రాజేశ్వరి అక్కయ్యా, కొబ్బరినీటి గొప్పదనాన్ని చెప్తూ మంచి పద్యాన్ని వ్రాశారు. అభినందనలు. మీరు ఆ వ్యక్తి అవిటితనాన్ని గమనించినట్టు లేదు. * జిలెబీ గారూ, మీ భావానికి నా పద్యరూపం.... ఒక్కచేయి పోయియున్న నేమయ్యెను దైవ మిడిన గుండెధైర్యమున్న కొట్ట నేర్చినాఁడు కొబ్బరిబొండాము రాముఁడే భరోసరా యతనికి. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు. ‘కాయను + ఒంటి’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘కాయల నొంటి’ అనండి. అలాగే ‘ధరలోన / నన్నమాట..." అనండి. * సుబ్బారావు గారూ, మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు. * శైలజ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
కొబ్బరి నీటిని త్రాగిన
రిప్లయితొలగించండినిబ్బరముగ నుండ వచ్చు నిక్కము సుమ్మీ
జబ్బులు దరి రానీయవు
దెబ్బకు వడగాడ్పు నుండి తేరు కొనంగా
రిప్లయితొలగించండిఒక చేయి పోయిన ఏమి
వరదుడు ఇచ్చిన గుండె కాయ
కొబ్బరి బొండాం కి ఒత్తిచ్చిన,
సాగు జీవనం 'రామ్' భరోసా !!
శుభోదయం
జిలేబి
చేయేలేదనుచేదీ
రిప్లయితొలగించండిచేయగ లేననక నొక్క చేతనె పనులన్
జేయుచునుండెను నాతడు
చేయగ లేనట్టిదేది చే ' తల ' దలపన్.
కోయు చుండె నతడు కొబ్బరి కాయను
రిప్లయితొలగించండియొంటి చేతి తోడ నోర్పు తోడ
సాధనమున పనులు సమకూరు ధరలోన
యన్న బుధుల మాట లున్న తములు
పాప మాతని జూడగ బాధ కలిగె
రిప్లయితొలగించండిఅవిటి వాడయ్యె గదవామ హస్త మునన
బొండ మెట్లుగా కోయునో బుద్ధి తోడ
దిక్కు దేవుడే వారికి నిక్కముగను
కొబ్బరి బొండము ద్రాగిన
రిప్లయితొలగించండినిబ్బరముగ నుండు గుండె నిచ్చలు మనకున్
పబ్బములు గలుగు రోజున
కొబ్బరితో జేయు చుండ్రు కొబ్బరి నోజున్
దెబ్బలు తగిలిన నాతడు
రిప్లయితొలగించండినిబ్బరమునుకోలుపోక నేర్చెను పనులన్
కొబ్బరి కాయల వృత్తిన
ఇబ్బందులు పెట్టకయ్య యింకా! రామా!
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండికొబ్బరినీటి గొప్పదనాన్ని చెప్తూ మంచి పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
మీరు ఆ వ్యక్తి అవిటితనాన్ని గమనించినట్టు లేదు.
*
జిలెబీ గారూ,
మీ భావానికి నా పద్యరూపం....
ఒక్కచేయి పోయియున్న నేమయ్యెను
దైవ మిడిన గుండెధైర్యమున్న
కొట్ట నేర్చినాఁడు కొబ్బరిబొండాము
రాముఁడే భరోసరా యతనికి.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
‘కాయను + ఒంటి’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘కాయల నొంటి’ అనండి. అలాగే ‘ధరలోన / నన్నమాట..." అనండి.
*
సుబ్బారావు గారూ,
మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి నమస్సులు. తమరి సవరణకు కృతజ్ఞతలు.
రిప్లయితొలగించండిశారీరికవైకల్యం
రిప్లయితొలగించండిబేరీతిగ నడ్డురాదు, హితకాంక్షులకున్
ధీరత మనమున నిండిన
వారలకా ప్రభుడొసంగు బహుసౌఖ్యంబుల్. 1.
కోరికలు దీరు నెల్లెడ
చేరును విజయాలువారి చెంతకు సతమున్
తోరపు టుత్సాహము నె
వ్వారలు పూనెదరుసత్య పాలనతోడన్. 2.
రాబోదు కష్టకాలము
కాబోదిక దుర్భరంబు ఘనవైకల్యం
బాబాలవృద్ధ మందున
ధీబల మెవ్వారిలోన దీపిల్లు భువిన్. 3.
ఒకచేయి లేదటంచును
వికలుండై బాధపడక విజ్ఞతతోడన్
ప్రకటిత సామర్ధ్యముతో
నకటా! యీతండు ఖడ్గ మందెను చేతన్. 4.
శుభములు గల్గును నిత్యము
విభవంబులు పొందవచ్చు విస్తృతరీతిన్
ప్రభవించు సౌఖ్య మొదవెడు
నభయము వికలాంగుడైన యత్నముచేతన్. 5.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ ఖండకృతి ప్రశంసనీయంగా ఉండి అలరించింది. అభినందనలు.
చేయి లేకున్న నిసుమంత చింత లేదు
రిప్లయితొలగించండిపరుల కుపయోగ బడినంత పాటు బడగ
గుండె నిబ్బర మున్నది బండ బారి
కరము జోడించి దేవుని కోర లేను
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ తాజాపద్యం చిత్రానికి తగినట్లుగా ఉండి అలరించింది. అభినందనలు.
‘ఉపయోగపడు’ అనండి. ఇక్కడ ‘బడు’ అని రాదు.
guruvulaku dhanya vaadamulu
రిప్లయితొలగించండిజబ్బను వాడెను బట్టగ
రిప్లయితొలగించండికొబ్బరి బోండం,కరమున కొడవలిఁ బట్టే
నిబ్బరమున్ జూచిన వా
రబ్బుర పడక వికలత్వమది కనగలరే?