిక చాల బాగుగ నున్నది. మకరి విహగాల పొత్తు - వారి వాగ్వైభవము బాగుగ నుట్టంకించేరు. స్వస్తి.
పులుగు నీటి పైన పొంచి చూచుచు నుండెచేప తనకు నీట చిక్కు నంచుపొంచి యున్న మొసలి పులుగు పై కెగసెనుతప్పుకొనియె పక్షి త్వరితముగను
శ్రీ అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు: శుభాశీస్సులు.మీ పద్యమును మంచి భావముతో అలరార జేసినారు. చాల బాగుగ నున్నది.అభినందనలు.స్వస్తి.
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు ముక్కుమూసి నిలిచి కొక్కెర చేపల జంపు విధము గాంచి ఝషము యొకటి పైకిజక్క లేచి బట్ట బోవగ బకము జిక్క కుండ నెగసి కొక్కిరి౦చె
శ్రీ తిమ్మాజీ రావు గారు: శుభాశీస్సులు.మీ పద్యము బాగుగ నున్నది. ఝషము ఉకారాంతము. దాని తరువాత యడాగమము రాదు. అందుచేత ఝషమొకండు అని మార్చుదాము. 3వ పాదములో ఒక అక్షరము ఎక్కువగా నున్నది. పట్టబోవగ లోని "గ" ను తొలగించుదాము. స్వస్తి.
నీట నుండు మొసలి నీల్గి పలకరింపయెగిరి పోక నిలిచి యిక్కడాగె.గాలి నెగురగల్గు కతమును వివరించిమొసలి కథల వినగ మోజు జూపె.
తిననెంచెన్ మకరమ్ము ఖేచరము నెంతే యత్నమున్ జేయుచున్
రిప్లయితొలగించండిగనె నా పక్షియు నాపదన్ దొలగి శీఘ్రం బందరానట్లుగా
జనుచున్ నవ్వుచు బల్కె నో మకరమా! చాలించు సంరంభమున్
వినువీధిన్ జను నన్ను బట్టగలవే వేవేల యత్నాలతో
రిప్లయితొలగించండిమైత్రికి తరతమ భేదము
ధాత్రిని లేదెన్న డనగ దైవాను గ్రహమున్
చిత్రానది యేమో నిదిమరి
స్తోత్రము జేయంగ దెచ్చె శుభమ గునీకున్
అంబర మున దిరిగెడునను
సంబరముగ తినగ నెంచి చాతుర్యము నన్
జంబుకము వంటి జిత్తులు
దంభకములు చెల్లవనగ తాళుము మకరీ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఎగురు చున్న బకము నెరవేసి బట్టగ
రిప్లయితొలగించండిజోరు తోడ మకరి నోరు తెరచె
శక్తి యుక్తులున్న చక్కడగు విపత్తు
మకరి నోట బడక బకము నెగిరె
మడుగు నందున జూడుము మకరమొకటి
రిప్లయితొలగించండిలాగు చుండెను బకమును రయము గాను
ఆహరించను గాబోలు నైన బకము
అందకుండగ బోజూచె నయ్యదనున
సరసిని మకరం బటపై
రిప్లయితొలగించండినరయంగా విహగమొక్క టద్భుతరీతిన్
నిరతము మైత్రిని బూనుచు
నరుసంబు వహించియుండు నందరు మెచ్చన్. 1.
జలవాసుల సంగతులం
బలుకును మకరంబు, పిదప పక్షుల గతులం
దెలుపును ఖేచర మక్కట!
జలచర ఖగములకు నిట్లు సఖ్యత గూడెన్. 2.
తననెచ్చెలి వచ్చుట గని
మనమున హర్షంబు నిండ మకరం బదిగో
ఘనతరముగ పైకెగయుచు
ననె హిత! కుశలంబె నీకు నన్నివిధాలన్. 3.
కుశలము తెల్పుచు పులుగిక
దశదిశలం దిరిగియుంట తనమిత్రునకున్
మశకాదులైన ప్రాణుల
దశలం దెలియంగ జెప్పి తనియగ జేసెన్ 4.
