హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ బాగుంది. అభినందనలు. * శైలజ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘మాత + అగు’ అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ ‘మాత యయిన కౌసల్యకు’ అనండి. * గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, మీ పూరణ బాగుంది. అభినందనలు. * నాగరాజు రవీందర్ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * భాగవతుల కృష్ణారావు గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. * "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ, సమస్యను ప్రశ్నార్థకంగా మార్చి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు. * విజయ్ రాఘవేంద్ర గారూ, మీ వ్యాఖ్య వ్యాజస్తుతియో, వ్యాజనిందయో అర్థం కావడం లేదు. * డా. మాడుగుల అనిల్ శర్మ గారూ, బహుకాల దర్శనం. సంతోషం. ప్రశ్నోత్తర రూపంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు. * సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘మాతా మాలక్ష్మి’ అన్నదానిని ‘మాత మహాలక్ష్మి’ అనండి. * బొడ్డు శంకరయ్య గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘రాఘవుడు’ అన్నదాన్ని ... ‘రాముడు’ అనడంతో గణదోషం ఏర్పడింది. * సుబ్బారావు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు.
సందేహం కలిగించినందుకు మన్నించగలరు.ఇది ముమ్మాటికీ వ్యాజస్తుతి.పద్య రచన నేరుచ్కునే క్రమం లో అవధాని గారి పూరణ చదివి, అది నచ్చి వారితో అలా అన్నాను గురువుగారూ. I said it on a positive note.
చేతంబు లలరజేయుచు
రిప్లయితొలగించండిమాతకు కౌసల్య కొసగ మహితానందం
బాతన్వికి నాథుండై
సీతకు, రాఘవుడుపుట్టి శివధనువెత్తెన్.
భూతలము నందు దొరికిన
రిప్లయితొలగించండిసీతకు , రాఘవుడు పుట్టి శివ ధను వెత్తెన్
నేతగు జనకుని పుత్రిక
ప్రీతిగ నాతని కిసతిగ ప్రేమను గెలిచెన్
భూతలముననాధుండై
రిప్లయితొలగించండిసీతకు,రాఘవుడుపుట్టి శివధనువెత్తెన్
మాతగు కౌసల్యకతడు
ప్రీతిని గలిగించితల్లి ప్రేమను బొందెన్
ఈ తరుణిని పెండ్లాడగ
రిప్లయితొలగించండినే తగు వరు వెదకి చేతు నిటు పెళ్ళనుచున్
ప్రీతిగ జనకుడు వెదకగ
సీతకు, రాఘవుఁడు పుట్టి శివధను వెత్తెన్.
త్రేతను జనకుని పుత్రిక
రిప్లయితొలగించండిసీతకు, రాఘవుఁడు పుట్టి శివధను వెత్తెన్
ప్రీతిని వరుడై నిలువగ;
పాతకుడగు దైత్యునడచె పరమాత్ముండే
నూతనచరితమొ? యొక య
రిప్లయితొలగించండిజ్ఞాతకవీశ్వరు మహేంద్రజాలమొ, యకటా
వ్రాతలలో లోపమొ? యే
సీతకు రాఘవుడుపుట్టి శివధనువెత్తెన్?
అవధాని గారూ.
రిప్లయితొలగించండిమీ యథావృత్త స్ఫురణ భీభత్సః అని నా బోటి పామరుడు చెప్పక తప్పదు.ధన్యవాదాలు.మహేంద్రజాలము బదులు పదేంద్రజాలం అని అంటే..
సీతమ్మ తండ్రి యెవ్వడు ?
రిప్లయితొలగించండికౌతుకముగ దశరథునకు కడకేమయ్యెన్ ?
తా తండ్రియయ్యె జనకుడు
సీతకు , రాఘవుడు పుట్టి శివధనువెత్తెన్.
మాతా మాలక్ష్మి మహీ
రిప్లయితొలగించండిజాతగ బుట్టగ.రఘు కుల చంద్రుడు హరియే
భూతలమున సరి జోడై
సీతకు, రాఘవుడు పుట్టి శివధనువెత్తెన్
గీతను బోధించిన కం
రిప్లయితొలగించండిజాత నయనయుగము వాడు సత్యకు నెటులో
త్రేతాయుగమున భర్తగ
సీతకు రాఘవుడు బుట్టె శివధనువెత్తన్!
