శ్రీ హరి వెంకట సత్యనారాయణ మూర్తి గారికి శుభాశీస్సులు. నా పద్యముల గూర్చి మీరు చేసిన ప్రశంసకు మా సంతోషమును తెలియజేయ చున్నాను. మీ ఖండిక చాల బాగుగ నున్నది. మీ సీస పద్యము 4 పాదములను ఈ క్రింది విధంగా మార్చితే బాగుండునని నా సూచన:
ఏ దివ్య నాదంబు లెల్ల లోకములలో ....వేద సూక్తముల వ్యాపింప జేయు నే భవ్య నాదంపు వైభవ మమరుల ....కుత్సాహమును గూర్చుచుండు నెపుడు నే మంజు నాదంబు ప్రేమతో భక్తుల ....స్వాంతాలలో సంతసమును నింపు నే వేణు గానంబు నేవేళ గోపికా ....బృందాలలో వేడ్క వెలుగజేయు
పండిత నేమాని వారూ, మీ శీకృష్ణస్తుతి మనోజ్ఞంగా ఉంది. అభినందనలు. * రాజేశ్వరి అక్కయ్యా, చక్కని పద్యాలను వ్రాశారు. అభినందనలు. ‘కన్నెల మనముల్’ అంటే బాగుంటుంది. * హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ, వేణుగాన మాధుర్యాన్ని వివరిస్తూ, కృష్ణస్తుతి చేసిన మీ రచన మనోరంజకంగా ఉంది. అభినందనలు. * గోలి హనిమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘వేల్పు + అతడు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘వేలు పతడు’ అనండి. * సహదేవుడు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * నాగరాజు రవీందర్ గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు. * శైలజ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘ఐనా’ అని వ్యావహారికాన్ని వాడారు. అక్కడ ‘చూపులకైనను చిక్కని/దక్కని’ అనండి. * సుబ్బారావు గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు. ‘మిము గోరెదమే’ అనండి.
శ్రీకృష్ణా! మురళీధరా! శ్రితహితా! చిత్తాంబుజాతాలయా!
రిప్లయితొలగించండిరాకాచంద్ర నిభాననా! శుభకరా! రాజీవ పత్రేక్షణా!
శ్రీకళ్యాణ గుణాకరా! హృదయ రాజీవమ్ము శోభిల్లె, ది
వ్యాకారా! మది నీ తలంపు మెదలన్ వార్ష్ణేయ వంశాగ్రణీ!
వినిపించెన్ మురళీధరా! చెవులకున్ విందౌచు నీ గానమే
మన మానంద పయోధిపై నలరె సంభావించుచున్ నీ కృతిన్
వినుచున్ దన్మయమందుచుంటి కనరావే వేగ గోపాలకా!
ఘన నీలాంగ! దయాంతరంగ! విలసత్ కంజాతనేత్రా! సఖా!
ఎందు నున్నవాడ వీవు గోపాలక!
కాన రావదేల? కమల నయన!
ఎందు దాగినావొ? ఏ మూల నున్నావొ?
నన్ను జూడరావె? వెన్నదొంగ!
నల్లనివాడ! నందవిభునందన! నీకు ప్రియమ్ము గూర్చు నా
యుల్లమె పూలతోట కనుమొప్పుగ నచ్చట పారిజాతముల్
మల్లెలు మొల్ల లెన్నియొ సుమంబులు నిన్నలరింప జేయగా
సల్లలితంబుగా విరిసె చయ్యన రావె? సపర్య లందవే?
రారా నందకుమారా!
రారా మచ్చిత్తచోర! రార సుధీరా!
రారా వనసంచారా!
రారా నన్నేలుకోర రారా కృష్ణా!
చల్లని వెన్నెల నీడల
రిప్లయితొలగించండినుల్లము రంజిల్లు నటుల యువిదల కెల్లన్
పిల్లన గ్రోవిని నూదుచు
కల్లలు చేయంగ వలదు కన్నియ మనముల్
వేణు గానమ్ము వినిపించి వెఱ్ఱి జేసి
తరుల ఛాయల దాగుచు విరులు జిమ్మి
సొగసు కన్నియ హృదయమ్ము సొంపు నింపి
కల్ల లాడగ నీకిది చెల్ల దయ్య
నందకుమారుని సంస్తుతి
రిప్లయితొలగించండియందంబుగ జేసినార లద్భుతరీతిన్
వందనము పండితార్యా!
యందుడు సద్యశములనఘ! యనవరతంబున్.
ప్రణామములు
రిప్లయితొలగించండిఅవును పండితుల వారి స్తుతి అద్భుతంగా ఉంది .అలా వ్రాయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి [ మేను ]
ఏవేణుగానంబు భావింప హృదయంబు
రిప్లయితొలగించండి..........లానందభరములై యలరుచుండు,
ఏవేణుగానంబు జీవరాశులలోన
..........నుత్సాహమును నింపు నున్నతముగ,
ఏవేణుగానాంబు వీధరాస్థలిలోన
..........నమృతోపమానమై హాయి నొసగు,
ఏవేణుగానంబు నేవేళ వినగోరి
..........గోపికాసంఘాలు కూడుచుందు
రట్టి వేణువు మ్రోగించు నందగాని,
నల్లనయ్యను, గోవిందు, నందసుతుని,
మోహనాంగుని, యాదవముఖ్యు, ఘనుని
సన్నుతించెద భక్తితో సతతమేను. 1.
వందనము రాక్షసాంతక!
వందనమో దేవదేవ! వందనము హరీ!
వందనము లోకరక్షక!
వందనములు స్వీకరించు వసుదేవసుతా! 2.