ప్రేమంబున తనచంచువు
నామకరపు ముఖము జేర్చి యాత్మీయతతో
సేమంబె మిత్రసత్తమ!
ధీమతి! యనె పక్కి మైత్రి దీపిల్లునటుల్ 5.
వారిద్దరి మాటలలో
భారతదేశంబులోని బహువిషయాలున్
వారింపలేని మోసము
లారయ చర్చలకు వచ్చె నౌరా యచటన్ 6.
ఎన్నికలు జరుగురీతియు
మన్నిక నందంగ దలచు మానవు లిలలో
పన్నుచు నుండెడి జిత్తుల
నన్నియు చర్చించి రప్పు డామిత్రు లటన్ 7.
కలలో నైనను భేదము
తలపని యాంధ్రంబు జూచి తమపని యనుచున్
నిలువున జీల్చినవారల
తలపులు చర్చించి రచట తా రామిత్రుల్. 8.
ఒకజాతి వారిమధ్యను
ప్రకటితమగు భేదమిలను బహువిధములుగా,
నకటా! సఖ్యము గాంచుడు
మకరము ఖగములకుమధ్య మానవులిందున్. 9.
మిత్రులకు శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఈనాడు కొద్దిగా పూరణలు వచ్చినవి. అందరికి అభినందనలు.
స్రీ కంది శంకరయ్య గారికి తిరుపతి ప్రయాణము శుభప్రదముగా జరుగు గాక అని అశీస్సులు.
శ్రీమతి రాజేశ్వరి గారు:
మీ 2 పద్యములు బాగుగ ఉన్నవి. 3వ పాదములో "నిది" అనే 2 అక్షరములు ఎక్కువగా నున్నవి. వానిని తొలగించుదాము.
శ్రీనాగరాజు రవీందర్ గారు:
బకమునకు నుద్బోధ చేయుచున్న మీ పద్యము బాగుగ నున్నది.
శ్రీమతి శైలజ గారు:
మకరము నోట బడక బకము నెగిరె - అను మీ పద్యము బాగుగ నున్నది.
శ్రీ సుబ్బా రావు గారు:
బకము నందకుండగ బోజూచె నయ్యదనున - అను మీ పద్యము బాగుగ నున్నది.
శ్రీ హరి వెంకట సత్యనారాయణ మూర్తి గారు:
మీ ఖండిక చాల బాగుగ నున్నది. మకరి విహగాల పొత్తు - వారి వాగ్వైభవము బాగుగ నుట్టంకించేరు.
స్వస్తి.
పులుగు నీటి పైన పొంచి చూచుచు నుండె
రిప్లయితొలగించండిచేప తనకు నీట చిక్కు నంచు
పొంచి యున్న మొసలి పులుగు పై కెగసెను
తప్పుకొనియె పక్షి త్వరితముగను
శ్రీ అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు: శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యమును మంచి భావముతో అలరార జేసినారు. చాల బాగుగ నున్నది.
అభినందనలు.
స్వస్తి.
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిముక్కుమూసి నిలిచి కొక్కెర చేపల
జంపు విధము గాంచి ఝషము యొకటి
పైకిజక్క లేచి బట్ట బోవగ బకము
జిక్క కుండ నెగసి కొక్కిరి౦చె
శ్రీ తిమ్మాజీ రావు గారు: శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. ఝషము ఉకారాంతము. దాని తరువాత యడాగమము రాదు. అందుచేత ఝషమొకండు అని మార్చుదాము. 3వ పాదములో ఒక అక్షరము ఎక్కువగా నున్నది. పట్టబోవగ లోని "గ" ను తొలగించుదాము. స్వస్తి.
నీట నుండు మొసలి నీల్గి పలకరింప
రిప్లయితొలగించండియెగిరి పోక నిలిచి యిక్కడాగె.
గాలి నెగురగల్గు కతమును వివరించి
మొసలి కథల వినగ మోజు జూపె.