భూతలమున, పతిగాగన్
రిప్లయితొలగించండిసీతకు, రాముడు పుట్టి శివధను వెత్తెన్
మాతకు తండ్రిచ్చిన వర
మాతడు విని బహుముదమున నడవులకేగెన్
మాతయె యగుగద యీ భువి
రిప్లయితొలగించండిసీ తకు; రాఘవుడు పుట్టి శివ ధను వెత్తెన్
మాతగు నా కౌసల్యకు
మాతా! సేవింతు నమ్మ ! మరువక నిన్నున్
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘మాత + అగు’ అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ ‘మాత యయిన కౌసల్యకు’ అనండి.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
భాగవతుల కృష్ణారావు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
"అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
సమస్యను ప్రశ్నార్థకంగా మార్చి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
*
విజయ్ రాఘవేంద్ర గారూ,
మీ వ్యాఖ్య వ్యాజస్తుతియో, వ్యాజనిందయో అర్థం కావడం లేదు.
*
డా. మాడుగుల అనిల్ శర్మ గారూ,
బహుకాల దర్శనం. సంతోషం.
ప్రశ్నోత్తర రూపంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మాతా మాలక్ష్మి’ అన్నదానిని ‘మాత మహాలక్ష్మి’ అనండి.
*
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘రాఘవుడు’ అన్నదాన్ని ... ‘రాముడు’ అనడంతో గణదోషం ఏర్పడింది.
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
సందేహం కలిగించినందుకు మన్నించగలరు.ఇది ముమ్మాటికీ వ్యాజస్తుతి.పద్య రచన నేరుచ్కునే క్రమం లో అవధాని గారి పూరణ చదివి, అది నచ్చి వారితో అలా అన్నాను గురువుగారూ.
తొలగించండిI said it on a positive note.
పెండ్లి..పునరావృత్తమైనదని... చిన్న సవరణతో...
రిప్లయితొలగించండిఈ తరుణి లక్ష్మి రూపము
నే తగు వరు వెదకి చేతు నిటు పెళ్ళనుచున్
ప్రీతిగ జనకుడు వెదకగ
సీతకు, రాఘవుఁడు పుట్టి శివధను వెత్తెన్.
మాస్టరు గారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిసీతను రాముని దెలియక
రిప్లయితొలగించండికోతల గోయుచును దిరుగు కుజను డొకండీ
రీతి బలికె నక్కట యొక
సీతకు రాఘవుడు పుట్టి శివ ధనువెత్తెన్
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిసవరించిన మీ పూరణ ఇంకా బాగుంది. అభినందనలు.
*
విజయ్ రాఘవేంద్ర గారూ,
సంతోషం. అపార్థం చేసుకున్నందుకు మన్నించండి.
*
పండిత నేమాని వారూ,
కుజనుడి మాటగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండినాతికి భర్తగు రీతిని
సీతకు రాఘవుడు . పుట్టి శివధనువెత్తెన్
చేతో మోదముగా భూ
నేతల జేజేల మ్రోత నింగిని దాకన్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
‘భర్త + అగు’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ పతి యగు అంటే సరి.
పోతన పుత్రుడ! శుంఠా!
రిప్లయితొలగించండిజీతము కోసమె బ్రతుకెడు చిన్మయ రూపా!
నీ తలకాయర! ఎచ్చట
సీతకు రాఘవుఁడు పుట్టి శివధను వెత్తెన్?
రిప్లయితొలగించండిమాతా! జిలేబి! వలదే
జోతల చేర్చుచు పలికెద ఝూటీ బాత్ యే
లా తప్పుతడకలె! నెపుడె
సీతకు రాఘవుఁడు పుట్టి శివధను వెత్తెన్?
జిలేబి
రిప్లయితొలగించండిఆ తల్లి లక్ష్మి రూపపు
సీతకు, రాఘవుఁడు పుట్టి శివధను వెత్తెన్
తా తాళిని కట్టంగన్
చూతము రారండి రండి సుందర మూర్తిన్!
జిలేబి