18, నవంబర్ 2014, మంగళవారం

పద్యరచన - 739

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

చంద్రమౌళి సూర్యనారాయణ చెప్పారు...

ఫలముల నిదియే రాజని
యిల జనులీ జామనెపుడునిష్టపడునులే
యల సామాన్య జనుల యా
పిలండ్రు చౌకగ దొరకును విపణిని యిదియే

subbarao చెప్పారు...

జామపండ్ల రాశి చవులూరగా జేసె
నొకటి రెండు దినిన నొప్పు గాని
యంత కంటె నెక్కు వైనయెడ ల జీర్ణ
శక్తి తగ్గి యగును చర్మ రోగి

వసంత కిశోర్ చెప్పారు...

అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింప నున్నవి !

చౌకగా దొరకెడు - జామ పండు :

01)
_______________________________

ఆకు పచ్చగ నున్నచో ♦ నాపిలు వలె
పసుపు పచ్చగ నున్నచో ♦ పనస వలెను
నద్భుతంబైన రుచి గల్గు ♦ నమృత ఫలము
జనులు చవిగొని మెచ్చగా ♦ జగము నందు
చౌక ధరలోన దొరకెడు ♦ జామ పండె !
_______________________________

Zilebi చెప్పారు...


జామ కాయలను ఫోటో బట్టి
అడ్డకొడమ చేబట్టి అయ్యవారు
పద్య మత్స్యముల రచనవేట
సాగించి 'జమ'జమాయించిరి !!


జిలేబి



లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

ఫలములు పలు విధములుగా
నిల లభియించు, నిట జామనీ రీతిగ క
న్నులకింపుగ లేదని నే
పలుకుట సభ్యతయు కాదు పదుగురిలోనన్.

కంది శంకరయ్య చెప్పారు...

చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘ఇష్టపడును’ అన్నారు కనుక ‘జనులు’ అని కాకుండా ‘జనము’ అనండి.
****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
వసంత కిశోర్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
జిలేబీ గారూ,
మీ భావానికి నా పద్యరూపం....
జామకాయల చిత్రమున్ జక్కఁ బట్టి
యడ్డకొడమను జేపట్టి యయ్యవారు
పద్యమత్స్యముల్ బట్టఁగ వచ్చినార
లిటుల సాగించె జమజమాయిచుకొనుచు.
****
లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ చెప్పారు...

అడవి కాచుమేటిఫలము అమృత ఫలము
బండి మీదపేర్చగ పండ్లు దండి గాను
చూడ బోవకొనగ ధర చుక్క లంటు
అగ్గు వగ్గువ నుచువట్టి అరపు మిగిలె

A.Satyanarayana Reddy చెప్పారు...

అన్ని ఫలములలో జామ యమృత ఫలము
పేదవారికి నచ్చిన ప్రియ ఫలమ్ము
నీరసమ్మును బాపును నిశ్చయముగ
నందుబాటులో ధరలుండు ననవరతము

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

ఫలరాజంబని చెప్పనేర్తురుకదా వ్యాపారసంఘంబులున్
బలమున్ గూర్చునటంచుఁ బల్కిరికదా వైద్యుల్ ముదంబంది స
త్ఫలమౌ పూజలకెల్లవేళలనిరే భక్తాళి "జాంపండు" నీ
కలికాలామృతమై చెలంగెనిది సద్గ్రాహ్యంబుగానిద్ధరన్.

కంది శంకరయ్య చెప్పారు...

బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘ఫలము + అమృత’ అన్నప్పుడు సంధి తప్పక జరుగుతుంది. విసంధిగా వ్రాయరాదు. ‘అడవిలో గాచునది మేటి యమృతఫలము’ అనండి.
****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

sailaja చెప్పారు...

అందును చౌకగ జనులకు
నందలి నౌషధ గుణములు నారోగ్య మిడున్
విందును జేయును కనులకు
మందము నరికట్టు జామి మధురము గాదే!!!

కంది శంకరయ్య చెప్పారు...

శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ చెప్పారు...

ధన్య వాదములు శంకరయ్య గారూ !

అడవిలో గాచునది మేటి యమృతఫలము
బండి మీదపేర్చగ పండ్లు దండి గాను
చూడ బోవకొనగ ధర చుక్క లంటు
అగ్గు వగ్గువ నుచువట్టి అరపు మిగిలె

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

అందరి కందే ఫలములు
అందముగా నుండు చూడ నంతట దొరకున్
అందరును జామపండును
దిందురు సంప్రీతితోడ తియ్యగ నుండున్.

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

అందరి కందే ఫలములు
అందముగా నుండు చూడ నంతట దొరకున్
అందరును జామపండును
దిందురు సంప్రీతితోడ తీయగ నుండున్.

కంది శంకరయ్య చెప్పారు...

గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘అందే’ అన్నది వ్యావహారికం. ‘అందెడు’ అనండి.

Unknown చెప్పారు...

గురువు గారికి వందనములు,తప్పులను సవరించ మనవి.

జామ పండ్లను దినినను జలుబు చేయు
నన్న వారికిని దెలియ దసలు గుణము
జామ పండ్లలోనను జవ సత్తువుండు
తిన్న వారికి కలుగును మిన్న ఫలము.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

దోర దోర జామ దొరికిన పండుగ!
నూరు నెవరి కైన నోరు జూడ!
పంటి రకము దెల్ప వడుపుగా జీల్చిరి
యాకు జేర్చ వాటి యందమెగసె!

కంది శంకరయ్య చెప్పారు...


కుసుమ సుదర్శన్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.