నిన్నేనమ్మితి సత్యం
బెన్నంగా నొరులు గలరె! యీవిశ్వమునం
దెన్నడు గాచెడు వారలు
నన్నుం దయజూడవయ్య నందకుమారా! 3.
నీవే జగదాధారుడ
వీవే సర్వేశ్వరుండ వీవే సర్వం
బీవే కృష్ణా! కావుము
దేవా! నినుగొల్తు సతము స్థిరమతి యొసగన్. 4.
శ్రీ హరి వెంకట సత్యనారాయణ మూర్తి గారికి శుభాశీస్సులు.
రిప్లయితొలగించండినా పద్యముల గూర్చి మీరు చేసిన ప్రశంసకు మా సంతోషమును తెలియజేయ చున్నాను.
మీ ఖండిక చాల బాగుగ నున్నది. మీ సీస పద్యము 4 పాదములను ఈ క్రింది విధంగా మార్చితే బాగుండునని నా సూచన:
ఏ దివ్య నాదంబు లెల్ల లోకములలో
....వేద సూక్తముల వ్యాపింప జేయు
నే భవ్య నాదంపు వైభవ మమరుల
....కుత్సాహమును గూర్చుచుండు నెపుడు
నే మంజు నాదంబు ప్రేమతో భక్తుల
....స్వాంతాలలో సంతసమును నింపు
నే వేణు గానంబు నేవేళ గోపికా
....బృందాలలో వేడ్క వెలుగజేయు
......
స్వస్తి.
వెదురు వేణువు వాయించు వేల్పుయతడు
రిప్లయితొలగించండితలను పించమ్ము ధరియించు దైవమతడు
ప్రకృతికాంతను ప్రేమించు భర్త యతడు
కనుడు కనులార జంటనే గగనమందు.
ఆర్యా!
రిప్లయితొలగించండినమస్కారములు, మీ సూచనలకు ధన్యవాదములు,
అదేవిధముగా మార్చుచున్నాను.
ఏ దివ్య నాదంబు లెల్ల లోకములలో
....వేద సూక్తముల వ్యాపింప జేయు
నే భవ్య నాదంపు వైభవ మమరుల
....కుత్సాహమును గూర్చుచుండు నెపుడు
నే మంజు నాదంబు ప్రేమతో భక్తుల
....స్వాంతాలలో సంతసమును నింపు
నే వేణు గానంబు నేవేళ గోపికా
....బృందాలలో వేడ్క వెలుగజేయు
వలదు వలదన్న నను నీ
రిప్లయితొలగించండితలపు కనుల పింఛ మగుచు తడబడ జేయున్
వలదు వలదన్న నను నీ
వలపది మురళీ రవంపు వలపన్ను గదే!
చూపించక నీరూపము
రిప్లయితొలగించండిపాపము నీరాధతోనె పరిహాసములా
చూపులకైనా యందని
గోపాలకనిన్ను వెదకె కోమలి రాధన్
పిల్లన గ్రోవిని నూదుచు
రిప్లయితొలగించండినుల్లము రంజిల్ల జేయు నో పరమాత్మా !
చల్లని యౌ నీ చూపులు
మెల్లగ మాపైని బడను మిము గోరుదు నున్
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిమీ శీకృష్ణస్తుతి మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
చక్కని పద్యాలను వ్రాశారు. అభినందనలు.
‘కన్నెల మనముల్’ అంటే బాగుంటుంది.
*
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
వేణుగాన మాధుర్యాన్ని వివరిస్తూ, కృష్ణస్తుతి చేసిన మీ రచన మనోరంజకంగా ఉంది. అభినందనలు.
*
గోలి హనిమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘వేల్పు + అతడు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘వేలు పతడు’ అనండి.
*
సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘ఐనా’ అని వ్యావహారికాన్ని వాడారు. అక్కడ ‘చూపులకైనను చిక్కని/దక్కని’ అనండి.
*
సుబ్బారావు గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
‘మిము గోరెదమే’ అనండి.
రిప్లయితొలగించండిఆర్యా ! ధన్యవాదములు...మీరు చూపిన సవరణతో...
వెదురు వేణువు వాయించు వేలుపతడు
తలను పించమ్ము ధరియించు దైవమతడు
ప్రకృతికాంతను ప్రేమించు భర్త యతడు
కనుడు కనులార జంటనే గగనమందు.
ఉఛ్చ్వాస పరిపూర్ణ ప్రేమ గుప్పింపగా..నిశ్వాస వాయులీనమునకు తోడిడగా
రిప్లయితొలగించండిపొంచివున్న ప్రకృతికాంత తన వంతుగా,ఇంతింతగా
రాధమ్మ ఆకృతి కి పురుడు పోసినట్లు తోచెగా!!
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండితనువు మనసును మమతలు తలపు లెల్ల
మురళిగా జేసి నిచ్చితి మురళి లోల !
ప్రేమ శ్వాసను పూరించి వేణు గాన
రవము వినిచితి జగము పరవశమంద
మురలి గానముమువిని మోహమున మునిగి
రిప్లయితొలగించండిమురిసిపోవు చుండె ముద్దుగుమ్మ
కనికరించి సౌరి కనిపించి బ్రోచునా
చిక్కునా మురారి చిన్న దాన్కి
విజయ్ రాఘవేంద్ర గారు, మీ పదాలు, వాటిలో భావము మనోహరము.
రిప్లయితొలగించండివాటికి పద్యరూపము
వంశస్థము (పిల్లనగ్రోవి)
పదే పదే వేణురవమ్ము శ్వాసగా
నదే ప్రతీకమ్ముగ నందగత్తెగా
నిదిట్లిదే రాధగ సృష్టి సల్పెనే
సదా మనమ్మందున జంట రూపునన్.